Suryaa.co.in

Andhra Pradesh

అమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మిస్తాం

– ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ

విజయవాడ : అమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి, మెడికల్, డెంటల్ కాలేజీలతో పాటు AI యూనివర్సిటీ,స్కిల్ అకాడమీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ ఏర్పాటుకు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ముందుకు వచ్చింది. వీటి ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం కేటాయించాలని ఎస్‌ఆర్‌ఎం ప్రభుత్వాన్ని కోరుతోంది. కాగా నీరుకొండలో 2017లో ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ప్రస్తుతం 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.

LEAVE A RESPONSE