Suryaa.co.in

Telangana

తబ్లిగి జమాతే సమావేశాన్ని అడ్డుకొని తీరుతాం

– విశ్వహిందూ పరిషత్

ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం దుర్మార్గమని.. అది చట్ట విరుద్ధమని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించడం విద్రోహక చర్య అని విమర్శించింది. వచ్చే జనవరి 6,7 , 8 తేదీలలో వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో మూడు రోజులపాటు జరిగే తబ్లిగి జమతే సమావేశం చట్ట విరుద్ధమన్నారు. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

బలవంతపు మత మార్పిడి, లవ్ జిహాద్ లను ప్రోత్సహిస్తూ సమాజంలో చిచ్చు పెట్టే ఇలాంటి కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీస్ యంత్రాంగం స్పందించి వెంటనే సమావేశం అనుమతిని రద్దు చేయాలన్నారు. లేదంటే విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయని ఆరోపించారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్నారు. టెర్రరిజం, ఇస్లాం వ్యాప్తి, ప్రలోభాలకు గురి చేస్తూ మతమార్పిడులకు పాల్పడటం వంటి కార్యక్రమాలకు శిక్షణ ఇచ్చే తబ్లిగీ జమాతే సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు కేటాయించడం ఏమాత్రం తగదు అన్నారు. నిధుల మంజూరు పై అవసరమనుకుంటే న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

రాష్ట్ర గవర్నర్, హైకోర్టు, డీజీపీ లను సంప్రదించి ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని విశ్వహిందూ పరిషత్ నేతలు స్పష్టం చేశారు. ముస్లిం దేశాలే తబ్లిగి జమాతే కార్యకలాపాలను నిషేధిస్తూ చట్టం చేస్తున్నాయని గుర్తు చేశారు. కానీ భారతదేశంలో ఇస్లాం వ్యాప్తి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించడం దేనికి సంకేతం అని వారి ప్రశ్నించారు. ఈ దేశ సంప్రదాయం, అస్తిత్వం పై దాడి చేసే ఉగ్రవాద మూఖలను పెంచి పోషించడం కాంగ్రెస్ అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక చర్య అని వారు ఘాటుగా స్పందించారు.

ఇస్లామిక్ టెర్రరిస్టు సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను యావత్ ప్రపంచానికి తెలియజేస్తామని.. హిందూ సమాజాన్ని చైతన్యం చేసి తబ్లిగి జమాతే సంస్థ కార్యకలాపాలు అడ్డుకొని తీరుతామని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ రక్తంలోనే ముస్లిం డిఎన్ఎ దాగి ఉందని.. అది నేడు మరోసారి రుజువైందని వారు పేర్కొన్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, సమావేశాలకు అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విశ్వహిందూ పరిషత్ , బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని నేతలు హెచ్చరించారు. ప్రపంచమంతా శాంతి వైపు పరుగులు తీస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం విద్వేషాల వైపు అడుగులు వేస్తోందని వారు దుయ్యబట్టారు.

LEAVE A RESPONSE