Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి జమానాలో గంజాయి, మాదకద్రవ్యాలు వస్తున్నాయి

– రాష్ట్రం మాదకద్రవ్యాలకు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతికి అడ్డాగా మారితే, డీజీపీ తన దృష్టంతా ప్రతిపక్షనేతలను అరెస్ట్ చేయడంపై పెట్టాడు
– హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సహా, ఇతరరాష్ట్రాలపోలీసులు ఏపీనుంచే గంజాయి, ఇతరమాదకద్రవ్యాలు తమరాష్ట్రాల్లోకి వస్తున్నాయంటే, దానిపై డీజీపీ ఎందుకు స్పందించలేదు?
– ఎన్ఐఏ విజయవాడలో సోదాలుజరిపి, కీలకమైన పత్రాలు స్వాధీనంచేసుకున్నామని చెప్పినప్పడు డీజీపీ ఎందుకు మాట్లాడలేదు?
– రాజకీయాలు, అధికారం శాశ్వతం కాదని కొడాలినానీ, వల్లభనేని వంశీలు గుర్తుంచుకుంటే మంచిది.
– టీడీపీ అధికారప్రతినిధి నాగుల్ మీరా
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నఆలోచనలు పారిశ్రామికవేత్తలకు ఉండేదని, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అదేరాష్ట్రం గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు, అవినీతి, అక్రమాలు, అన్యాయాలకు అడ్డాగా మారిందని టీడీపీ అధికారప్రతినిధి నాగుల్ మీరా స్పష్టంచేశారు. బుధ వారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..
గంజాయి, ఇతరమాదకద్రవ్యాలపై డీజీపీ ఇప్పుడు ఉక్కుపాదం మోపు తాననడం హాస్యాస్పదంగా ఉంది. చేతులుకాలాక ఆకులు పట్టుకున్న ట్టుగా డీజీపీ వైఖరి ఉంది. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండగా, ఇతర దేశాలనుంచి హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు కూడా దిగుమతి అవుతున్నాయని, స్వయంగా ఎన్ఐఏనే విజయవాడలో సోదాలు జరిపింది. ఎన్ఐఏ ఇచ్చిన పత్రికాప్రకటనలోని సారాంశం ఏమిటో కూడా ఐపీఎస్ గా ఉన్న డీజీపీ గ్రహించలేని దుస్థితిలో ఉన్నాడు. తమసోదాల్లో కీలకమైనపత్రాలు స్వాధీనంచేసుకున్నామని కూడా ఎన్ఐఏ చెప్పింది. ఏపీలో సాగుతున్న మాదకద్రవ్యాల వ్యవహరా న్ని చేధించాలని ఎన్ఐఏ గట్టిగా నిర్ణయించుకోవడంతో, ఏపీ పోలీస్ శాఖ ఇప్పుడు మత్తువీడింది.
బాధ్యతగల తెలుగుదేశంపార్టీ మాదకద్రవ్యాల తో రాష్ట్రయువత భవిష్యత్ నాశనమవుతోందని ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరిస్తూనే ఉంది. కానీప్రభుత్వం, ముఖ్య మంత్రి, వైసీపీనేతలు, టీడీపీ కావాలనే ఏపీని బదనాం చేస్తోందని దుష్ప్ర చారం చేశారు. రాష్ట్రం కేంద్రంగా సాగుతున్న గంజాయి, ఇతర వ్యవహారా లపై టీడీపీ చెప్పడం కాదు. దేశంలో అనేకమంది మాట్లాడారు. హైదరా బాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మ్యాప్ వేసి మరీ ఏపీనుంచే గంజాయి తెలంగాణలోకి వస్తుందని చెప్పాడు. (హైదరాబాద్ సీపీ సహా, ఇతరరాష్ట్రాల పోలీస్ అధికారుల వ్యాఖ్యలను ఈ సందర్భంగా నాగుల్ మీరా విలేకరులకు ప్రదర్శించారు) కర్ణాటకకు, ఏపీనుంచి గంజాయి ఎలావస్తుందో బెంగుళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ స్పష్టంగా చెప్పారు. ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, కేరళ పోలీసులు కూడా, తమతమ రాష్ట్రాలకు గంజాయి ఏపీ నుంచే వస్తోందని స్వయంగా చెప్పారు.
ఆయా రాష్ట్రాల పోలీసులు టీడీపీ చెప్పమంటే ఏపీ పేరు చెప్పారా? పోలీస్ అధికారిగా ఉన్న డీజీపీ, ఇతరరాష్ట్రాల ఐపీఎస్ అధికారులవ్యాఖ్యలపై ఏం సమాధానంచెబుతారు? ఆధారాలు, సాక్ష్యాలు ఇవ్వమని టీడీపీవారికి నోటీసులిచ్చే డీజీపీ, అదేవిధంగా ఇతరరాష్ట్రాల పోలీసులకు ఎందుకివ్వడు? ఇతరరాష్ట్రాలపోలీసులతో సమన్వయం చేసుకొని ఇప్పుడు గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ అంటున్నారు. అంటే ఇప్పటివరకు డీజీపీ నిద్రపోయారా అని తాము ప్రశ్నిస్తున్నాం? తమిళనాడు పోలీసులపై నెల్లూరులో గంజాయి స్మగ్లర్లు దాడిచేసినప్పుడు డీజీపీకి తెలియదా? ఆసమయంలో ఏపీ పోలీస్ శాఖ నిద్రపోతోందా?
కేరళ, ఢిల్లీ, రాజస్థాన్ నుంచి కూడా ఆయారాష్ట్రాల పోలీ సులు విచారణ నిమిత్తం ఏపీకి వచ్చారు. అప్పుడు డీజీపీ వారికి ఎందుకు సహకరించలేదు? ఇతరరాష్ట్రాలపోలీసులు ఏపీలో ఉన్న గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై నిఘాపెట్టి, ఎప్పుటినుంచో విచారణ చేస్తుంటే, ఈ డీజీపీఇప్పుడు మేల్కొన్నాడా? అలానే రాష్ట్రంలో కేవలం 4 వేలఎకరాల్లో మాత్రమే గంజాయి సాగు జరుగుతోందని డీజీపీ చెబుతు న్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయిసాగుజరుగుతోందని, దాదాపు 25వేలఎకరాల్లో సాగవుతోందని తాము అంటుంటే, ఎక్కడ ఎవరుసాగుచేస్తున్నారో చెప్పాలని డీజీపీ టీడీపీవారిని ప్రశ్నిస్తున్నాడు. దొంగతనం జరిగిందని తాము ఫిర్యాదుచేస్తే, మీరే దొంగను పట్టుకొని మాకు అప్పగించండి అన్నట్లుగా డీజీపీ వైఖరి ఉంది. ఏపీ పోలీస్ వ్యవస్థ ఎందుకింతలా నిర్వీర్యమైపోయింది? చివరకు జగన్మోహన్ రెడ్డి ఏదిచెబితే అదేచేస్తామన్నట్లుగా పోలీస్ శాఖ తయారవడం బాధాకరం.
రాష్ట్రప్రతిష్టను దిగజార్చేలా ఏపీ ప్రభుత్వపాలనఉంది. నిన్నటికి నిన్న తమిళనాడులో రైల్లో ఏపీనుంచి గంజాయి సరఫరా అవుతుంటే పట్టుకు న్నారు. దానిపై పోలీసులు ఏమని సమాధానంచెబుతారు? ప్రజల తరుపున ప్రతిపక్షనేతలు గొంతువిప్పకూడదా? గంజాయి, ఇతర మాద కద్రవ్యాలపై తాము పోలీస్ శాఖను, ముఖ్యమంత్రిని ప్రశ్నించకూడదా? టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు గారు నిరసనదీక్షచేస్తే, వైసీపీ జనాగ్రహ దీక్షల పేరుతో నిసనలు చేయడం విడ్డూరంగా ఉంది. వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానికనేతలు మాట్లాడుతున్నభాష, వారి హావభావాలు, చూపుతున్న సంకేతాలకు అర్థమేమిటోకూడా వారికి తెలియడంలేదు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవ్యక్తి , ప్రతిపక్షకార్యాలయంపై దాడిజరిగితే దాన్ని ఖండిం చరా? సిగ్గులేకుండా బీపీ పెరిగిందని, అందుకే తమపార్టీ వారు దాడిచే శారని సమర్థించుకుంటాడా? ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని తుంగలో తొక్కేలా హద్దులు మీరి ప్రవర్తిస్తోంది. ఒకపక్క ప్రజలంతా ప్రభుత్వంపెంచిన ధరలతో అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదు. వీటిపై ప్రభుత్వపెద్దలుగానీ, అధికారపార్టీ నేతలు గానీ మాట్లాడరు. పొద్దున్నలేస్తే, చంద్రబాబుని విమర్శించడం, టీడీపీనేతల్ని బూతులు తిట్టడం తప్ప వారికి మరోపని ఉండటంలేదు.
వల్లభనేని వంశీ ఏం మాట్లాడుతున్నాడో అతనికైనా తెలుసా? అతని భాషను అతని తల్లి, భార్య, ఇతరకుటుంబసభ్యులు సమర్థిస్థారా? వంశీ బతుకేంటో అతను నోరువిప్పాక, ప్రజలే చెబుతున్నారు. సోషల్ మీడి యాలో వంశీని గురించి రోజుకో కథనం బయటకు వస్తోంది. చంద్రబాబు నాయుడు టీడీపీ వారు ఏదైనా మాట్లాడితే, అసలు ఒప్పుకోరు. వంశీ, తనకు రాజకీయభిక్షపెట్టిన చంద్రబాబుని విమర్శిస్తేనే, జగన్మోహన్ రెడ్డి ఆనందపడతాడని భావిస్తే, అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదు. నిజంగా కొడాలినానీ, వల్లభనేని వంశీలు అదేఉద్దేశంతో మాట్లాడితే, అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదు. ఎమ్మెల్యే టికెట్టు కోసం ఇదే వంశీ చంద్రబాబు, లోకేశ్ ల దర్శనంకోసం పడిగాపులు పడింది నిజం కాదా?
పట్టాభి లక్ష్యంగా అతనిఇంటిపై దాడిచేస్తారా? పట్టాభి తన భార్యా పిల్లలు భయపడ్డారని, వారిని తీసుకొని, ఎక్కడికో వెళితే, దానిపై కూడా వైసీపీ వారు రాజకీయంచేస్తున్నారు. అది వారి దిగజారుడుతనానికి నిదర్శనం. రాజకీయాల్లో ప్రభుత్వానికి ఎంతభాధ్యతఉంటుందో, అంతే బాధ్యత ప్రతిపక్షానికి కూడాఉంటుంది. ప్రతిపక్షమంటేనే ప్రజలగొంతుక, ఆ విషయం కూడా అధికారంలోఉన్నవారికి తెలియకపోతే ఎలా? ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే మాదకద్రవ్యాలు లభిస్తున్నాయని ఒక తల్లి గతంలో వాపోయింది. ఆమె చివరకుతనబిడ్డను పోగోట్టుకుంది. ఆ తల్లి కడుపుకోతకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు? ముఖ్యమంత్రి పదవి సహా, ఏపదవి ఎవరికీ శాశ్వతంకాదని గుర్తుంచు కోండి. ఒకపక్కన పిచ్చిమద్యాన్ని అమ్ముతూ, ప్రజల ఆరోగ్యాన్ని నాశనంచేస్తున్న ప్రభుత్వం, గంజాయి, ఇతరమాదకద్రవ్యాలతో యువ తనుకూడా నాశనంచేస్తుంటే, ప్రతిపక్షం చూస్తూఊరుకోవాలా?
చంద్రబా బునాయుడి హాయంలో ఏపీ గౌరవమర్యాదలు, పరువుప్రతిష్టలు ప్రపం చవ్యాప్తంగా మారుమోగాయి. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి వారు గతంలో ఏపీకి వచ్చారంటే, అది చంద్రబాబునాయుడి గారి ఘనత. ఈ ముఖ్యమంత్రి వ్యవహారశైలి, పోకడ ఎంతమాత్రం సమర్థనీయమైనది కాదు. 22 ఏళ్లపాటు తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నవారు పెట్టేకేసులు, తప్పుడు విధానాలకు టీడీపీ భయపడదు. నియంత్రత్వ, వికృతపోకడలకు టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకమే. డీజీపీ చేయాల్సింది ప్రతిపక్షనేతలను అరెస్ట్ చేయడంకాదు.. ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచకాలు, అన్యాయాలపై ఉక్కుపాదంమోపాలి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో చలామణీ అవుతున్న గంజాయి, ఇతర మాదకద్ర వ్యాల నియంత్రణపై డీజీపీ కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE