Suryaa.co.in

Andhra Pradesh

‘కెన్‌స్టార్‌’ షిప్‌ను పవన్‌ ఎందుకు వదిలేశారు?

– ఆ షిప్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు?
– ‘కెన్‌స్టార్‌’ షిప్‌లో బియ్యం అక్రమ రవాణా చేస్తోంది ఆర్థిక మంత్రి వియ్యంకు డే
– సముద్రంలోకి వెళ్లిన పవన్‌కళ్యాణ్‌ను అభినందిస్తున్నా
– మచిలీపట్నంలో మీడియా ప్రశ్నలకు బదులిచ్చిన వైయస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

మచిలీపట్నం: తన శాఖ కాకపోయినా ప్రాణాలకు తెగించి ప్రజల ఆస్తిని కాపాడటానికి, షిప్‌ను తనిఖీ చేయడం కోసం సముద్రంలోకి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా అభినందిస్తున్నా. కాకపోతే దానిపై మాకు కొన్ని అనుమానాలున్నాయి. పవన్‌కళ్యాణ్‌ ప్రాణాలకు తెగించి సముద్రంలో ‘స్టెల్లా’ షిప్‌ వరకు మాత్రమే ఎందుకు వెళ్లారు? పక్కనే ఉన్న ‘కెన్‌స్టార్‌’ షిప్‌ వద్దకు ఎందుకు వెళ్లలేదు? కేవలం ‘స్టెల్లా’ చుట్టూనే ఎందుకు రౌండ్లు కొట్టి షూటింగ్‌ చేశారు?.

కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ హడావుడి గురించి మీడియాకు చెందిన రెండు పేపర్లు, 10 టీవీ ఛానళ్ల విలేకరులతో నేను మాట్లాడాను. వారిచ్చిన సమాచారం ప్రకారం ‘స్టెల్లా’లో 36 మంది ట్రాన్స్‌పోర్టర్లు, 35 వేల టన్నుల బియ్యం ఎగుమతి చేయడానికి తెచ్చుకున్నారని తెలిసింది.

అక్కడి వరకు వెళ్లిన పవన్‌కళ్యాణ్, ఆ పక్కనే లంగరేసి ఉన్న మరో షిప్‌ ‘కెన్‌స్టార్‌’లో ఎందుకు తనిఖీ చేయలేదు?

LEAVE A RESPONSE