మహిళపై వైసీపీ నేత దాడిని ఖండిస్తున్నాం

-నెల్లూరు కలిగిరి మండలం కుమ్మరకొండూరులో మహిళపై వైసీపీ నేత దాడిని ఖండిస్తున్నాం
నవ్యాంధ్రలో నవ కీచకుడిగా జగన్ రెడ్డి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

నెల్లూరు కలిగిరి మండలం కుమ్మరకొండూరులో భూ ఆక్రమణకు అడ్డుకున్న సుభరత్నమ్మపై వైసీపీ నేత మహేష్ దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. భూవివాదంలో భాగంగా అర్ధరాత్రి భూమిని చదును చేస్తున్న మహేష్ ను అడ్డుకున్నరని సుభరత్నమ్మ గొంతు మీద కాలితో తొక్కి హత్యాయత్నం చేయడం సిగ్గుచేటు.

జగన్ రెడ్డి పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా. ఫ్యాక్షన్ మనస్తత్వమే వైసీపీ సిద్ధాంతం. ప్రశ్నించిన వారిపై దాడులు, ఎదిరించిన వారిని హత్యలు చేయడం, దొరికినంత దోచుకోవడం, కబ్జాలు, దోపిడీలు చేయడం వైసీపీ నాయకుల ప్రథమ కర్తవ్యంగా ఉంది. అందుకే దాడులు పెరిగిపోయాయి. నేడు దేశంలో మహిళలపై భౌతిక దాడుల్లో ఒకటవ స్థానంలోను, లైంగిక వేధింపుల్లో 3వ స్థానంలో ఉండటానికి జగన్ రెడ్డే కారణం.

మహిళలపై దిశను తీసుకువచ్చి మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి నేడు ఈ దాడులకు ఏం సమాధానం చెబుతారు? నేడు మహిళలు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉందా? ఈ మూడేళ్లల్లో వైసీపీ నేతలు దాదాపు 1500 మంది మహిళలపై దాడులు చేసినా ఇంత వరకు ఒక్క వైసీపీ నేతను అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయా? తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇంటి సమీపంలో మహిళపై అత్యాచారం చేసిన వెంకటరెడ్డిని ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వైసీపీ అధికారమదంతో అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతూ మహిళలపై అక్రమాలకు పాల్పడటానికి కారణం జగన్ రెడ్డి కాదా?