కరీంనగర్ లో ప్రముఖుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన విద్యాసాగర్

– త్వరలో పరివార్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం
– మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు వెల్లడి
కరీంనగర్: అక్టోబర్ 27: మహారాష్ట్ర మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ సీనియర్ నాయకులు చెన్నామనేని విద్యాసాగర్ రావు బుధవారం నగరంలోని పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలుసుకొని నాటి అనుభవాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఆరెస్సెస్, జనసంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ద్వారా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని.. అప్పటి వారు కొంతమంది చనిపోగా, మరికొందరు వయోభారంతో ఉన్నారని ఆయా కుటుంబసభ్యుల పరివారాన్ని కలిసిపోదామని వచ్చానని విద్యాసాగర్ రావు అన్నారు. మరణించిన మంగళంపల్లి సుధాకర్ శర్మ @ బాజీ రావు, నారాయణదాస్ ముందడా ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు.
అదే శ్రీపురం కాలనీలో నివాసం ఉంటున్న ఆధ్యాత్మిక వేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహిత శ్రీభాష్యం విజయసారధి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. విజయసారధి గారు నవంబర్ లో ఢిల్లీలో పద్మశ్రీ అవార్డు తీసుకోబోతున్నందుకు ఆయనకు విద్యాసాగర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు డాక్టర్ గట్టు మురళిమనోహర్ ను, కుటుంబసభ్యులను వారి ఇంటిలో కలిశారు. మురళిమనోహర్ మంథని నుంచి పోటీ చేసే క్రమంలో ఆనాడు 5 వేలు ఇచ్చి ధైర్యం నూరి పోసారని విద్యాసాగర్ రావు తెలిపారు.
నారాయణ్ దాస్ ముందడనైతే వాజపేయి, అద్వానీ లాంటి పెద్దలకు ఆతిథ్యం ఇచ్చి ఆర్ధిక సాయం అందించడమే కాకుండా కార్యక్రమలలో ప్రత్యేక్షంగా పాల్గొన్నారని తెలిపారు. బాజీ రావు నాటి కాలంలో బీజేపీ కార్యకర్తలు ఆదర్శ వివాహాలు జరిపిస్తున్న క్రమంలో చేయడానికి ధైర్యంగా కులాంతర, మతంతార వివాహాలను చేయడానికి ప్రోత్సాహస్తూ ముందుకు వచ్చేవారని అన్నారు. డాక్టర్ దారం నాగభూషణం కూడా చాలా ధైర్యవంతుడని, గొప్ప డాక్టరని కొనియాడారు.
నాటి వ్యక్తులను స్మరించుకుంటు వారి కుటుంబసభ్యులు ప్రస్తుతం ఉన్న వారితో ఓ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తానని దీనికి బుస్సా శ్రీనివాస్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తారని విద్యాసాగర్ రావు అన్నారు. విద్యాసాగర్ రావు గారి వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి, బుస్సా శ్రీనివాస్, దారం వినోద్, అరవింద్ వ్యాస్, లడ్డు ముండడా, కోల అన్నా రెడ్డి, ఎస్. ఎన్. రెడ్డి, జలపతి రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ప్రభాకర్ యాదవ్, సర్పంచ్ ముత్యాల రమణ రెడ్డి, ఉప్పు రామకృష్ణ, ఒంటెల కరుణాకర్ రెడ్డి, రేకులపల్లి రవీందర్ రెడ్డి, బీజేవైయం జిల్లా ఉపాధ్యక్షుడు ఎడవెళ్లి శశిధర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు వారితో ఉన్నారు.

Leave a Reply