విజయవాడ: బిజెపి రాష్ట్ర కార్యాలయం లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి స్టేట్ ఆర్గనైజేషనల్ సెక్రటరీ మధుకర్ జీ మాట్లాడుతూ….
బాలగంగాధర తిలక్ గణేశ్ ఉత్సవాలను స్వాతంత్ర్య ఉద్యమంతో అనుసంధానించినట్లే, ఈరోజు మనము కూడా ‘వినాయకచవితి’ని స్వదేశీ ఉద్యమంతో అనుసంధానిద్దాం.
మన పండుగలో వాడే మట్టి విగ్రహాలు, పూజా సామగ్రి, వస్త్రాలు, అలంకరణలు – ఇవన్నీ స్థానిక కళాకారులు, కార్మికులు తయారుచేసిన స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేసి వినియోగిద్దాం.
మహాత్మా గాంధీ ఇలా అనేవారు – “స్వదేశీ అనేది స్వరాజ్యం యొక్క ఆత్మ.”
మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ పిలుపునిస్తున్నారు . “మనమందరం భారతీయులం కాబట్టి భారతదేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేద్దాం.
” స్వదేశీని ప్రోత్సహించడం అంటే – మన రైతుకు మద్దతు ఇవ్వడం మనం చిన్నతరహా పరిశ్రమలకు ఆదరణ కల్పించడం మన భాద్యత గా వివరించారు . ఈ కార్యక్రమంలో బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు