పుస్తకాల పంపిణీకి వాలంటరీ వ్యవస్థ వినియోగించుకోవడం దుర్మార్గం

– జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ 

తెనాలి : ప్రజల ఖాతాల్లో ఎంత నగదు జమ చేశారనేది పుస్తకాల రూపంలో పంపిణీ ఒక్కొక్క పుస్తకానికి దాదాపు రూ 300 వెచ్చించి ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు పుస్తకాల పంపిణీ కి వాలంటరీ వ్యవస్థ వినియోగించుకోవడం దుర్మార్గం. అదే రీతిలో ఇసుక, మద్యం,అభివృద్ధి, దోపిడీ,భూకబ్జా,రోడ్లు,రైతుల కోసం ఏమిచేశారు లాంటివి పుస్తకరూపంలో ప్రచురించి ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్.

కొత్త సంవత్సరం పాలకులు అంకితభావంతో మనస్ఫూర్తిగా ప్రజల కోసం పనిచేయ్యలని కోరుకుంటున్నా. ప్రభుత్వం సంక్షేమ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి అనే పదం లేకుండా చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన 14,15,ఆర్థికసంఘం నిధులు కూడా ప్రభుత్వం లాక్కొని ఆర్థిక సంక్షోభం సృష్టించింది సర్పంచులకు చెక్ పవర్ తీసేసి అభివృద్ధి నిరోదుకులుగా ప్రభుత్వం మారింది దీనిని జనసేన తరుపున తీవ్రంగా కండిస్తున్నాము.

వాలంటీర్ వ్యవస్థని పెట్టి ప్రజల పేరు చెప్పుకొని ప్రభుత్వ స్వప్రయోజనాల కోసం వాడుకుంటుంది. సంక్షేమం, అభివృద్ధి రెండూ జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఉద్యోగాలు లేక యువత వేరే

రాష్ట్రాలకు వలస పడుతున్నారు. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే.. సీఎం మాత్రం వర్క్ ఫ్రొం హోమ్ అంటూ ఎందుకు ఇంట్లోనే ఉంటున్నారు.

ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. సంక్రాంతి లోపు రైతుల దగ్గర కొనుగోలు నష్టపరిహారం గురించి స్పందించని పక్షాన రైతు దగ్గర ధాన్యం, మిర్చి సరైన ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గుంటూరులో నిరసన కార్యక్రమం చేపట్టనున్నాం.

రైతులు రైతు భరోసా కేంద్రాలకి వెళ్తే అవమానే గురిఅవుతున్నారు తప్ప వారికి ఎక్కడ భరోసా కల్పించలేకపోతున్నారు. ప్రభుత్వం కి వెతిరేకంగా మాట్లాడిన అసహనం వ్యక్తం చేసిన వాళ్ళవి పథకాలు రేషన్ కార్డులు లాంటివి తొలగించనవి వాస్తవం కాదా? రాష్ట్రంలో ఇన్ని అప్పులు చేస్తున్న ప్రభుత్వం అభివృద్ధి ఎందుకు చెయ్యేలేకపోతుంది అభివృద్ధి చేస్తేనే సంక్షేమం చెయ్యగలం.

రాష్ట్రంలో అభివృద్ధి చేస్తేనే యువతకు ఉద్యోగులు వంటివి మేలు కలుగుతుంది. కరోన గత ఒకటి,రెండు అవచ్చినప్పుడు ప్రభుత్వం విఫలమైంది ఇప్పుడు మూడో వేవ్ వస్తుంది ప్రభుత్వం ఏమిచేస్తుందో తెలియని పరిస్థితి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ప్రజలు అంత భారీ మెజారిటీ ఇచ్చారు అధికెవలం ప్రజలను మోసం చెయ్యటానికె పరిమతం అయ్యారు అని తెలిపారు.

Leave a Reply