Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు వర్ల రామయ్య లేఖ

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని పలమనేరు డిఎస్పీ సర్క్యులర్ నోటీసు జారీ చేసారని తెలిసింది. కుప్పం మునిసిపల్ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, 30A విధించామని చెబుతున్నారు.
కుప్పంలో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు ముందస్తు అనుమతి అవసరమని నోటీసులో నిర్ద్వందంగా పేర్కొన్నారు. పలమనేరు డీఎస్పీ జారీ చేసిన నోటీసు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)కి పొంతన లేకుండా ఉంది.ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పుడు మొత్తం పరిపాలన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) పర్యవేక్షణలో వెళుతుంది.ఎస్‌ఈసీ మార్గదర్శకాల మేరకే డీఎస్పీ నోటీసులిచ్చాం అని చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం కుప్పం పోలీసులకు ప్రత్యేకంగా ఏదేని ఆదేశాలు ఇచ్చిందా కుప్పంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు ముందస్తు అనుమతి అవసరమా? దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత నివ్వాలి. అమలులో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ప్రచారం చేసుకునేందుకు ముందస్తు అనుమతి అవసరం లేదు.
ప్రచారంలో పాల్గొనే సభ్యుల సంఖ్య, సమయంపై ఇప్పటికే పరిమితులు ఉన్నాయి. స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గంటే సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. పోలీస్ చట్టం సెక్షన్ 30, 30A ల పేరుతో పోలీసుల జోక్యం ఏకపక్షం. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన అవుతుంది.
కుప్పం పోలీసులు అధికార వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు అధికారం లేకుండా ఆదేశాలు జారీ చేస్తున్నారు. భారతీయ పోలీసు చట్టంలోని సెక్షన్ 30 మరియు 30Aలను అమలు చేస్తూ ఇతర 12 పట్టణ స్థానిక సంస్థలలో ఎక్కడా ఇటువంటి ఆదేశాలు జారీ చేయబడలేదు.
టీడీపీ అభ్యర్థుల ప్రచారంకు భంగం కలిగించేలా కుప్పంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. కావున పలమనేరు డీఎస్పీ ఇచ్చని నోటీసును తక్షణమే రీకాల్ చేయవలసిందిగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం టీడీపీ అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోండి.

LEAVE A RESPONSE