Suryaa.co.in

Andhra Pradesh

మొదటి జీతాన్ని అమరావతికి విరాళం ఇచ్చిన విజయనగరం ఎంపీ

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళం అందజేశారు. ఎంపీగా అందుకున్న తొలి జీతం రూ.1.57 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. ఎంపీలందరి సమక్షంలో ఈ చెక్కును అందజేశారు. దీంతో ఎంపీ అప్పలనాయుడిని చంద్రబాబు అభినందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు.

LEAVE A RESPONSE