Suryaa.co.in

Andhra Pradesh

అంబేద్కర్ విగ్రహాలకు అవమానాన్ని సహించబోం

– దూబచర్ల దోషులను పెట్టుకోండి
– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య డిమాండ్

అమరావతి: రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు ఎలాంటి అవమానం జరిగినా, సహించబోమని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా దూబచర్లలో అంబేద్కర్ విగ్రహానికి దుండగులు చెప్పల దండ వేసి అవమానించి సంఘటన నేపథ్యంలో ఆదివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

135 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తూ, చట్ట సభల్లో, భారత పార్లమెంటులో అంబేద్కర్ ను గౌరవిస్తున్నా , ఇలాంటి హేయమైన సంఘటనలు జరగటం పట్ల ప్రభుత్వాలే భాధ్యత వహించాలని తెలిపారు.

అంబేద్కర్ కాళ్ళు కడిగి, నెత్తిన నీళ్ళు చల్లుకుంటున్న ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాల మెడలో చెప్పుల దండలు వేసి పైశాచిక ఆనందం వ్యక్తం చేస్తున్న ముష్కరులను పట్టుకోలేరా? అంబేద్కర్ కి సనాతన ధర్మం అంటగడుతూ కొందరు చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోలేరా? అని ప్రశ్నించారు.

జరుగుతున్న అమానవీయ సంఘటనలపై కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చి అంబేద్కర్ విగ్రహాలకు, మహనీయుల ప్రతిమలకు భద్రత కల్పించాలని కోరారు. వెంటనే దూబచర్ల సంఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే, కూటమి ప్రభుత్వానికి తిప్పలు తప్పవని బాలకోటయ్య హెచ్చరించారు.

LEAVE A RESPONSE