-ముసలోళ్లకు గౌరవం దక్కింది
-సావిత్రిబాయి ఆశయాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మనది
-మిషన్ భగీరథతో మహిళల నీటి కష్టాలు తీరాయి
-స్త్రీ నిధి ద్వారా మహిళలు ఆర్ధికంగా, వ్యాపారులుగా ఎదుగుతున్నారు
-సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో మహిళామణులను సన్మానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
(పాలకుర్తి నియోజకవర్గం – తొర్రూరు): ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మహిళలకు సాధికారత పెరిగిందని, ముసలోళ్లకు గౌరవం దక్కిందని, మహిళలు ఆర్థికంగా, వ్యాపారులుగా ఎదుగుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఆయా రంగాల్లో విశేష కృషిచేసిన మహిళామణులను శాలువాతో సన్మానించి, అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. .మనందరం సావిత్రి భాయి ఆశయాలను ముందుకు తీసుకుని పోతున్నాం.సావిత్రి బాయి పూలే 192వ జయంతి వేడుకలు చేసుకున్నాం.నేను మొదట్లో ఎమ్మెల్యేగా అయినపుడు అక్కడికి వెళ్ళినపుడు చూడడానికి బయటకు మహిళలు రావడానికి కూడా వెనుకాడే వారు. చాటుకు ఉండి చూసేవాళ్ళు. అప్పట్లో మహిళల పరిస్ఠితి అలా ఉండేది.
మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చింది ఇద్దరే ముఖ్యమంత్రులు.ఒకరు ఎన్టీఆర్ , మరొకరు కేసిఆర్. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నపుడు మహిళలకోసం మొదటగా డ్వాక్రా గ్రూపులు పెట్టారు. డ్వాక్రా సభ్యులు కూడా డబ్బులు జమ చేయడానికి బ్యాంక్ కు వచ్చినా బయటకు వచ్చినా బదనాం చేసేవాళ్లు.అప్పట్లో తల్లిగారు వాళ్ళు ఇంటికి వస్తే కోడి కోయడానికి భర్తలను బతిలాడే వాళ్ళు.కానీ ఇప్పుడు భార్యలను బతిలాడే పరిస్ఠితి వచ్చింది.
ఇపుడు మగవాళ్ళ దగ్గర డబ్బులు లేవు.మహిళలు ఐకేపీ, స్త్రీ నిధి ద్వారా వ్యాపారాలు, పారిశ్రామిక వేత్తలు అవుతున్నారు. మంచి చదువులు చదువుకుని ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నారు. మొదట పెన్షన్ విధానం ఎన్టీఆర్ ప్రవేశ పెట్టారు. ఆ పెన్షన్ బాగా పెంచి ముసల్లోళ్ళకు గౌరవం సీఎం కేసీఆర్ కల్పించారు.
కళ్యాణ లక్ష్మి ఎంత మంచి పథకం. అప్పట్లో ఆడపిల్ల పెళ్లికి మేనమామ చీర తెచ్చేది. కానీ ఇప్పుడు మేనమామ కేసిఆర్ అయ్యారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడపిల్ల పెళ్లికి లక్షా 116 రూపాయలు ఇస్తున్నారు.ఇంత ఎక్కువ పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి పథకం దేశంలో ఎక్కడా లేవు.గతంలో ఊర్లకు వెళ్తే బోర్ల కోసం కొట్లాడే వాళ్ళు…నీళ్ళ కోసం పంచాయతీ ఉండేది.
ఎమ్మెల్యే నిధులన్నీ బోర్లకు సరిపోయేవి. కానీ ఇపుడు మిషన్ భగీరథ వల్ల ఆ నీటి గోస పూర్తిగా తీరింది. ఇపుడు ఎమ్మెల్యే నిధులు వేరే వాటికి ఉపయోగ పడుతున్నాయి.మహిళలు చదువుకుంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి.మహిళలు ఆర్ధికంగా పైకి వచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం.మహిళలకు ఇచ్చిన రుణం కచ్చితంగా తిరిగి చెల్లిస్తారు.మహిళలు కుటుంబ పరువు కాపాడుతున్నారు.కార్యక్రమంలో మహిళా మణులను శాలువా కప్పి సన్మానించారు.
సన్మాన గ్రహీతలలో అమర్ సింగ్ తండా, అంగన్వాడీ టీచర్ కమలా దేవి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు పంజా కల్పన, స్కూల్ అసిస్టెంట్ జ్యోతి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వప్న, లయన్స్ క్లబ్ దీప, ఆశా కార్యకర్త తొర్రూరు రేణుక , ఐకేపీ కార్యకర్త రేణుక , జూనియర్ లెక్చరర్ షీలా బేగం, మైనారిటీ స్కూల్ టీచర్ రజిత తదితరులు ఉన్నారు.