– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్
– ఆర్.డి. విల్సన్ @ శరత్ చంద్ర తెలుగు మరియు సంస్కృత అకాడమికి అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా సంపాదక రచయితలు, భాషాభిమానులతో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘ఆత్మీయ సమ్మేళనం’
విజయవాడ: తెలుగు భాష కు సంస్కృతం రాజభాష అన్నారు. తెలుగు భాష వల్లే మనం సంస్కృతి నిలబడింది. తెలుగు భాష అధిక రాష్ట్రాల్లో మాట్లాడే పరిస్థితి ఉంది. తాళపత్ర గ్రంథాలు ద్వారా మన భాష నేటి తరానికి అందించడానికి ఎందరో రచయితలు చేసిన కృషి మరువరాదు. భాషకు కులం, మతం లేదన్నారు. మన భాష ను రక్షించడం లో విశ్వనాథ సత్యనారాయణ ని మాధవ్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మనకు గుర్తింపు భాష ద్వారా సాధ్యం అన్నారు.
మధుకర్, బిజెపి సంఘటన ప్రధాన కార్యదర్శి, పార్థసారథి, ఆదోని శాసనసభ్యులు, ఆర్.డి. విల్సన్, ఛైర్మన్, తెలుగు మరియు సంస్కృత అకాడమి, డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి – జాషువా కళాపీఠం అధ్యక్షులు, పట్టాభిగారు, ఛైర్మన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, రైతు నాయకుడు, వెలగపూడి గోపాల్ కృష్ణ ప్రసాద్, పోతుల బాలకోటయ్య, ఛైర్మన్, సోషల్ వెల్ఫేర్ బోర్డు; గోనిగుంట్ల కోటేశ్వరరావు, లైబ్రరీ ఛైర్మన్; శ్రీనివాస్ రెడ్డి, రైతు కమీషన్ ఛైర్మన్; నీలాయపాళెం విజయ కుమార్, చైర్మన్, బయోడైవర్శిటీ; నాగోతు రమేష్ నాయుడు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి; గోపీ శ్రీనివాస్, ఓబిసీ మోర్చా అధ్యక్షులు; శ్రీనివాస్ రాజు, బిజెపి స్టేట్ ఇంచార్చ్; పాతూరి నాగభూషణం, బిజెపి స్టేట్ ప్రోటోకాల్ ఛైర్మన్; కిలారు దిలీప్, బిజెపి మీడియా ఇంచార్జ్; అద్దూరి శ్రీరామ్, బిజెపి కృష్ణా జిల్లా అధ్యక్షులు; వంశీధర్ రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు; ప్రొ. సుశీలమ్మ, మాజీ డిప్యూటి డైరెక్టర్, తెలుగు మరియు సంస్కృత అకాడమి, సర్వమంగళ గౌరి, సివిల్స్ తెలుగు అధ్యాపకురాలు; దర్శనం శ్రీనివాస్, బీజేపీ అధికార ప్రతినిధి విచ్చేశారు.
అతిథులందరూ తెలుగు భాష అభివృద్ధికి చేయవలసిన కృషి గురించి వివరించారు. తెలుగు మరియు సంస్కృత అకాడమి సంపాదక రచయితలు, భాషాభిమానులు నూతన అధ్యక్షులవారిని సత్కరించారు.
ఆర్.డి. విల్సన్ ఎస్సీ వర్గీకరణకు చేసిన కృషిని, తెలుగు భాషకోసం చేస్తున్న కృషిని పరిగణనలోకి తీసుకొని కూటమి ప్రభుత్వం తనకు తెలుగు మరియు సంస్కృత అకాడమికి అధ్యక్ష పదవిని ఇచ్చినందుకుగాను హర్షం వ్యక్తం చేస్తూ, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న అతిథులు, భాషాభిమానులు తెలుగు భాషాభివృద్ధికి ఇచ్చిన విలువైన సూచనలు, సలహాలను క్రోడీకరించి తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అధ్యక్షులవారు తెలియజేశారు.