Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడ ప్రెస్ క్లబ్ ను ఖాళీ చేయాల్సిందే

*1980 తో ముగిసిన లీజు
*లీజు పోడిగింపుకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోని వైనం
*2001లో ప్రెస్ క్లబ్ ను ఖాళీ చేయల్సిందిగా ఇరిగేషన్ నోటిసులు
*42 సంవత్సరాలుగా ఇరిగేషన్ నోటీసులు బేఖాతర్
*మాంటిసోరిపై ఉక్కు పాదం:ప్రెస్ క్లబ్ పై మీనమేషాలు

విజయవాడ: ప్రెస్ క్లబ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతు నీటి పారుదల శాఖకు సోమవారం స్పందన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఎ.వి.వి.శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరం గాంధీనగర్లోని ఇరిగేషన్ స్థలం కె.సి. కెనాల్ (రైవస్ కాల్వ) పై విజయవాడ ప్రెస్ క్లబ్ నిర్మాణం జరిగిందని ఆయన అన్నారు.

1971లో ఏర్పడిన ఈ ప్రెస్ క్లబ్ కు ఇరిగేషన్ శాఖ 10 సంవత్సరాల కాలం పాటు లీజుకు ఇచ్చిందన్నారు. సదరు లీజు గడువు ది.31.10.1980 నాటికి ముగిసిందని తెలిపారు. సదరు లీజు గడువు ముగిసిన తర్వాత ఇరిగేషన్ శాఖ పలు దఫాలుగా లీజును పొడిగించుకోమంటూ విజయవాడ ప్రెస్ క్లబ్ యాజమాన్యానికి నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. ఇరిగేషన్ శాఖ కార్యాలయం నోటీసు నెంబరు 570టి తేదీ. 29-11-1991, మరియు నెంబరు, 549టి తేదీ. 15-12-1992 ద్వారా ప్రెనెట్కు లీజుకిచ్చిన 403 1/3 చదరపు గజాలు లీజు గడువు పూర్తయినప్పటికినీ లీజును పొడిగించుకోలేదని, అలాగే లీజుకు చెల్లించాల్సిన సొమ్ము ఇరిగేషన్ శాఖకు చెల్లించడం లేదంటూ నోటీసులు జారీ చేసినప్పటికీ, విజయవాడ ప్రెస్ క్లబ్ ఏ మాత్రం స్పందించ లేదని తెలిపారు.

లీజును పొడిగించుకోక పోవడంతో ఇరిగేషన్ శాఖ కార్యాలయం నోటీసు నెంబరు సి.వి. / ఎం.సి/1796/ ఏం తేదీ 7-12-2001న సదరు ప్రెస్ క్లబ్ స్థలంను ఖాళీ చేయాల్సిందిగా నోటీసు జారీ చేసిందని లీజు లేకుండా నీటి పారుదలశాఖ స్థలంలో కొనసాగుట చట్టరీత్యానేరమని, నోటీసు అందిన వెంటనే సదరు స్థలంను ఖాళీ చేయాల్సిందిగా సదరు నోటీసులో స్పష్టంగా పేర్కొందన్నారు. అలాగే సదరు స్థలం ఖాళీ చేయని పక్షంలో తగు చర్యలు తీసుకుంటామని విజయవాడ కె.సి. డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పేరుతో ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.

ఈ నోటీసు ఇచ్చి 22 సంవత్సరాలైనప్పటికినీ విజయవాడ ప్రెస్ క్లబ్ యాజమాన్యం ఎలాంటి సమాధానమివ్వలేదని సదరు స్థలంను నేటికీ ఖాళీ చేయలేదన్నారు.పైగా సదరు స్థలంలో ఇరిగేషన్ శాఖ అనుమతుల్లేకుండా రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించారని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ కు మూడు సమావేశపు మందిరాలు ఉన్నాయని ప్రెస్ మీట్ లకు ఇచ్చి డబ్బు వసూళ్ళు చేస్తుండటం ద్వారా ప్రెస్ క్రబ్ కు లక్షల్లో ఆదాయం వస్తుందన్నారు. అయితే ప్రెస్ క్లబ్ యాజమాన్యం సదరు సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుని దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపించారు. సదరు సొమ్ములు లీజు అద్దె చెల్లించుకునే అవకాశమున్నప్పటికినీ జర్నలిజం ముసుగు తగిలించుకుని అధికారులను బెదిరిస్తూ ప్రెస్ క్లబ్ స్థలంను ఖాళీ చేయకుండా ఆక్రమించుకుని విలాసాలు చేస్తున్నారని అన్నారు.

1980 తోనే లీజు గడువు ముగిసినందున అనగా నేటికీ 42 సంవత్సరాల కాలంలో ఇరిగేషన్ శాఖ లీజు అద్దెల ద్వారా రావాల్సిన సొమ్ము కోట్లల్లో ఇరిగేషన్ శాఖ నష్టపోయిందనన్నారు. విజయవాడ నగరంలో ఇరిగేషన్ స్థలాల్లో లీజు దారులందరూ లీజు అద్దె సకాలంలో చెల్లించి, లీజులు పొడిగించుకున్నప్పటికినీ (ప్రెస్ క్లబ్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు.తక్షణమే నీటి పారుదల శాఖ తగు విచారణ జరిపి పోలీసుల సహకారంతోనైనా ప్రెస్ క్లబ్ స్థలంను ఖాళీ చేయించి ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE