Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కోరుకున్నా

-దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు
– కనకదుర్గమ్మ శక్తి స్వరూపిణి
– మేళతాళాలతో ఘనస్వాగతం….

విజయవాడ:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు కనకదుర్గమ్మను శనివారం దర్శించుకున్నారు. చంద్రబాబు సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ద్వారం వద్ద మేళతాళాలతో బాబు దంపతులకు వేదపండితులు స్వాగతం పలికారు.

దుర్గమ్మ దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కోరుకున్నా. తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు టీడీపీ అధినేత తెలిపారు. తెలుగు ప్రజలు సిరి సంపదలతో, ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నానన్నారు.

విజయవాడ కనకదుర్గమ్మను సతీసమేతంగా చంద్రబాబు ఇవాళ దర్శించుకున్నారు. తొలుత వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కనకదుర్గమ్మ శక్తి స్వరూపిణి అని అన్నారు. సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించమని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమనే తొలుత దైవదర్శనాలు చేస్తున్నానన్నారు.

తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఎన్ని దుష్ట శక్తులనైనా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తానన్నారు. తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజలు సిరిసంపదలతో ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నాన్నారు.

కనకదుర్గమ్మ శక్తి స్వరూపిణి అని.. సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించమని అమ్మవారిని ప్రార్ధించానని చెప్పారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమనే తొలుత దైవదర్శనాలు చేస్తున్నానన్నారు. తనకు కష్టం వచ్చినప్పుడు న్యాయం కోసం, ధర్మం కోసం దేశ విదేశాల్లో పోరాటాలు చేశారన్నారు. అధికార యంత్రాంగం తమ ధర్మాన్ని నిర్వర్తించాలని చంద్రబాబు సూచించారు.

విజయవాడకు వచ్చిన చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని, టీడీపీ నేతలు కేశినేని చిన్ని, జనసేన నేత పోతిన మహేష్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, అశోక్‌బాబు, నేతలు దేవినేని ఉమా మహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, మాగంటి బాబు, బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు.

LEAVE A RESPONSE