Suryaa.co.in

Andhra Pradesh

జాబ్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు పోరాటం

– కలెక్టరేట్ల ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్, తెలుగుయువత, ఇతర విద్యార్థి సంఘాల యత్నం
– పలుచోట్ల ఉద్రిక్తిత, హౌస్ అరెస్టులు
– నిరుద్యోగులు, పోలీసులకు మధ్య తోపులాట

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిరంకుశత్వంగా వ్యవహరించింది. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరిన నిరుద్యోగుల పోరాటానికి అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ అడ్డుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగాల పోరాట సమితి గురువారం నాడు కలెక్టరేట్‌ ఎదుటమహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాకు టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం 2.5 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62కు పెంచడం నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టడమేనన్నారు. నిరుద్యోగులు చేసిన నిరసనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

చిత్తూరులో కలెక్టరేట్ ను విద్యార్థి యువజన సంఘాలు ముట్టడించాయి. పోలీసులకు నిరుద్యోగులకు తోపులాట జరగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. జాబ్ కేలండర్ వెంటనే విడదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం, విఫలం చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడకక్కడ ముందస్తుగా అరెస్ట్ చేశారు. పోలీసుల అడ్డుకట్ట నుండి తప్పించుకుని టీడీపీ నాయులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

రాష్ట్ర టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, చిత్తూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు కాజూరు రాజేష్ ,తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు రవి నాయుడు లతోపాటు పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో తెలుగు యువత నాయకులు ముద్దుకృష్ణ, బావఝూ, సుధాకర్, అరుణ్ పాల్గొన్నారు. అరెస్టు చేసిన వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

విజయనగరంలో చలో కలెక్టరేట్ కు వెళ్తున్న తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వేమలి చైతన్య బాబు, పతివాడ తారక్ రామా నాయుడు, చీమల సంతోష్ కుమార్, పతివాడ శివరామ విద్యా సాగర్ నాయుడు, పెడిరెడ్ల సత్యన్నారాయణ, పిన్నింటి కిషోర్ కుమార్, బెవర భరత్, కాగాన సునీల్ కుమార్ కొత్తకోట బాలకృష్ణను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
కర్నూలు కలెక్టరేట్ ముట్టడికి వెళ్లిన తెలుగు యువత నాయకులు పాలకుర్తి దివాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకన్నారు. వీరితో పాటు నీలకంఠ రెడ్డి, సల్మాన్ రాజు, బసలదోడ్డి క్రిష్ణ, దుద్ది నాగేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.

కడప కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన తెలుగు యువత అధ్యక్షులు పుత్తా ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి అక్కులుగారి విజయ్ కుమార్ రెడ్డితో పాటు అజ్జుగుట్టు రవితేజ రెడ్డి,రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ జియా ఉద్దీన్,అమర్ నాథ రెడ్డిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

ఒంగోలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నేతలైన బాచిన అశోక్ బాబు, జోసఫ్, బాలరాజు, వంశీ, మాధవ, ప్రేమరాజు చెన్నుపాటి శ్రీకాంత్, మిగతా నేతలను అరెస్టు చేశారు.
ఏలూరు కలెక్టరేట్ వద్ద జాబ్ కాలెండర్ విడుదల చేయాలని ధర్నా చేస్తున్న తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన ఇన్చార్జ్ పొత్తూరి రామరాజును, టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు, తెలుగు యువత అధ్యక్షులు అనుబంధ సంఘాల ముఖ్య నాయకులను పోలీసులు అక్కడి నుండి తరలించారు.

గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులతో వచ్చి కలెక్టరేట్ ఎదుటు ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీసులు వీరిని స్టేషన్ కు తరలించారు. వీరిని నగరంపాలెం పోలీస్టేషన్లో గుంటూరు వెస్ట్ ఇంఛార్జి కోవెలమూడి నాని పరామర్శించారు. తెలుగుయువత చలో కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా అరెస్ట్ అయిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యల్లవుల అశోక్, తెలుగు యువత గుంటూరు తూర్పు అధ్యక్షులు అఫ్రోజ్ ను లాపేట పోలీస్ స్టేషన్లో నిర్భందించారు. వీరిని ఇంచార్జ్ మహమ్మద్ నసీర్ అహ్మద్ పోలిస్టేషన్ కి వెళ్లి విడుదల చేయించారు. చలో కలెక్టరేట్ కు వెళ్లకుండా బాపట్ల పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొల్లూరు నాగ శ్రీధర్ కు ముందస్తుగా నోటీసులిచ్చి హౌస్ అరెస్టు చేశారు.

నిరుద్యోగ సంఘాలు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన కాకినాడ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణ, వి.సతీష్ రాజ్, కాకినాడ పార్లమెంట్ ఉపాధ్యక్షులు మార్ని వెంకయ్య చౌదరి, పెద్దాపురం తెలుగుయువత అధ్యక్షులు జి. చంద్రమౌళిని పోలీసులు అరెస్టు చేశారు. చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిఠాపురం నుంచి తెలుగు యువత నేతలు వియ్యపు రమణరాజు, సూరాడ జాన్, రావుల రమేశ్, మత్స శ్రీనువాస్, అడ్డగార్ల శివ, పెచేటి వీరు నాయుడు బయలు దేరగా వారిని పిఠాపురం స్టేషన్లో పోలీసులు నిలువరించారు.

విజయవాడలోని లెనిన్ సెంటర్లో ఆందోళనకు దిగిన పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు షేక్.నాగూర్ ను అరెస్ట్ చేసి అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కిలారి నాగ శ్రవణ్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

కర్నూలు జిల్లా కలెక్టర్ ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్ నేతలు ప్రయత్నించారు. టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు రామాంజినేయులు, రాష్ట్ర కార్యదర్శులు చూడి శివమూర్తి, వడ్డే పెద్దయ్య, కర్నూలు పార్లమెంట్ అధికార ప్రతినిధి బోయతేజను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

నెల్లూరు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన తెలుగుయువత అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడును జిల్లా పార్టీ కార్యాలయంలోనే నిర్భందించారు. నిర్భందించిన వారిలో కెవికె ప్రసాద్, నాగేంద్ర, మదన్, మురళి, సుధీర్, నవీన్ , హరీష్, విజయ్ శ్రీనాథ్, వసీం ఉన్నారు.

అనంతపురం జిల్లాలో కలెక్టరేట్ల ముట్టడికి బయలు దేరిని నేతలను ఎక్కడికక్కడ పోలీసులునిర్భందించారు. అర్ధరాత్రే పలువురుని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను తనిఖీ చేశారు. టీఎన్ఎస్ఎఫ్ నేత రాంబాబు, రామన్న, లక్ష్మీ నరసింహులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

విశాఖపట్నం జిల్లాలో ధర్నాకు బయలుదేరిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ను అరెస్టు చేశారు. ధర్నాకు వెళ్లే తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి సాయికృష్ణను అరెస్ట్ చేసి విమాడుగుల పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనకాపల్లి పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు సిరిగిరి శ్రీరామ్ మూర్తికి నోటీసులిచ్చి ముందుస్తు అరెస్టు చేశారు.

LEAVE A RESPONSE