Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగులను ఇబ్బందులు పెట్టేలా పీఆర్సీ: వెంకట్రామిరెడ్డి

గుంటూరు : పీఆర్సీ జీవోలతో ప్రతి ఉద్యోగి ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చీకటి జీవోలను తెచ్చి
secra1 ఉద్యోగులను పోరాట బాట పట్టించిందని విమర్శించారు. ఉద్యోగుల ఐక్యతకు ప్రభుత్వం మార్గం చూపిందన్నారు. జీతాలు పెంచే విధంగా పీఆర్సీ ఉండాలి కానీ.. ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ద చూపాలని.. లేనిచో ఉద్యమం ఉధృతం అవుతుందని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE