Suryaa.co.in

Andhra Pradesh

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు

– మంత్రి సత్య కుమార్ యాదవ్

ధర్మవరం: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని, ఎలాంటి వివక్షతకు తావు లేకుండా అర్హులైన వారందరికీ పారదర్శకంగా అందజేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

ధర్మవరం పట్టణంలోని శుక్రవారం దీపం పథకం-2 లబ్ధిదారులకు పథకాన్ని పంపిణీ చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో  ప్రధానమైన దీపం పథకం-2 పంపిణీ చేస్తూ హామీని అమలు చేస్తున్నామని తెలిపారు.

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని చెప్పారు. అప్పు చేసి హామీలను నెరవేర్చే కంటే, సంపద సృష్టించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే సునీత, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ చిలకం మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ టీఎస్ చేతన్, హెచ్.పీ గ్యాస్ డీలర్ గోవింద చౌదరి, ఆర్డీవో మహేష్, డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE