Suryaa.co.in

Telangana

ఒకటో తేదీన పెన్షన్ ఇచ్చిన చరిత్ర మాది

అమిత్ షా ను కేటీఆర్ కలసిన తర్వాత ఛార్జిషీట్ లో కవిత పేరు మాయమయింది
కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు
సోనియా గాంధీ తో కేసీఆర్ కుటుంబం గ్రూప్ ఫోటో దిగిన విషయం మర్చిపోయారా?
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కేటీఆర్ మాటలు పెద్ద జోక్.కేటీఆర్ కు రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదు. కాంగ్రెస్ ప్రతిపక్షం లో ఉన్నప్పుడే తెలంగాణ ఉధ్యమం మొదలు పెట్టాం. మంత్రి పదవి ఇవ్వకుంటే కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టాడు.41 మంది ఎమ్మెల్యేలం కేంద్రం పై ఒత్తిడి పెంచాం.

సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అని కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ లోనే ఒప్పుకున్నారు. కేసీఆర్ మాట్లాడిన క్లిప్పింగ్స్ తెచ్చుకుని కేటీఆర్ మాట్లాడితే మంచిది. డబ్బు ఎక్కువ అయ్యి కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నాడు.

ఒకటో తేదీన పెన్షన్ ఇచ్చిన చరిత్ర మాది.. కొత్త పెన్షన్ ఇవ్వని చరిత్ర మీది. రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్ని కాంగ్రెస్ కట్టినవే.. కమిషన్ ల కోసం కాళేశ్వరం కట్టారు.ఎన్నికల కోసం ప్రాజెక్టు పూర్తి కాకముందే పాలమూరు రంగారెడ్డి ప్రారంభించేందుకు సిద్దమయ్యారు.తెలంగాణ ద్రోహులంత బీఆర్ఎస్ లోనే ఉన్నారు.

ద్రోహుల ను మీ పార్టీ లో పెట్టుకుని తెలంగాణ ఉధ్యమం గురించి మాట్లాడితే సిగ్గనిపిస్తుంది. తలసాని , గాంధీ ,మాగంటి గోపీనాథ్ ,దానం లాంటి తెలంగాణ ఉధ్యమ ద్రోహులంతా కేటీఆర్ చుట్టే ఉన్నారు. కేసీఆర్ ఒక్కరోజైనా తెలంగాణ ఉధ్యమం గురించి పార్లమెంట్ లో మాట్లాడారా? కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు.

సోనియా గాంధీ తో కేసీఆర్ కుటుంబం గ్రూప్ ఫోటో దిగిన విషయం మర్చిపోయారా? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సరిగ్గా నిర్వహించడం చేతగాని వారా మా గురించి మాట్లాడేది. వైఎస్సార్ చొరవ తోనే ఓఆర్ ఆర్ ,ఫైనాన్షియల్ డిస్ట్రిక్ లు అభివృద్ధి చెందాయి.

హోం మినిస్టర్ కు ప్రగతి భవన్ లో అపాయిట్మెంట్ ఉండదు.పద్మాదేవెందర్ రెడ్డి ని ప్రగతి భవన్ గేటు బయటనుంచే బయటకు పంపించారు. ఇవన్నీ చూస్తే బానిసత్వ పార్టీ ఎవరిదో కేటీఆర్ కు అర్దం కావాలి. కాంగ్రెస్ లో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు. బీఆర్ఎస్ లా మాది కుటుంబ పార్టీ కాదు.. ఇప్పుడు కేసీఆర్, రేపు కేటీఆర్, ఎల్లుండి హీమాన్షు..ఇది మీ విధానం.

అభ్యర్థులను ప్రకటించి ఒక్కో అభ్యర్థికి కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారు.డబ్బులు ఇచ్చిన విషయాన్ని బీఆర్ఎస్ అభ్యర్థులే చెప్తున్నారు. ఎన్నికల మేనేజ్మెంట్ కోసమే అమిత్ షాను కేటీఆర్ కలిసాడు. ఫిబ్రవరి లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దళిత బంధు లో , బీసీ బందు లో కమీషన్ ల దోపిడీ జరుగుతుంది.

దోపిడీ పై హైకోర్టు లో కేసు వేస్తా. బీజేపీ తో సెటిల్మెంట్ చేసుకుని కవిత కేసు ను సైడ్ చేసారు. అమిత్ షా ను కేటీఆర్ కలసిన తర్వాత ఛార్జిషీట్ లో కవిత పేరు మాయమయింది . నాకు పదవులు చాలా చిన్నవి. తుక్కుగూడ సభకు సగం మందిని నల్లగొండ, భువనగిరి నుంచే తీసుకొస్తా.

LEAVE A RESPONSE