Suryaa.co.in

Telangana

వరంగల్ సభ చరిత్రలో నిలవాలి

– రజతోత్సవ సభలో గ్రేటర్ సత్తా చాటదాం
– మాజీ మంత్రి తలసాని పిలుపు

హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన బీఆర్ఎస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఈ నెల 27 వ తేదీ నాటికి 25 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో అదే రోజున వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.

27 వ తేదీన అన్ని డివిజన్ లలో గులాబీ జెండాలు, తోరణాలతో అలంకరించి పార్టీ జెండాలను ఎగురవేసి పార్టీ పండుగను ఘనంగా నిర్వహించాలని చెప్పారు. జెండా ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభకు బయలు దేరాలని అన్నారు.

పార్టీ అన్ని స్థాయిల నాయకులు సమన్వయంతో వ్యవహరించి పెద్ద సంఖ్యలో హాజరై చరిత్రలో నిలిచిపోయే విధంగా సభను విజయవంతం చేయాలని కోరారు. సభకు వెళ్లేందుకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండేందుకు RTC బస్సులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE