Suryaa.co.in

Andhra Pradesh

తాపీ మేస్త్రీలను మోసం చేసిన వల్లభనేని అనుచరులు

-భూ కబ్జాలకు తెగబడిన పిన్నెల్లి అనుచర వర్గం
-టీడీపీ సానుకూల పరుల పింఛన్లు, రేషన్ కార్డులు తొలగించిన వైసీపీ
-న్యాయం, సాయం కోసం పోటెత్తిన బాధితులు

వల్లభనేని వంశీ అనుచరులు గుర్రం నాని, వేణులు తమ చేత పనిచేయించుకుని.. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని.. గన్నవరానికి చెందిన పలువురు తాపీ మేస్త్రీలు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ అశోక్ బాబులను కలిసి వినతి ఇచ్చి తమకు రావాల్సిన డబ్బులు వచ్చేలా చూడాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించిన నేతలు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

పిన్నెల్లికి ముఖ్య అనుచరుడైన కర్నాటి శేషయ్య దుర్మార్గాలకు నాడు అడ్డు అదుపులేకుండాపోయిందని.. అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు డాక్యూమెంట్లతో స్థలాలను కబ్జా చేశాడని.. ఆ తప్పుడు పత్రాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా దుర్గి మండలం దారివేముల ధర్మవరం గ్రామానికి చెందిన కర్నాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశాడు.

అలాగే పిన్నెల్లి అనుచరులైన పుట్లూరి మల్లారెడ్డి, కొల్లి సాంబిరెడ్డిలు దొంగ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి తమపై దౌర్జన్యం చేసి జేసీబీతో తమ స్థంలంలో ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేసి వడ్డెరులమైన తమను పచ్చిభూతులతో తిడుతూ.. చంపేస్తామని బెదిరించారని.. వారితో తమకు ప్రాణ హాణి ఉందని వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మాచర్లకు చెందిన మంజుల వెంకటేష్ నేడు నేతలకు విన్నవించుకొన్నారు.

తనకు 92 సంవత్సరాలని తన బంధువులు టీడీపీలో తిరుగుతుంటే తన రేషన్ కార్డు, పింఛన్ ను వైసీపీ నేతలు తొలగించారని. తనకు రేషన్ కార్డు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని విజయవాడ అశోక్ నగర్ కు చెందిన కె. నిర్మలమ్మ విజ్ఞప్తి చేశారు.

ఏలూరు జిల్లా ఏలూరు చెందిన రెడ్డి రాంబాబు విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వంలో టీడీపీ సానుకూల పరుల పింఛన్ ను ఏలూరులో కుట్రపూరితంగా తొలగించారని.. వారందరూ నిరుపేదలని.. కావునా దయతో గత వైసీపీ తొలగించిన ఫించన్ లను పునరుద్దరించాలని ఆయన నేతలను కోరారు.

చదుం మండలం బురగమంద గ్రామ పంచాయతీ గంటవారిపల్లికి చెందిన గంట విజయ్ కుమార్ విజ్ఞప్తి చేస్తూ.. తనకు పిత్రార్జితంగా వచ్చిన భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని. దీనిపై రెండుసార్లు కలెక్టర్ల వద్దకు వెళ్లినా పట్టించుకోలేదని..తమ భూమిని వైసీపీ నేతల కబ్జా నుండి విడిపించి న్యాయం చేయాలని విన్నవించుకొన్నాడు.

LEAVE A RESPONSE