Suryaa.co.in

Andhra Pradesh Telangana

మనకు రావాల్సిన వాటా రావడం లేదు

– విభజన హామీల అమలుకు తెలంగాణ పార్టీలు కూడా సహకరించాలి
– విభజనకు అప్పటి సీఎం రోశయ్య మద్దతు తెలపలేదు
– రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్

బీజేపీ పెద్దలు, చిరంజీవి స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నారని, అంతకు మించి తనకు ఏమీ తెలియదని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం వల్ల కూటమి ఏడు నెలల పాలన అద్భుతంగా ఉందని చెప్పారు. విభజన హామీల అమలు దిశగా రేవంత్ రెడ్డి చర్యలు మొదలు పెట్టాలని, విభజన హామీల అమలుకు తెలంగాణ పార్టీలు కూడా సహకరించాలని చెప్పారు.

ఏపీ పారిశ్రామికవేత్తలు ఏపీలో ట్యాక్సులు కడుతున్నారని, వాటిలో మనకు రావాల్సిన వాటా రావడం లేదని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ తీసుకోవాలని అన్నారు. ఏపీ సమైక్య రాష్ట్రంగా ఉండాలని పోరాటం మొదలు పెట్టింది తానేనని తెలిపారు.

తెలంగాణ విభజనకు అప్పటి సీఎం రోశయ్య మద్దతు తెలపలేదని, ట్యాంక్ బండ్ పై విగ్రహాలు పగలగొట్టేందుకు ఆందోళనకారులు వచ్చినప్పుడు, కృష్ణదేవరాయల విగ్రహం పగలగొట్టే ముందు తమపై దాడి చేయాలని కోరానని, దీంతో ఆందోళనకారులు తమను గౌరవించి వెనక్కి వెళ్లారని చెప్పారు.

LEAVE A RESPONSE