చంద్రబాబునాయుడిని ఎన్ని మాటలన్నాడో డీజీపీకి, హోంమంత్రికి తెలియదా?

– ముఖ్యమంత్రిని అంటే ఊరుకోమని మంత్రులు హూంకరిస్తున్నారు.. ప్రతిపక్షనేతను అంటుంటే టీడీపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోవాలా?
– పోలీసులు లేకుండా ముఖ్యమంత్రి, వైసీపీనేతలు బయటకొస్తే, అప్పుడుతెలుస్తుంది.. టీడీపీ కార్యకర్తల పవరేంటో.
– ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడిని ఎన్నిమాటలన్నాడో డీజీపీకి, హోంమంత్రికి తెలియదా?
– తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
రాష్ట్రంలోసాగుతున్న అరాచకపాలన, రౌడీరాజ్యాన్నిచూస్తున్నా మని, ఒకఫ్యాక్షనిస్టుకి, 16నెలలు జైలుకువెళ్లొచ్చినవ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే, రాష్ట్రంఎలా తగలబడిపోతోందో, సదరు అధికార ఫలాలు ఎలాఉంటాయో ప్రజలురుచిచూస్తున్నారని, తెలుగు మహిళ రాష్ట్రఅధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆమె మాటల్లోనే …
ఆంధప్రదేశ్ లోని యువతమొత్తాన్ని మత్తుపదార్థాలకు బానిసల్ని చేసేలా ప్రభుత్వ వ్యవహారముందని, దానికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించడమేనా టీడీపీనేత పట్టాభిగారు ప్రశ్నించారు. ఆయనప్రశ్నకు చేతనైతే, దమ్ముంటే సమాధానం చెప్పాలి. తనకు సమాధానం చెప్పడం చేతగాదు కాబట్టి , తన వెంట ఉండే భజన బృందంతో అయినా సమాధానం చెప్పించాల్సింది. అదీచేయకుండా, తన గూండాలతో తెలుగు దేశంపార్టీ కార్యాలయాలపై మూకుమ్మడిగా దాడిచేయించడం, ఈ పాలకులు నీతిమాలిన చర్యల్లో భాగమే. నిన్న టీడీపీ కార్యాలయా లపై రాష్ట్రవ్యాప్తంగా దాడులుజరుగితే, పోలీసులుసిగ్గులేకుండా తమకు తెలియదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగబద్దమైన పదవని, ఆపదవిలో ఉన్నవారి గురించి బాధ్యతగా మాట్లాడాలని డీజీపీ అంటున్నారు.
ఆయనకు వైసీపీ కండువా కప్పారని, ఆమాటల్ని బట్టే తెలుస్తోంది. ప్రతిపక్షనేత అనేది రాజ్యాంగబద్ధ పదవికాదా అని డీజీపీని ప్రశ్నిస్తున్నాం. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న మంత్రులు, ప్రతిపక్షనాయకుడి గురించి నోటికొ చ్చినట్లు బూతులుమాట్లాడొచ్చా అని డీజీపీని ప్రశ్నిస్తున్నాం. ఆ ఖరికి అసెంబ్లీలోకూడా అధికారముందన్న అహంకారంతో బూతులు మాట్లాడినప్పుడు అవి డీజీపీకి, హోంమంత్రికి, స్పీకర్ కు వినిపించలేదా? ఈరోజు ముఖ్యమంత్రి గురించి, ఆయన చేస్తు న్నకార్యకలాపాలగురించి ప్రతిపక్షం ప్రశ్నించకూడదా? రాష్ట్రంలో ఇంటిలిజెన్స్ వ్యవస్థపనిచేస్తోందో లేదో డీజీపీ చెప్పాలి. ఒకేసారి మూకుమ్మడిగా టీడీపీకార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడిజరుగు తుంటే, దానికి సంబంధించిన సమాచారం ఇంటిలిజెన్స్ కు లేదా?
దాడులసమాచారం తెలిసీ, ఇంటిలిజెన్స్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుందా? వైసీపీకార్యకర్తలే చాలాచోట్ల మఫ్టీ పోలీ సుల్లా మారి దాడులకుతెగబడ్డారు. హోంమంత్రి స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డిపై అవాకులుచవాకులు మాట్లాడ వద్దని చెబుతున్నారు. మరి ప్రతిపక్షనేతపై ఇష్టానుసారం మాట్లా డొచ్చా? కోడికత్తిఘటనలో ఆనాడుప్రతిపక్షనేత హోదాలో ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తించారో, ఇప్పుడున్నహోంమంత్రికి తెలియదా? హోంమంత్రి అలా మాట్లాడుతుంటే, మరికొందరుచేతగాని మంత్రు లుకూడా జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అంటూ ఊరుకోమంటూ హూంకరిస్తున్నారు.
అంటే మేం చేతులుముడుచుకొని కూర్చు న్నామా? చంద్రబాబుగారు సంయమనంతో వ్యవహరించారు కాబట్టే, నిన్న వైసీపీనేతలు, మంత్రులు తిరగగలిగారు. లేకపోతే ఇళ్లల్లో కూడా కూర్చోలేరు. టీడీపీ రాష్ట్రబంద్ కు పిలుపునిస్తే, ఆ బంద్ లో పాల్గొనకూడదని గ్రామస్థాయి టీడీపీనేతల నుంచి రాష్ట్ర స్థాయినేతలవరకు అందరినీ పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేశా రు. పోలీసులు ఎందుకంత అత్యుత్సాహం చూపిస్తున్నారు.పోలీసులు లేకుండా ముఖ్యమంత్రిగానీ, వైసీపీ నేతలు, కార్యకర్త లు గానీ, వారి దమ్మేంటో చూపించగలరా? అంత ధైర్యం వారికి ఉందా?
తెలుగుదేశంపార్టీ కార్యకర్తలను పోలీసులతో అడ్డుకోకుండా వైసీపీవారు బయటకువస్తే, ఎవరేంటో తేలుతుంది. వైసీపీ చేసిన దాడిపై ముఖ్యమంత్రి సమాధానంచెప్పాల్సిందే. జరిగినఘటనకు భవిష్యత్ లో వైసీపీనేతలు తగినమూల్యం చెల్లించుకొనే తీరుతారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి, నాడు ముఖ్య మంత్రిగా ఉన్నచంద్రబాబునాయుడిని ఉద్దేశించి అనరాని మాటల న్నాడు. ఆ విషయం ఆయన, వైసీపీనేతలుమర్చిపోయినా ప్రజలె వరూ మర్చిపోలేదు. టీడీపీకార్యకర్తల జోలికివస్తే వైసీపీకి నూకలు చెల్లడంఖాయమని హెచ్చరిస్తున్నాను.