-వేడుకల్లో పాల్గొన్నఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ: గురువారం ఉదయం 8వ డివిజన్ అమ్మాకళ్యాణమండపం వద్ద జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు మట్టా వివేక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ముఖ్యఅతిధిగా హాజరై రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని 500 మందికి అన్నదానం చేశారు. వంగవీటి రంగా పేదల కోసం చేసిన మంచి పనులు, పోరాటాలపై ప్రసంగించారు. మోహనరంగా పేద ప్రజల పక్షాన పోరాటాలు చేశారని, అందువల్లే ఆయన మరణించి 36 సంవత్సరాలు దాటినా ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా మిగిలిపోయారన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన డివిజన్ అధ్యక్షులు మట్టా వివేక్, భోగాది అనిల్ కుమార్, మల్లెల రామకృష్ణ, పాలంకి రామారావు, నాగుల్ మీరా, నారు రామారావు, పొట్లూరి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.