– మాకూ అవకాశం ఇవ్వండి
– స్పీకర్‌ను కలిసేందుకు బీఆర్ఎస్ఎల్పీ విఫలయత్నం
– వినతిపత్రం తీసుకోని కార్యదర్శి
– విధిలేకనే మీడియా ద్వారా కోరుతున్నాం
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేక్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి
హైదరాబాద్: శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అట్లాగే విఘాతం కలిగించే అంశాలపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మాపై ఉంది.
ఓవైపు పక్క రాష్ట్రం చంద్ర బాబు బనకచర్ల పేరిట, కేంద్ర ప్రభుత్వం బీజేపీ గోదావరి-కావేరీ లింక్ పేరిట గోదావరి జలాలపై తెలంగాణకున్న హక్కులను కాలరాసే ప్రయత్నాలు చేస్తుంటే వీటికి రేవంత్ రెడ్డి జీ..హుజూర్ అంటున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రానికి జీవనాడి అయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ నేల నుంచి కరువును పారదోలిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రస్తుతం అనేక అపోహలు, అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి.
మరీ ముఖ్యంగా గత కొద్ది నెలలుగా తెలంగాణ మీద గుడ్డి వ్యతిరేకతతో కొన్ని తెలంగాణ వ్యతిరేక, అభివృద్ధి నిరోధక శక్తులు మరియు ముఖ్యమంత్రి,కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు కూడబల్కొని కాళేశ్వరంపైన విపరీతమైన అపోహలను సృష్టించేలా దుష్ప్రచారం చేస్తున్నాయి.
ఉదాహరణకు…. ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదు అన్నారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. మా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా MMD, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, SRSP పునరుజ్జీవం, అన్నపూర్ణ ద్వారా అనేక పంప్ హౌజ్ ల ద్వారా 20 లక్షల ఎకరాలకు పైగా కాళేశ్వరం నీళ్లు అందించబడింది.
ప్రాజెక్ట్ కూలిపోయింది అని అని దుష్ప్రచారం చేశారు ఇది కూడా పూర్తిగా అవాస్తవం.
గతంలో 2022 లో 25 లక్షల క్యూసెక్కుల,2023 లో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన నిటారుగా నిలబడ్డది. ఈ సీజన్ లో కూడా లక్షల కూసెక్కుల వరద వస్తున్న ప్రాజెక్ట్ కు ఏమి కాలేదు.
అవినీతి అని ప్రచారం చేశారు. 94,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగింది. జస్టిస్ ఘోష్ కమీషన్ నివేదిక ని వాడుకొని బీఆర్ఎస్ పై బురద జల్లే పని ప్రభుత్వం చేస్తుంది. నివేదికను ఉద్దేశ్యపూర్వకంగా లీక్ చేసి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు.
కమిషన్ రిపోర్ట్ సీల్డ్ కవర్ లో ఉండగానే వారి పిసిసి అధ్యక్షుడు నివేదిక అంశాలపై బహిరంగంగా ముందుగానే మాట్లాడుతాడు. వారి అనుకూల మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారు. కమిషన్ రిపోర్ట్ లో తప్పు చేశారు అని భావిస్తున్న వ్యక్తుల వివరణ సెక్షన్ 8b ,8c ద్వారా కొరకుండానే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
దీనిపై కోర్టులో మేము న్యాయపోరాటం చేస్తున్నము
ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలు, దీనివల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలు, వివిధ దశల్లో జరిగిన పనులు, సాంకేతిక అంశాలు మరియు ఈ ప్రాజెక్టుతో ముడిపడిన అనేక ఇతర అంశాలను ప్రజల ముందు ఉంచడం ఈ సమయంలో చాలా అవసరం.
రాష్ట్ర ప్రజలతో పాటు , రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన శాసనసభ సభ్యులందరికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం, ప్రాధాన్యత తెలియాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి, ఈసారి జరగనున్న శాసనసభా సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వాస్తవాలను, గణాంకాలు, ఆధారాలతో సహా విశ్లేషణాత్మకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ( పిపిటి ) ద్వారా సమగ్రంగా
వివరించడానికి మాకు అవకాశం కల్పించాల్సిందిగా స్పీకర్ ని కోరుతూ..BRSLP పక్షాన వినతిపత్రం ఇవ్వాళ్ల ఇవ్వాలని స్పీకర్ అపాయింట్మెంట్ కోరాం.
ఉదయం ఫోన్ మాట్లాడిన స్పీకర్ మళ్ళీ చెబుతాను అన్నారు.ఇప్పుడు రెస్పాండ్ కావటం లేదు. సెక్రటరీ ని కలిసి వినతి పత్రం ఇవ్వాలి అనుకుంటే ఆయన స్వీకరించలేదు. విధిలేని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చి విషయాలు చెప్పాల్సి వస్తుంది.
గతంలో ప్రభుత్వం శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరాం. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వవలసిన గురుతర బాధ్యత స్పీకర్‌పై ఉంది. ప్రజలకు నిజాలు తెలిపేందుకు పవిత్రమైన శాసనసభలో ఎలాంటి పక్షపాతం లేదనే సంకేతాన్ని స్పీకర్ ఇస్తూ మాకు పిపిటి కి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ఉన్న హక్కులను, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన మా బాధ్యతను పరిగణనలోకి తీసుకుని,శాసన సభలో కాళేశ్వరం పై పిపిటి ప్రజంటేషన్ ఇచ్చేదుకు మాకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ శాసన సభ పక్షాన స్పీకర్ ని మీడియా ద్వారా కోరుతున్నాం. స్పీకర్ మాకు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు. శాసన సభ వ్యవస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది. ఒకవేళ రేపు స్పీకర్ సమయం ఇస్తే స్వయంగా కలిసి వినతి పత్రం ఇస్తాం.