– ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ ఢిల్లీ టూర్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రం
హైదరాబాద్: పెండ్లికి పోతున్నవో, పేరంటానికి పోతున్నావో, సావుకు పోతున్నావో, 28 సార్లు పోయినవ్. 28 రూపాయలు తీస్కరాలేదు అని తెలంగాణ పౌరులుగా అడగడం మా బాధ్యత. రాజ్యాంగబద్ధంగా మినహా ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుండి ఒక్క రూపాయి తెచ్చింది లేదు. ఈడీ దాడుల నుండి తప్పించుకోవడానికి ఫైవ్ స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నదెవరో ?
ఈడీ చేసిన దాడులు కనీసం బయటకు ప్రకటించకుండా ఎవరి కాళ్ళు పట్టుకుని తప్పించుకున్నారో? మీ బడెబాయ్ చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు పిట్టలదొరా? పోరాటం మా తెలంగాణ రక్తంలో ఉంది. మేము నీలా ఎన్నడూ ఢిల్లీ గులాములం కాదు. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. కొట్లాడి తెచ్చిన తెలంగాణను తెర్లు చేయాలని ప్రయత్నించి పట్టుబడిన ఓటుకునోటు చరిత్ర నీది. కానీ మా జెండా మా ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధి.