సాక్షి టివి విలేకరి అభిరామ్‌పై దాడి సరైంది కాదు

ఏపిబీజేఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీరాహుస్సేన్‌ఖాన్
విజయవాడ: రాష్ట్రంలో జర్నలిస్ట్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, యాజమాన్యాలు సరైన జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంటే మరోవైపు రాజకీయ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపిబీజేఏ) రాష్ట్ర ఉపాధ్యక్షులు పఠాన్ మీరాహుస్సేన్‌ఖాన్ మండిపడ్డారు. మంగళగిరి టిడిపి కార్యాలయం వద్ద సాక్షి టివి విలేకరి అభిరామ్‌రెడ్డిపై టిడిపి నాయకులు దాడి సరైంది కాదని ఏపీబీజేఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి మీరాహుస్సేన్‌ఖాన్ ఖండించారు. రాజకీయ నాయకులు మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం పరిపాటిగా మారిందని, పార్టీ నాయకులకు అనుకూలంగా వార్తలు రాస్తే ఒక విధంగా, వారు చేసిన అక్రమాలు బయటపెడితే మరో విధంగా వ్యవహరించడం సరికాదని, జర్నలిస్ట్‌లు ఉన్నది ఉన్నట్లు రాసే పరిస్థితులు లేకుండా పోయాయని, కవరేజ్‌కి వెళ్ళిన జర్నలిస్ట్‌లపై నాయకులు రాళ్ళు రువ్వడం సరైంది కాదని, రాజకీయ పార్టీలు దాడులు, ఆలోచనలు మార్చుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని, అన్ని రాజకీయ పార్టీ నాయకులను మీరాహుస్సేన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాయకులు ఆకుల వెంకటనారాయణ, శ్రీనివాసరావు, పఠాన్ సైదాఖాన్, పంగులూరి వెంకట్రావ్, తదితరులు అభిరామ్‌రెడ్డిపై దాడులను ఖండించారు.