క‌డ‌ప‌లో సోష‌ల్ మీడియా మీట్ అండ్ గ్రీట్‌

-ఎల్లో మీడియా కుట్ర‌ల‌ను తిప్పికొట్టాలి
-వైయ‌స్ఆర్‌సీపీ మీడియా కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డి పిలుపు

ప్ర‌భుత్వంపై దుష్ర్ప‌చారం చేస్తున్న ఎల్లోమీడియా, ఎల్లో గ్యాంగ్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా యుద్ధం చేద్దామ‌ని, వారి కుట్ర‌ల‌ను తిప్పికొట్టాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా, మీడియా కో-ఆర్డినేట‌ర్ సజ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్ జిల్లా క‌డ‌ప న‌గ‌రంలో వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన స‌జ్జ‌ల భార్గ‌వ్ సోష‌ల్ మీడియా స‌భ్యుల‌కు దిశా నిర్దేశం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్ర‌బాబుకు ద‌త్త‌పుత్రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎల్లోమీడియా ఉంద‌ని హ‌ద్దు అదుపు లేకుండా ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కాలక్షేపానికి, మనసులో వున్న భావాలను పంచుకోవడానికి వచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు మనిషి జీవితంలో భాగమైపోయింద‌న్నారు. వ్యక్తులను, వ్యవస్థలను, చివరికి దేశాలను సైతం ఇప్పుడు సోషల్ మీడియా శాసిస్తోంద‌ని చెప్పారు. ఎన్నెన్నో ఉద్యమాలకు, పోరాటాలకు సోషల్ మీడియా ఊపిరి పోసింద‌ని తెలిపారు. ప్రభుత్వాలు సైతం సోషల్ మీడియా జోరుకు ముకుతాడు వేయాలని భావించి విఫలమవుతున్నాయ‌న్నారు.

మీడియా త‌న గుప్పిట్లో ఉంద‌ని చంద్ర‌బాబు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, వారి కుట్ర‌ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌గ‌డుదామ‌ని సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కూడా వైరల్ అవుతోంద‌ని, ఇలాంటి వాటిని కూడా ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొట్టాల‌న్నారు. చంద్ర‌బాబు పెయిడ్ సంస్థల‌ను తీసుకువ‌చ్చి త‌ప్పుడు ప్ర‌చారం చేయిస్తున్నార‌ని, పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నార‌ని తెలిపారు. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడం, డిఫెండ్ చేయాల‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సోషల్ మీడియా సైన్యం పెట్టని కోటలా రక్షణగా నిలుద్దామ‌ని పిలుపునిచ్చారు.

కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి, మేయ‌ర్ సురేష్‌బాబు, పార్టీ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు, సోష‌ల్ మీడియా ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Leave a Reply