– 20 సూత్రాలు’ ఛైర్మన్ లంకా దినకర్
శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంకా దినకర్ సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ జీ సంకల్పం వికసిత్ భారత్, ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణ ఆంధ్రలో “ వికసిత్ శ్రీశైలం విశ్వ శాంతి కి ఆలంబనగా “ గా ఈ పుణ్య క్షేత్రం విరాజిల్లాలని పరమ శివుడిని, భ్రమరాంబమాతను కోరుకున్నారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడారు. శ్రీశైలం దేవస్థానం ఆలయ కమిటీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న పోతుగుంట రమేష్ నాయుడు, ఇతర బోర్డ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16 వ తేదీ శ్రీశైలం క్షేత్రం విచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆతిథ్యంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చక్కగా చేస్తున్నారని అన్నారు. శ్రీశైలం పుణ్య క్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తోందని లంకా దినకర్ తెలిపారు.