Suryaa.co.in

Andhra Pradesh

నా ఆఫీసులను వాడుకోండి

– విజయవాడ, గుంటూరు, రేపల్లెలో ఉన్నాయ్‌
– కరకట్ట పనులను వెంటనే చేపట్టండి
– అధికారులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు

విజయవాడ: భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే విజయవాడ, గుంటూరు, రేపల్లెలోని నా క్యాంపు కార్యాలయాలను పునరావాస కేంద్రలుగా రెవెన్యూ అధికారులు ఉపయోగించుకోవాలి. గతంలో వరదల వల్ల కోతలకు గురైన కరకట్టల మరమ్మతు పనులను రెవెన్యూ అధికారులు వెంటనే చేపట్టాలి. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కరకట్టలు దెబ్బతిన్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన చోట్ల కరకట్ట పనులను వెంటనే చేపట్టాలి. కరకట్టలు బలహీనంగా ఉన్నచోట్ల కట్ట పటిష్ఠంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

కట్ట కింద ఉండే గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయం చేసుకోవాలి. భారీ వర్షాలు , వరదల సమయంలో నదీ తీర గ్రామాల ప్రజలు ముంపు బారిన పడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోని కరకట్టల పటిష్ఠతపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఇప్పుడు మరింత ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో మరమ్మతు పనులు చేపడుతూనే తీర గ్రామాల వెంబడి మరిన్ని కరకట్టలను నిర్మించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలి. ఈ వర్షాల వల్ల పాము కాట్లకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ పాము కాటు మందులను అందుబాటులో ఉంచుకోవాలి.

LEAVE A RESPONSE