– అదానీపై ఎవరూ విచారణ కమిషన్ వేయరేం?
– దర్యాప్తు సంస్థలు అన్ని అదానీ చేతుల్లో
– డీల్ రద్దు కు కూటమి ప్రభుత్వం వెనక అడుగు
చంద్రబాబు కూడా చర్యలకు వెనకడుగు వేస్తున్నారు
గతంలో ఈ డీల్ పై టీడీపీ ఉద్యమాలు
– పయ్యావుల ఇది భారీ కుంభకోణం అన్నారు
అక్కడ మోడీ చర్యలు లేవు..ఇక్కడ బాబు చర్యలు లేవు
– గవర్నర్‌ను కలసి అదానీతో ఒప్పందాలు రద్దు చేయాలని ఫిర్యాదు చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి: అదానీ,జగన్ మధ్య అవినీతి డీల్ మీద గవర్నర్ కి పిర్యాదు చేశాం.ఈ డీల్ వల్ల ఆంధ్రకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ డీల్ ను రద్దు చేయాలని అడిగాం. దర్యాప్తు జరిపించాలని కోరాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భారం..లాభం అదానీకి. అదానీ కి లాభం కోసమే ఈ డీల్. ఈ డీల్ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు.
రాబోయే 25 ఏళ్లు ఈ డీల్ అంటే వచ్చే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లే. ప్రజలకు నష్టం వచ్చినా పర్వాలేదు..కానీ అదానీ కి లాభం కావాలి. ఇదే సెకి తో గుజరాత్ 1.99 పైసలకు ఒప్పందం చేసుకుంది. కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం 2.49 పైసలు చేసుకుంది. మొత్తంగా యూనిట్ కి 5 రూపాయలు పడుతుంది. ఈ డీల్ వల్ల లక్షల కోట్ల భారం పడుతుంది.
ఇలాంటి ముడుపుల డీల్స్ వల్ల ప్రజలపై విద్యుత్ భారం. ఇప్పటికే 17 వేల కోట్ల సర్దుబాటు చార్జీలు. ఇంత జరిగినా రాష్ట్రం కానీ,కేంద్రం కానీ ఒక్క విచారణ కమిషన్ కూడా వేయలేదు.. ఇదెక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మన దేశంలో జరిగిన అవినీతి అమెరికా లో బయట పడింది. ఇక్కడ దర్యాప్తు సంస్థలు అన్ని అదానీ చేతుల్లో ఉన్నాయి. అన్ని వ్యవస్థలను అదానీ గుప్పెట్లో పెట్టుకున్నారు.
అమెరికా ద్వారా ముడుపుల వ్యవహారం ప్రపంచానికి తెలిసింది. ఇది సిగ్గుచేటు. అంతర్జాతీయ స్థాయిలో మన పరువు పోయింది వీళ్ళ అవినీతి గురించి ప్రపంచం చర్చ చేస్తుంది. అదానీ దేశం పరువు తీశాడు..జగన్ రాష్ట్రం పరువు తీశాడు. అమెరికాలో చర్యలకు అక్కడ కోర్టులు సిద్ధం అయ్యాయి. అరెస్టు లకు సిద్ధం అవుతున్నారు.
కానీ మన ప్రభుత్వం కనీసం ఒక్క చర్య కూడా లేదు. ఇక్కడ చంద్రబాబు కూడా చర్యలకు వెనకడుగు వేస్తున్నారు. అదానీ, మోడీకి చంద్రబాబు భయపడుతున్నారు. అదానీ పేరు కూడా ఉచ్చరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి దర్యాప్తు లేదు. ఈ డీల్ రద్దు చేస్తారా లేదా?
డీల్ రద్దు కు కూటమి ప్రభుత్వం వెనక అడుగు వేస్తుంది. ఈ అక్రమ డీల్ తో ప్రజలు భారం మోయాలా ? గతంలో ఈ డీల్ పై టీడీపీ ఉద్యమాలు చేసింది. PAC ఛైర్మన్ పయ్యావుల ఇది భారీ కుంభకోణం అన్నారు అక్రమంగా సోలార్ పవర్ ను కొన్నారు అన్నారు 1.99 పైసలు కొనే విద్యుత్ ను 2.45 పైసలు పెట్టీ ఎలా కొన్నారు అని ప్రశ్నించారు.
ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ డీల్ ద్వారా అవినీతి జరిగింది అని మీకు తెలుసు ఇంత జరిగినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? చంద్రబాబు కి మనసు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. JPC వేయాలని డిమాండ్ చేసింది. అయినా మోడీ నోరు విప్పడం లేదు.
అక్కడ మోడీ చర్యలు లేవు..ఇక్కడ బాబు చర్యలు లేవు. జగన్ ఆంధ్రను బ్లాంక్ చెక్ లా రాసి ఇచ్చాడు. ఆంధ్ర ను అదానీ ఆంధ్ర ప్రదేశ్ చేశారు. మొత్తం పోర్టు లను అమ్మేశాడు. రాష్ట్రాన్ని జగన్ అదానీ కి దోచి పెట్టారు. ఇదంతా తెలిసి ఎందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే విచారణ కి ఆదేశం ఇవ్వండి. కేంద్రంలో JPC వేయండి.
జగన్ ముడుపులు తీసుకున్నాడు అని అన్ని ఆధారాలు ఉన్నాయి. అదానీ తో నేరుగా ముడుపులు మాట్లాడుకున్నారు అని ఆధారాలు ఉన్నాయి. అదానీ కలిసిన వెంటనే సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. లంచాల కోసమే జగన్ ఆ ఒప్పందాలకు సంతకాలు పెట్టారు. జగన్ అవినీతి పరుడు కాకపోతే బిడ్డల మీద ప్రమాణం చేయండి. లంచాలు తీసుకోక పోతే మీరే ఒక విచారణ జరపాలని కోరండి. ఈ డీల్ లో అదానీ కాకపోతే ఎప్పుడో చర్యలు ఉండేవి. అదానీ ఉన్నాడని ఎవరు నోరు విప్పడం లేదు.