ఉద్యోగ సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి, జగన్ రెడ్డి తొత్తుగా మారి గిరిజన ఉద్యోగులపై కక్షసాధింపులకు పాల్పడుతున్నాడు

• న్యాయంగా గిరిజనులకు దక్కాల్సిన ఉద్యోగాల్ని కూడా రెడ్డి వర్గానికే కేటాయిస్తున్నాడు
• సచివాలయంలో ఖాళీ అయిన గిరిజనుల పోస్టుల్లో తన వర్గం వారిని నియమిస్తూ గిరిజన యువతకు అన్యాయం చేస్తున్నాడు
• 805 నామినేటెడ్ పోస్టుల్లో జగన్ రెడ్డి తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చాడుతప్ప.. ఇతర వర్గాలకు అవకాశ మివ్వలేదు
• శ్రీశైలం ఐటీడీఏ పీవోగా 2019 నుంచి రవీంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా లతారెడ్డి పనిచేస్తూ గిరిజనుల్ని వేధిస్తూ వైసీపీనేతల్లా పనిచేస్తున్నారు
– టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధారు నాయక్

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాలుగున్నరేళ్ల నుంచీ ఒక అజెండా ప్రకారం గిరిజనులపై కక్షసాధింపులకు పాల్పడుతోం దని, గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్ రెడ్డి, గిరిజనుల సంక్షేమానికి వెచ్చించా ల్సిన రూ.5,355కోట్లను పక్కదారి పట్టించాడని, అవన్నీ చాలవన్నట్టు కొత్తగా గిరిజన ఉద్యోగుల్ని వేధింపులకు గురిచేస్తున్నాడని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ధారు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ సచివాలయం ఉద్యోగసంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి జగన్ రెడ్డి తొత్తుగా మారి గిరిజన ఉద్యోగులపై కక్షసాధింపులకు పాల్పడుతుంటే, ముఖ్యమంత్రి ఆయనకు వత్తాసు పలుకుతున్నాడు. న్యాయంగా గిరిజనులకు దక్కాల్సిన ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లను వెంకట్రామిరెడ్డి తుంగలో తొక్కుతున్నాడు. సచివాలయంలో ఖాళీ అయిన గిరిజన పోస్టుల్లో కూడా ఓసీలనే నియమిస్తున్నారు. జగన్ రెడ్డి నిర్వాకాలతో గిరిజనయువత ఉపాధికోసం వలసలు పోతుంటే, వారికి న్యాయంచేయాల్సిన ప్రభుత్వం గంజాయి సాగు చేసుకొని బతకండి అంటూ నిస్సిగ్గుగా అవహేళనలు చేస్తోంది.

2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులకు అన్యాయం జరక్కుండా వారికి సంబంధించిన పోస్టుల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానం తీసుకొచ్చా రు. కానీ జగన్ రెడ్డి ఆ విధానానికి విరుద్ధంగా గిరిజనులకు దక్కాల్సిన పోస్టుల్ని ఓసీ వర్గాలతో భర్తీ చేయిస్తున్నాడు. వెంకట్రామిరెడ్డి కేవలం రెడ్డి వర్గంకోసమే పనిచేస్తూ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. జగన్ అధికారం లోకి వచ్చినప్పటినుంచీ గిరిజనులపై దాడులు…వేధింపులు… అవమానాలు ఎక్కువయ్యాయి. ఏజెన్సీల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన జీవోనెం-3ని సుప్రీంకోర్టు కొట్టేస్తే దానిపై ఏపీ ప్రభుత్వం అప్పీలుకు వెళ్లలేదు. కేంద్రం నుంచి గిరిజనాభివృద్ధికి వచ్చే ఎన్.ఎస్.టీ.ఎఫ్.డీసీ నిధుల్ని కూడా జగన్ పక్కదారి పట్టించారు.

శ్రీశైలం ప్రాంతంలోని ఐటీడీఏ పీవోగా 2019 నుంచి నేటివరకు రవీంద్రరెడ్డి వ్యవహరిస్తుంటే, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా లతా రెడ్డి పనిచేస్తోంది. వారిరువు రూ డిప్యుటేషన్ పై వచ్చి గిరిజనుల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తూ, వైసీపీ నేతలకంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. గిరిజనుపోస్టుల్లో ఇతరులు చేరడం.. న్యాయంగా తమకు రావాల్సిన ఉద్యోగాలు రాకపోవడంతో గిరిజన యువత బతుకుదెరువు కోసం వలసలు పోతున్నారు. 805 నామినేటెడ్ పోస్టుల్లో జగన్ రెడ్డి తన వర్గానికే ప్రాధాన్యత ఇచ్చాడుతప్ప.. ఇతర వర్గాలకు అవకాశ మివ్వలేదు.

500 పైబడిన జనాభా ఉన్న గిరిజన తండాలు, గూడేలను చంద్రబాబు నాయుడు ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించి వాటి అభివృద్ధికి నిధులు కేటాయించారు. జగన్ అధికారంలోకి రాగానే ఆ నిధులు ఆపేశాడు. రోడ్లు, వైద్యం, విద్య వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా గిరిజనుల్ని నానా అవస్థలు పడేలా చేశాడు. నా ఎస్సీలు.. నాఎస్టీలు… నా బీసీలు అనే జగన్ మాటలు నాలు కకే పరిమితయ్యాయి.

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను జగన్ రద్దుచేయడంతో దాదాపు 17వేల మంది గిరిజన విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. టీడీపీ ప్రభుత్వం గిరిపుత్రిక పథకం కింద గిరిజన ఆడబిడ్డలకు పెళ్లిసమయంలో రూ.50వేలు అందిస్తే, జగన్ రెడ్డి ఇన్నేళ్లలో ఒక్కరికి ఒక్కపైసా ఇచ్చింది లేదు. గిరిజన గురుకులాల్లోని పోస్టులు భర్తీ చేయడంలేదు.” అని ధారునాయక్ తెలిపారు.

Leave a Reply