– తప్పుడు ప్రచారం జరుగుతుంటే వెంటనే కౌంటర్ చేయాలి
– మా పార్టీ జోలికి వస్తే ఊరుకోబోం బిజెపి లీగల్ సెల్
– ఐటీ సెల్ – సోషల్ మీడియా టీమ్‌ల సంయుక్త సమావేశం లో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి లీగల్ సెల్, ఐటీ సెల్ & సోషల్ మీడియా టీమ్‌ల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర లీగల్ సెల్, ఐటీ, సోషల్ మీడియా టీమ్‌ల కీలక సభ్యులు, పలు జిల్లాల ఇన్చార్జులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఏమన్నారంటే.. భారతీయ జనతా పార్టీ రోజురోజుకు బలపడుతున్నందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఐటీ సెల్, సోషల్ మీడియా ద్వారా ఫేక్ అకౌంట్ల ద్వారా బిజెపి నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
ప్రజల్లో బిజెపి పట్ల నమ్మకం మరింత పెరుగుతోంది. తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి రావాలని విస్తృత స్థాయిలో ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇదే భయంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వ్యక్తులు సోషల్ మీడియాను ఉపయోగించి బిజెపి కార్యకర్తలను నైతికంగా దెబ్బతీయడానికి, డీమోరలైజ్ చేయడానికి ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్నారు. ఇప్పటికే బిజెపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న కొంతమంది యూట్యూబ్ ఛానళ్లపై రూ. 5 కోట్ల మేర డిఫమేషన్ కేసులు వేశాం. భారతీయ జనతా పార్టీపై లేదా బిజెపి ముసుగులో ఎవరైనా సోషల్ మీడియాలో ఫేక్, ఫ్రాడ్ న్యూస్ ప్రచారం చేస్తే, ఎంతటి వారైనా సరే పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తున్నాం.
ప్రధాని నరేంద్ర మోదీ , బిజెపి నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై కూడా లీగల్ సెల్ ఆధ్వర్యంలో కేసులు పెట్టి జైలుకు పంపే చర్యలు తీసుకుంటాం. దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎదురుగా నిలబడి సమాధానం చెప్పాలి. సోషల్ మీడియా వెనుక దాక్కొని అసత్యాలు ప్రచారం చేయొద్దు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కొంతమందికి ఫండింగ్ చేసి బిజెపి ని బద్నాం చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. బిజెపి కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లు ఎక్కడైనా తప్పుడు ప్రచారం జరుగుతుంటే వెంటనే కౌంటర్ చేయాలి. We are warriors… and ready for war. మనం యుద్ధంలో ఉన్నాం.
ఫేక్ న్యూస్‌ను తిప్పికొట్టాలి. బిజెపి అనేది క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన పార్టీ. ఈ బలమే భారతీయ జనతా పార్టీని ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఈ నిబద్ధతను చూసి కొంతమంది బిజెపిని, బిజెపి నాయకులను డీ-ఫేమ్ చేయడానికి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారు. “మా పార్టీ జోలికి వస్తే ఊరుకోబోం” అని స్పష్టం చేస్తూ, యూట్యూబర్లు తమ క్రెడిబిలిటీని కాపాడుకోవాలి అని హెచ్చరిస్తున్నాం. బిజెపి సోషల్ మీడియా, ఐటీ, లీగల్ టీమ్‌లు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ ఐడియాలజీ, డిసిప్లిన్‌ను కాపాడేలా పనిచేయాలి. ఈ టీమ్‌లతో ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ మీటింగ్ నిర్వహిస్తాం. మెయిన్‌స్ట్రీమ్ మీడియా & ప్రింట్ మీడియా చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి. అదే విధంగా యూట్యూబ్ ఛానళ్లు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. “అవసరమైతే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిపై విశ్లేషించండి. కానీ వ్యక్తిగత దాడులు చేయడానికి ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం చేస్తే సహించం.