– మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన
హైదరాబాద్: సనత్ నగర్ నియోజకవర్గం, రసూల్ పుర సిగ్నల్ వద్ద గల ఎన్.టి.ఆర్ విగ్రహం చుట్టూ గత కొంత కాలంగా బీటలు బారి, విగ్రహం పునాదులు శిధిలావస్ధకు చేరుకుంటున్ప్పటికీ , జి.హెమ్.ఎం.సి పట్టనట్టుగా ఉంటున్నారని మాజీ ఎమ్మెల్యే , తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుజాతికి పౌరుషం నేర్పి, తెలంగాణలో బడుగుబలహీన వర్గాల ఆత్మాభిమానం నిలబెట్టిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడమంటే, తెలుగు జాతిని అవమానించినట్లేనని ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 18 వ తేదీన ఎన్.టి.ఆర్ వర్ధంతి లోపు మళ్ళీ విగ్రహానికి మరమత్తులు చూపించాలని లేని పక్షంలో విగ్రహం వద్ద ధర్నా చేపడతామని కాట్రగడ్డ ప్రసూన అన్నారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత, వాహీద్, గోపాల్ రావు, మల్లేష్, అశోక్ , తదితరులు పాల్గొన్నారు.