Suryaa.co.in

Andhra Pradesh

ఉత్తరాంధ్ర ద్రోహి బొత్స!

– కిమిడి కళా వెంకటరావు విమర్శ

శ్రీకాకుళం: సొంత లాభమే అజెండాగా రాజకీయాలు చేసే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వ ప్రజారంజక పాలనపై విమర్శలు చేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం. పేరుకే ఉత్తరాంధ్ర నాయకుడు, వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు తీసుకొచ్చిన దాఖలాలు లేవని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనల విడుదల చేశారు.

కూటమి ప్రభుత్వంలో టీసీఎస్, కాగ్నిజాంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రకు తీసుకొస్తే… మీరు భూ కబ్జా రాయుళ్లను, దోపిడీదారులను ఉత్తరాంధ్రకు తీసుకొచ్చారు. బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితంలో ఒక్క మంచి కూడా ఉత్తరాంధ్ర ప్రజల కోసం చేయలేదు. పైగా గత టీడీపీ హయాంలో వచ్చిన అనేక పరిశ్రమలను అధికారంలోకి వచ్చిన వెంటనే తరిమేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాటాలు వేసుకొని వైసీపీ నేతలు భూ దోపిడీ చేశారని ఆరోపించారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ను అడ్డుకున్నారు. రుషికొండను బోడిగుండు చేశారు. ఇవన్నీ బొత్స సత్యనారాయణ మరిచిపోయినట్టు ఉన్నారు. కేలవం కుల, మత, ప్రాంతీయ విద్ద్వేశాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే వైసీపీకి, జగన్ రెడ్డికి వచ్చిన విద్య. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసింది. 80 శాతం భోగాపురం ఎయిర్ పోర్టు పనులు పూర్తి చేశాం. విశాఖ ఉక్కు పరిశ్రమను, విశాఖ రైల్వే జోన్ ను సాధించాం.

కుల, మత, ప్రాంతాలనే తారతమ్యం లేకుండా సీఎం చంద్రబాబు పాలన అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు చొరవతో రాజధాని అమరావతిలో రూ.లక్ష కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయి. రాయలసీమను పారిశ్రామిక హబ్ గా, ఉత్తరాంధ్రను ఐటీ సెజ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు అహర్నిషలు శ్రమిస్తున్నారు. పరామర్శల పేరుతో విధ్వంసాలు సృష్టిస్తున్న జగన్ రెడ్డికి అధికారం పోయినా ఇంకా బుద్ధి రాలేదు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ నాయకులు రాజకీయ ఉనికి కోసం దిక్కుమాలిన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.

LEAVE A RESPONSE