Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అంటే లిక్కర్.. లిక్కర్ అంటే తెలంగాణగా…డ్రగ్స్ అంటే హైదరాబాద్

వ్యాపారం, కాంట్రాక్టుల్లో ప్రధాన జోక్యం కేసీఆర్ కుటుంబానిదే
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడింది
ఎన్నికల ముందు భగవంతుడే అవినీతిని బయటపెట్టాడు
భారతీయ జనతా పార్టీ చార్జ్ షీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్, ఛార్జ్ షీట్ కమిటీ ఛైర్మన్ మురళీధర్ రావు

దేశంలో అవినీతికి ఉదాహరణగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు. అవినీతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం నడవడం లేదు. పిల్లర్లు కుంగిపోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడింది. ఎన్నికల ముందు భగవంతుడే అవినీతిని బయటపెట్టాడు. రుణమాఫీ వడ్డీలకే సరిపడే పరిస్థితి.. పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ఒక్క పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయలేదు.

దళిత ముఖ్యమంత్రి మొదలు దళిత బంధు హామీ వరకు దగా చేశారు.2014, 2018మేనిఫెస్టో, ప్రజల మధ్య, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారు. జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు.నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ సర్కారు విఫలం అయింది. సింగరేణి వారసత్వ ఉద్యోగాలతో పాటు కారుణ్య నియామకాలు చేపడుతామని వాటిని విస్మరించారు. సింగరేణిలో నిమ్స్ ను ఏర్పాటు చేస్తామని చేయలేదు. వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పారు.. తెరిపించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలు, అవినీతికి సంబంధించిన చాలా అంశాలను ఛార్జ్ షీట్ లో పొందుపరిచాం.

దేవాలయ భూములు తెలంగాణలో కబ్జా అయినంత దేశంలో ఎక్కడా జరగలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అంటే లిక్కర్.. లిక్కర్ అంటే తెలంగాణగా,….. డ్రగ్స్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే డ్రగ్స్ గా మారిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అందుబాటులో లేరు. వ్యాపారం, కాంట్రాక్టుల్లో ప్రధాన జోక్యం కేసీఆర్ కుటుంబానిదే.

LEAVE A RESPONSE