Suryaa.co.in

Andhra Pradesh

కొడాలి నానీ అసలు మనిషేనా? అతనికి మానవత్వం ఉందా?

-నక్సలైట్లు చంపడానికి ప్రయత్నిస్తే, జాతి సంపదైన చంద్రబాబునాయుడిని కాపాడుకోవడానికి కేంద్రప్రభుత్వం ఆయనకు కల్పించిన బ్లాక్ క్యాట్ కమెండో (ఎన్ఎస్ జీ) భద్రత, ఆడవాళ్లు ఎక్కడ తంతారోనని ముఖ్యమంత్రి , బూతుల మంత్రికి కల్పించిన భద్రత ఒక్కటెలా అవుతుంది?
• చంద్రబాబునాయుడిలాంటి వ్యక్తిని పట్టుకొని సెక్యూరిటీలేకుండా రా…చూసుకుందాం అంటావా? నానీ అసలు నువ్వు అన్నమే తింటున్నావా?
• నీ భాషను నీ భార్యాబిడ్డలు సమర్థిస్తారా అన్న సందేహం నాకుంది.
• రామయ్య అనేవ్యక్తి గెలిచినా, ఓడినా నీతినిజాయితీలకు కట్టుబడి చంద్రబాబుతోనే ఉంటాడు
• నీకు లాగా పదవులకోసం, పార్టీలు విసిరే మాంసం ముక్కలకోసం ఊరకుక్కలా పరిగెత్తడు నానీ
-టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య
ఈరోజు ఉదయం ఒక న్యూస్ ఛానల్ డిస్కషన్లో పాల్గొన్నానని, నాతోపాటు, హైదరాబాద్ నుంచి మరోమహిళకూడా పాల్గొన్నారని, ఆమె మాట్లాడుతూ తాము హైదరాబాద్ లో ఉంటు న్నామని, మీ రాష్ట్రంలో లేనందుకు సంతోషపడుతున్నామని, మంత్రి కొడాలినానీ మనిషే కాడని, ఆయనకు మానవత్వంలేదని, ఆయన మాటలు అతని భార్యాబిడ్డలు వింటారా అ న్న ఆమెమాటలతో తానైతే మానవత్వం ఉన్నవ్యక్తిగా సిగ్గుపడ్డానని, మరి ఆమె మాటలకు ఈ ముఖ్యమంత్రి, సదరుమంత్రి సిగ్గుతో తలదించుకుంటారా అని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య ప్రశ్నించారు. శనివారం ఆయన మంగళగిరి లోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం…!
మంత్రి కొడాలిశ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నానీ బూతులువినే దుస్థితి తమకులేకుండా పోయిందని పొరుగురాష్ట్రాల్లోని మహిళలు సంతోషపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి వెళ్లి హైదరాబాద్ లో స్థిరపడినవారు. ఉదయం ఒకన్యూస్ ఛానల్ చర్చావేదికలోపాల్గొ న్నాను. నాతోపాటు గుడివాడలో పుట్టిపెరిగి, హైదరాబాద్ లో స్థిరపడిన ఒకామె మాట్లాడు తూ, “వర్లరామయ్య గారు మాదికృష్ణాజిల్లా గుడివాడ, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటు న్నాం. హైదరాబాద్ లో చాలా సేఫ్ గా ఉన్నాం. మీరాష్ట్రంలోని బూతుల రణగొణధ్వనుల మధ్య తాము లేము, అవివినే స్థితిలో లేనందుకు సంతోషిస్తున్నాం” అన్నది. ఆమె మాటల తో ఈ రాష్ట్రపౌరుడిగా, మంచిమానవత్వం ఉన్నవ్యక్తిగా నేను సిగ్గుతో తలవంచుకున్నా. మరి ముఖ్యమంత్రి గారు మీ సంగతేమిటి? అనాగరిక మంత్రి.. బూతులమంత్రిగా తనపేరుకి ట్యాగ్ లైన్ తగిలించుకున్నవ్యక్తి, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, మీరు సిగ్గుతో తలవంచుకున్నారా లేదా? ఆమె మీరు అసలుమనిషే కాదనిచెప్పింది మంత్రిగారు, మీకు మానవత్వంలేదని, స్ట్రీట్ రౌడీ లా మాట్లాడుతున్నారని, మంత్రిమాట్లాడినట్టు లేదు, అసాంఘికశక్తి మాట్లాడినట్టు ఉందనిచెప్పింది. ఆయన భార్యాబిడ్డలు ఆయన మాటలు వింటారా అని ఆమె ప్రశ్నించింది. నేనుకూడా మీభార్యాపిల్లలను, ఏమ్మా మీ ఆయన, మీ తండ్రి మాట్లాడేటప్పుడు మీరు వింటారా… ఆహా ఏం మాట్లాడారని మీరు చప్పట్లు కొట్టారా అని అడుగుతున్నా. అంతకంటే ఎక్కువేమీ అడగను. ఆ బిడ్డలు కూడా నాబిడ్డల్లాంటివారే.
మీరొక కేబినెట్ మంత్రి…మంత్రిహోదాలో మీరు శాసనసభలో చట్టాలుచేస్తారా? వాటిని రాష్ట్ర ప్రజలు పాటించాలా? అంతకంటే సిగ్గుచేటు మరోటి ఉంటుందా? అసలు మానవత్వం ఉన్న మనుషులు ఎవరైనా సరే నానీ మాటలు వింటే, ఛీఛీ ఈ మంత్రి వస్తున్నాడంటూ పక్కన ఉమ్ముతారు. (ఈ సందర్భంలో కొడాలినానీ మాట్లాడిన మాటలను రామయ్యగారు విలేకరులకు వినిపించారు) మంత్రి మాటలను ముఖ్యమంత్రిగారు కూడా వినాల్సిందే అంటున్నా. కొడాలినానీ గారుమీరు అసలు మనిషేనా? మానవత్వం ఉందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంత్రిని అభినందిస్తారా..లేకఅభిశంసిస్తారా? ఈ మంత్రిని భుజంమీద చెయ్యేసి అభినందిస్తారా..లేక బుద్ధిలేకుండా ఏంటయ్యా ఆ మాటలంటారా? కొడాలినానీ నువ్వు అసలు మనిషివా..మానవత్వంఉందా? చంద్రబాబు గారు వ్యభిచారగృహాలు నడిపారా.. జూదగృహాలు నిర్వహించారా?.. మరి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం అదేవ్యక్తి కాళ్లపై సాష్టాంగపడి, చేతులుసవరతీశావుకదా నానీ? బుద్ధిలేని మంత్రి.. నిన్ను అసభ్యంగా తిట్టడానికి కూడా మాటలరావడంలేదు. ఎందుకంటే నా తల్లిదండ్రుల సభ్యత, సంస్కారాలు నేర్పారు నాకు. ఆ అనాగరికమంత్రి మాట్లాడిన మాటలకు సభ్యసమాజం సిగ్గుపడాల్సిందే.
ఈ బుద్ధిలేని వాడు అంటాడండీ.. “4+4 భద్రతతనకు కల్పించారు..వాళ్లను వదిలేసివస్తాను. నువ్వుకూడా బ్లాక్ కమెండోస్ వదిలేసి రా, నిన్నుతొక్కుకుంటూ విజయవాడకు వెళతాను ” అంటావా? నీకు తెలుగుచెప్పిన తెలుగుమాస్టర్ కనిపిస్తే , ఇదేనా నువ్వు ఈ పక్షికి నేర్పిందని అడుగుతాను. అసలు సెక్యూరిటీ గురించి నీకు తెలుసా మంత్రీ మీకు? మిస్టర్ మినిస్టర్ చెబుతాను వినండి. 2003లో చంద్రబాబునాయుడి లాంటి నేషనల్ ఫిగర్ ను చంపేయాలని నక్సలైట్ల పొలిట్ బ్యూరోలో ఒకనిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలుచేసి, చంద్రబాబునాయుడిగారిని చంపితే ప్రపంచవ్యాప్తంగా నక్సలిజం గ్రూప్ కు ఒక పేరొస్తుంది. ఆ క్రమంలోనే చంద్రబాబునాయుడిగారిని చంపడానికి శ్రీ వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించడానికి ఆయన వెళుతుంటే, అలిపిరిదారిలో 26 క్లైమోర్ బాంబులు చెట్లకు అమర్చి, ఒకేసారి 26 బాంబులను పేల్చారు. ఆఘటనలో చంద్రబాబునాయుడు ప్రయాణిస్తున్న బుల్లెట్ ఫ్రూఫ్ కారు 11అడుగులుపైకి లేచి కిందపడి, నుజ్జనుజ్జయింది. ఆ దేవదేవుడి ఆశీస్సులతో చిన్నచిన్న దెబ్బలతో చంద్రబాబునాయుడు బ్రతికి బట్టకట్టారు. ఆ తరువాత కేంద్రప్రభుత్వం చంద్రబాబు ప్రాణం జాతిసంపదని గుర్తించి, ఎన్ ఎస్ జీ (బ్లాక్ క్యాట్ కమెండోల) భద్రతకల్పించింది.
అలాంటిభద్రతను వదిలేసి రమ్మంటావా.. నానీ. ఆయనకు కల్పించినభద్రత …నీకు ఈ ముఖ్యమంత్రి కల్పించిన 4+4 భద్రత ఒకటెలా అవుతుంది బూతులుమంత్రీ? ఎప్పుడైతే కొడాలినానీ, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావుగారి కూతురు, చంద్రబాబునాయుడి గారి సతీమణిని అసెంబ్లీలో దూషించాడో, అప్పుడు రాష్ట్రమహిళాలోకం ఆగ్రహంతో ఉవ్వెత్తున లేచింది. ఆసమయంలో ఈ మంత్రిని ఆడవాళ్లబారినుంచి కాపాడటానికి, వారిచెప్పుదెబ్బలు, చీపురుదెబ్బలు మంత్రికి తగలకుండా ఉండటానికే ఈప్రభుత్వం అతనికి రక్షణకల్పించింది. మహిళలు నిన్ను కొడతారని ఈ ప్రభుత్వం కల్పించినభద్రత, నక్సలైట్లుచంపుతారని చంద్రబాబుకి కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఎన్ఎస్ జీ భద్రత ఒకటెలా అవుతాయి మంత్రిగారు? నీకేం సిగ్గుమాలిన వాడివికాబట్టి, చంద్రబాబుగారిని సెక్యూరిటీ వదిలిరా అంటున్నావు. ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి, మంత్రి కొడాలినానీని ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? ఆయన మాట్లాడే బూతులలిస్ట్ ముఖ్యమంత్రి నుంచే నానీకి వస్తోందా? లేకపోతే చంద్రబాబుగారి గురించి ఆనీచ నికృష్టపు మాటలేంటి? నా గురించి కూడా నానీ వ్యాఖ్యానించాడు.
ఏం నానీ.. నువ్వు రామయ్యని అనేంతవాడివా?
ఏం నానీ గొంతు బలుస్తోందేం… నువ్వు ఎంత..నీ బిశాచం ఎంత? నువ్వు రామయ్యని అనేంతవాడివా? నా ఓటమి వెంట్రుకముక్కతో సమానం..నువ్వు గెలిచి ఏంసాధించావోయ్ …పిచ్చివాడా? ఓడినా..గెలిచినా రామయ్య చంద్రబాబుతోనే ఉంటాడు. నీలాగా ఎవరో విసిరే మాంసం ముక్కలకోసం, పదవులకోసం ఊరకుక్కలా పార్టీలవెంట పరిగెత్తడు. వర్ల రామయ్య ఓడిపోయినా ఆయన గృహం నీతి,నిజాయితీలకు అడ్డా. పార్టీనే నమ్ముకున్నా, ఎప్పటికీ చంద్రబాబుతోనే ఉంటా. గెలిచినీలా బూతులమంత్రి, బుద్ధిలేని మంత్రి అని అనిపించుకోడు వర్ల రామయ్య. నానీ…నువ్వు నీమాటలకు నిజంగా సిగ్గుపడాలి.
నిన్నుసమర్థిస్తున్న ముఖ్యమంత్రి , నువ్వూ ఇద్దరు కలిసి ఒకమూలనపడి చావండి. ఆడవాళ్లు తంతారని ఈ ముఖ్యమంత్రి నీకు 4 + 4 భద్రతకల్పించాడు. చంద్రబాబునాయుడుగారుపడిపోతే ఈ పనికిమాలిన మంత్రి తొక్కుకుంటూ వెళతాడా? ఏమి మనిషివిరా బాబూ నువ్వూ? అసలు అన్నమే తింటావా నువ్వు? అనాగరిక మంత్రి మాటలకు సభ్యసమాజం మొత్తం అతనిపై కాండ్రించి ఉమ్మాలి. నానీ వ్యాఖ్యలపై పొరుగురాష్ట్రాల్లోఉన్న ఏపీమహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. నానీ మాటలు ఒకఅసాంఘిక శక్తి మాటల్లాఉన్నాయికానీ, మంత్రి మాటల్లా లేవు.
ముఖ్యమంత్రి గొప్పఎస్కేపిస్ట్.. కావాలనే నానీ, అంబటిరాంబాబు, చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్లతో అసెంబ్లీలో బూతులుతిట్టిస్తూ, ఆయన పక్కకు వెళుతున్నారు. చంద్రబాబునాయుడిలాంటి వ్యక్తిని వాడు..వీడూ అంటున్న నీ మాటలకు సభ్యసమాజం మనసులోనే నిన్నుతిట్టుకుంటోంది మంత్రివర్యా. గుడివాడ బూతులమంత్రికి సభ్యతసంస్కారాలు నేర్పడానికి ఒకరిటైర్డ్ తెలుగుటీచర్ కావాలనే ప్రకటనఇవ్వాలనుకుంటున్నా. మంత్రి మాటలకు అతని తల్లిదండ్రుల ఆత్మలుకూడా క్షోభిస్తుంటాయి.
అందరూఛీకొట్టే ఆణిముత్యాల్యాంటి మంత్రివ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆలోచనచేయాలి. అసలు నా అనుమానం ముఖ్యమంత్రి గారే, బూతులుతిట్టేలా బూతులమంత్రిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారేమోనని? కొడాలినానీ, మంగళగిరిలో పర్యటిస్తూ నారాలోకేశ్ ఏమన్నాడో ఒక్కసారి గుర్తుచేసుకో. నా తల్లిని అవమానించిన వాళ్లల్లో ఏఒక్కడినీ వదిలేది లేదంటూ మీసం తిప్పి ఛాలెంజ్ విసిరిన లోకేశ్ రూపంగుర్తుకుతెచ్చుకుంటే ఈ మంత్రికి పడాల్సింది పడుతుంది. ఓ మంత్రీ ఇప్పటికైనా మనిషిలా బతకడానికి ప్రయత్నంచేయండి. మీకంటే దారినపోయే ఊరకుక్క చాలామంచిది మంత్రిగారు. ముఖ్యమంత్రికి నైతికవిలువలు లేవుకాబట్టే నీలాంటి వారిని ఇష్టపడుతూ భుజం తడుతున్నాడు.

LEAVE A RESPONSE