Suryaa.co.in

Andhra Pradesh

ప్రెస్ కౌన్సిల్ కు సాక్షిపై ఫిర్యాదు చేశాం

• సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం వైసీపీ నేతలకు షాక్ ను ఇచ్చింది
• అది జిర్ణించుకోలేక సాక్షిలో చంద్రబాబుపై తప్పుడు రాతలు
• దమ్ముంటే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై సజ్జల ఫిర్యాదు చేసుకోవచ్చు
• చేతిలో పేపరు ఉందని ఇష్టం వచ్చినట్లు రాయడం సిగ్గుచేటు
• ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్లు న్యూస్ రాసుకుని క్యాడర్ ను కాపాడుకోవాలని చూస్తున్నారు
• తప్పడు రాతలకు వైసీపీ నేతల తప్పుడు పనులకు త్వరలోనే గుణపాఠం తప్పదు
– టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు

సకల శాఖ మంత్రి సజ్జలపై ఎఫైఆర్ నమోదు అవ్వడం, వైసీపీ నేతలు షాక్ లో ఉండటంతో ఎక్కడ కార్యకర్తలు దూరం అవుతారోనని.. వైసీపీ సొంత పేపర్ లో చంద్రబాబుపై తప్పుడు రాతలకు పూనుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రదాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లడారు.

ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ.. బ్లూ మీడియాలో వార్తలు చూస్తుంటే పూర్తిగా దిగజారిపోయారనిపిస్తుంది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు గా వ్యవహరిస్తున్నారు. రాత్రిని పగలు… పగలుని రాత్రి అని రాయడం ఎంత అబద్దమో అలానే రాస్తున్నారు. చీఫ్ ఏజెంట్ల మీటింగ్ కు చంద్రబాబు రాకుండానే వచ్చినట్లు తప్పుడు రాతలు రాయడం సిగ్గుచేటు. చంద్రబాబు హైదరబాద్ లో ఉన్నారు.

అచ్చెన్నాయుడు రావాల్సి ఉండగా ఆనారోగ్యంతో ఆయన రాలేదు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఐఏఎస్ కృష్ణయ్య, మాజీ సెర్ఫ్ సీఈఓ కృష్ణమోహన్, శ్రవన్ కుమార్, నేను ఆ ప్రోగ్రామ్ లో పాల్గొని కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్ధేశం చేశాం, వారి డౌట్లను నివృత్తి చేశాం.

అవసరమైతే తిరగబడమని చెప్పడం సజ్జల అహంకార పూరిత చర్యలకు నిదర్శం. సజ్జల మీద ఎఫైఆర్ రిజిస్టర్ అవ్వడం వైసీపీ నేతలకు షాకింగ్ న్యూస్. అది ఓర్వలేక సాక్షిలో తప్పుడు రాతలు రాస్తున్నారు. ఇంతకంటే దిగజారుడు తనం లేదు. సజ్జలకు దమ్ముంటే చంద్రబాబు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారని పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. సజ్జల పతనం స్టార్ట్ అయ్యింది. వైసీపీ ఇక ఉండదని జగన్ కు కూడా అర్థం అయ్యింది. వైసీపీ నేతలలో ఇంకా మార్పు రాలేదు.. జూన్ 4 తరువాతే వారిలో మార్పు స్టార్ట్ అవుతుంది. ప్రెస్ కౌన్సిల్ కు సాక్షిమీద ఫిర్యాదు చేశాం.

చంద్రబాబు నాయుడు రాని మీటింగ్ కు ఆయన వచ్చి మాట్లాడినట్లు రాయడం కంటే సిగ్గుమాలిన చర్య ఇంకోకటి లేదు. ఖచ్చితంగా వైసీపీ నేతలు ప్రతి పాపాని మూల్యం చెల్లించుకుంటారు. చంద్రబాబుపై వ్యక్తిగతంగా రాసింది. టీడీపీ నేతలు ఇబ్బంది పెట్టిందానికి తప్పకుండా గుణపాఠం ఉంటుంది. చేతిలో పేపరు ఉందని ఇష్టం వచ్చినట్లు రాయడం సిగ్గుచేటు. ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్లు న్యూస్ రాసుకుని క్యాడర్ ను కాపాడుకోవాలని చూస్తున్నారు.

గుడపాటి లక్ష్మీణారాయణ మాట్లాడుతూ.. సజ్జలపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు రిపోర్టు ఇచ్చాం. ఆ రిపోర్టు ను ఆధారంగా తాడేపల్లి స్టేషన్ ఆఫీసర్ ఆర్పీ యాక్ట్ 153A, 505 క్లాజ్ 2, 125 కింద కేసు నమోదు చేశారు. ఎఫైఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. విట్ నెస్ లకోసం మాకు ఫోన్ చేసి మా నుండి స్టేట్ మెంట్ తీసుకున్నారు

LEAVE A RESPONSE