Suryaa.co.in

Andhra Pradesh

విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా యుద్ద ప్రాతిపదిన చర్యలు

– రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో ఏమాత్రం అంతరాయం లేకుండా యుద్ద ప్రాతిపదిన పునరుద్దరణ పనులను చేపట్టాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలు, ఈదురుగాలుల వల్ల వివిధ ప్రాంతాల్లో కూలిన కరెంటు స్తంభాలు, తెగిన వైర్లు, దెబ్బతిన్న ఫీడర్ల పునరుద్దరణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి టెలీకాన్ఫరెన్సు ద్వారా ఆయన సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూలిపోయిన విద్యుత్ స్తంభాలను, తెగిన వైర్లను, దెబ్బతిన్న ఫీడర్లను యుద్ద ప్రాతిపదిక పునరుద్దరించి ప్రజలకు ఎటు వంటి అసౌకర్యంకలుగ కుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అదే విధంగా రాబోయే 48 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సరఫరాలో ఎటు వంటి అంతరాయం, అసౌకర్యం లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని పలు విద్యుత్ సంస్థల సిఎండీలు ఈ టెలీకాన్పరెన్సులో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE