– డీజీపీకి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ
చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీతి భూమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలకు చెందిన మిరప పంట, డ్రిప్ వ్యవసాయ పైపులకు వైసీపీ నాయకుడు ఎస్. శంకర్ రెడ్డి, అతని కుమారులు నిప్పుపెట్టి తగులబెట్టారు.
రాజకీయంగా ఎదుర్కోలేక అధికార వైకాపా నేతలు తెదేపా నాయకుల వ్యవసాయ పంటలను, పరికరాలను నాశనం చేశారు.ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు పలికి ఆయన గెలుపునకు కృషి చేశారు.
దీంతో అధికార వైకాపా స్థానిక నేతలు టీడీపీ నేతలపై ద్వేషం పెంచుకుని మోటార్లు, డ్రిప్ ఇరిగేషన్ పైప్‌లైన్, స్టార్టర్లలకు నిప్పుపెట్టి టమాటా, మిర్చి పంటలను ధ్వంసం చేశారు.పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పోలీసులు రాజీ కుదిర్చేందుకు వైసీపీ నాయకుల తరపున ఫిర్యాదుదారులతో బేరసారాలు ఆడుతున్నారు. కావున తక్షణమే ఫిర్యాదు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.