Suryaa.co.in

Telangana

కోమటిరెడ్డి స్వార్దనికే ఈ ఉపఎన్నిక

  • కాంట్రాక్ట్ ల ఒప్పందం కోసమే రాజీనామా
  • ఆయనే బహిర్గతం చేశారు
  • ముఖ్యమంత్రి కేసీఆర్ కు వస్తున్న ఇమేజ్ ని అడ్డుకునే కుట్రలో ఉప ఎన్నిక ఒక భాగమే
  • దిగజారుడు రాజకీయాలకు త్యాగాల ట్యాగ్ వేసుకున్నారు
  • కాంట్రాక్టులకు అమ్ముడు పోయిన నేతకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు
  • కాంగ్రెస్ లో ఉంటూనే బిజెపికి కోవర్ట్ గా పనిచేశారు
  • ధర్మయుద్ధంలో విజయం ధర్మానిదే
  • బిజెపి కి ఓటు వేస్తే మోటర్లకు మీటర్లు వస్తాయి
  • విద్యుత్,వ్యవసాయ చట్టాలు అమలులోకి వస్తాయి
  • టి ఆర్ యస్ ను గెలిపించడం ద్వారా అపరిష్కృతసమస్యలకు పరిష్కారం దొరుకుతుంది
  • మునుగోడు లో మాతో పోటీ పడేది కాంగ్రెస్ పార్టీనే
  • ఈ ఎన్నికల్లో టి ఆర్ యస్ నుండే పోటీ
  • మూడో ఉప ఎన్నికల్లో విజయం మాదే
  • హ్యాట్రిక్ సాధించి తీరుతాం
  • టి ఆర్ యస్ లో ఆశావహులే, అసంతృప్తులు లేరు
  • ఆశావాహులు ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష
  • -మంత్రి జగదీష్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థానికే మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టు ల ఒప్పందం మేరకే ఆయన తన పదవికి రాజీనామా చేశారని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే బహిర్గతం చేసారని ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని టి ఆర్ యస్ ఎల్ పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఇంచార్జ్,శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు లతో కలసి ఆయన మాట్లాడారు.దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు వస్తున్న పేరు, ప్రతిష్టలను తట్టుకోలేకే బిజెపి ఉపఎన్నికల కుట్రకు తెర లేపిందని ఆయన దుయ్యబట్టారు. కాంట్రాక్టుల ఒప్పందానికి బిజెపి లో చేరింది చాలక దానికి త్యాగాల ట్యాగ్ లైన్ తగిలించుకుని తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ ఉంటే అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే నని ఆయన విరుచుకుపడ్డారు. కాంట్రాక్తులకు అమ్ముడు పోయిన నేతకు ఎన్నికల్లో పోటీచేసే నైతికత ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టు ఒప్పందాల గురించి ఆయన మాట్లాడిన మాటల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడం తో పాటు ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరిస్తామన్నారు.

ధర్మయుద్ధంలో అంతిమ విజయం ధర్మానిదే అవుతుందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అటువంటి ధర్మపోరాటం ద్వారానే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రాన్ని సాదించారన్నారు.బిజెపి కి ఓటు వేస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్తాయని,విద్యుత్,వ్యవసాయ చట్టాలు అమలులోకి వస్తాయని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి మునుగోడు ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అంతే గాకుండా వంట గ్యాస్ మొదలుకొని పెట్రోల్,డీజిల్ ధరలు సామాన్యుడికి అందనంత దూరం పెరుగుతాయని ఆయన హెచ్చరించారు. టి ఆర్ యస్ ను గెలిపించడం ద్వారానే మునుగోడు లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్నారు.మూడున్నర ఏళ్లుగా మునుగోడు లో అభివృద్ధి కుంటు పడిందన్నారు.అందుకు అక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన రాజగోపాల్ రెడ్డే కారణమన్నారు.మునుగోడు ఉప ఎన్నికల్లో మాకు అంతో ఇంతో పోటీ అంటూ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయే నన్నారు.హుజుర్నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయాలు నమోదు చేసుకున్న టి ఆర్ యస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ఈ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు గెలుపుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గులాబీ శ్రేణులు హ్యాట్రిక్ సాదించబో తున్నారన్నారు. టి ఆర్ యస్ లో ఆశావాహులే ఉంటారని అసంతృప్తు లకు ఆస్కారం లేదన్నారు.ఆశావాహులు ఉండాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని ఆయన చెప్పారు.

LEAVE A RESPONSE