ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడిన విద్యార్థినికి లక్ష రూపాయల బహుమతి అందించిన వక్ప్ బొర్డు చైర్మన్

విజయువాడ మునిసిపల్ కార్పొరేషణ్ మౌలానా ఆజాద్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఉమ్మే కులసుమ్ ఇటివల గుంటురులో జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సంలో పాల్గొన్నది. విద్యయొక్క ప్రాధాన్యత , ప్రభుత్వ పథకాలు అంశాలుగా తీసుకుని ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి అందరిని అబ్బురపరిచింది . ఈ విద్యార్థిని అసామాన్య ప్రతిభకు ముగ్దుడైన ఆంధ్రప్రదేశ్ వక్ప్ స్టేట్ వక్ప్ బొర్డు చైర్మన్ వి .ఖాదర్ బాషా లక్షరూపాయల బహుమతిని ప్రకటించారు . ఈరొజు విజయవాడ కు వచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ప్ బొర్డు కార్యాలయానికి విద్యార్థిని వుమ్మే కులసుము ను పిలిపించారు . ఒక లక్ష రూపాలయాల చెక్కును విద్యార్థి కి అందజేసారు . భవిశ్యత్తులో బాగా చదువుకోవాలని అశీస్సులు అందించారు . ఈకార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు , మౌలానా ఆజాద్ మునిసిపల్ స్కుల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం .నాగలింగేశ్వరరావు , ఇంగ్లీషు ఉపాద్యాయులు ఇక్బల్ బాష తదితరులు పాల్గోన్నారు.