Suryaa.co.in

Andhra Pradesh

ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు రెండున్నరేళ్లు ఏం చేస్తున్నట్లు?

  • ఏపీ ఫుడ్ కమిషన్ ను వర్క్ ఫ్రమ్ హోమ్ గా మార్చేసిన కమిషన్ చైర్మన్, సభ్యులు
  • ఆఫీసుకు రాకుండానే లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వైనం
  • కేసులు ఉన్నవారికి సభ్యులుగా పదవులు
  • రెండున్నరేళ్లలో ఒక్క కేసు కూడా నమోదు చేయని ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు
  • ఉత్తుత్తి తనిఖీలతో హంగామా చేసిన విజయ్ ప్రతాప్ రెడ్డి
  • వేల టన్నులు కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా
  • కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టుకున్న మంత్రి నాదెండ్ల
  • కూటమి ప్రభుత్వం ఇలాంటి కమిషన్ లను వెంటనే ప్రక్షాళన చేయాలి
  • ప్రజల సొమ్ములను జీతాలుగా తింటూ… రాజకీయ తొత్తులగా వ్యవహరిస్తున్న వారిని తక్షణమే తొలగించాలి
  • టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్

మంగళగిరి: సోషల్ మీడియాలో వీడియోల కోసం తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ.. ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి హంగామా చేయడం తప్పా చేసింది ఏమీ లేదని.. ఆఫీసుకు రాకుండా… మీటింగ్ లు లేకుండా లక్షలు జీతాలు తీసుకుంటూ.. రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్నా రెండున్నరేళ్లలో ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా. సభ్యులు, కమిషన్ చైర్మన్ ఫుడ్ కమిషన్ ను నిర్వీర్యం చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు.

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ మట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. గత పాలనలో ఏపీ ఫుడ్ కమిషన్ తీవ్ర అధ్వాన స్థితికి చేరింది. ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు ఏం చేశారో తెలియదు. ఆఫీసులకు రాకుండా వర్క్ ఫ్రమ్ హోం అనేలా నెలకు ఒకటి రెండు రెండు సార్లు వచ్చిపోయేవారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ రూ. 5.35 లక్షలు జీతం తీసుకుంటూ రాజకీయాల్లో మునిగితేలారు.

2024 లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. కాంతారావు, జక్కంపూడి కిరణ్, లక్షారెడ్డి, మిగిలిన సభ్యులు అసలు ఆఫీసుకు రాకుండా ఒక్కోక్కరు నెలకు రూ. 4.58 లక్షలు జీతం తీసుకున్నారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో ఫుడ్ కమిషన్ ఎవరి మీదా ఒక్కటంటే ఒక్క కేసు కూడా పెట్టలేదు. చైర్మన్ మాత్రం తన ఫీల్డ్ విజిట్స్ ని 500 లకు పైగా వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టుకున్నాడు. విజయవాడ ఆఫీసులో ఫుడ్ కమిషన్ మీటింగ్ పెట్టి ఆరునెలలు పైనే అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే జీతాలు ఫుల్ పని నిల్ అన్నట్లుగా వారి పని ఉంది.

ఫుడ్ కమిషన్ సభ్యులు, చైర్మెన్ రాజకీయాల నుంచి వచ్చి ఉండచ్చు.. కానీ నియమింపబడిన తర్వాత, రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే ఫుడ్ కమిషన్ ఒక చట్టబద్దమైన ప్రత్యేక సంస్థ సమన్లు ఇచ్చే అధికారం కలిగిన ఒక పాక్షిక న్యాయవ్యవస్థ లాంటిది. సభ్యులకి చైర్మెన్ కి హై కోర్టు జడ్జీకి ఉన్న అధికారాలు ఉంటాయి.

అంటే కమిషన్ సభ్యులు, చైర్మెన్ ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయకూడదు. కానీ చైర్మెన్ మాత్రం 2024లో కడప జిల్లాలో విస్తృతంగా వైసీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఇలా ఒక కమిషన్ చైర్మెన్ పదవిలో ఉండి, వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడం ఎంతవరకు నైతిక ధర్మమో చైర్మనే చెప్పాలి.

విజయ్ ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పక్కా ఆధారాలు, ఫోటోలు ఉన్నాయి కమిషన్ చైర్మన్ గా ఉండి ఏవిధంగా రాజకీయ కార్యక్రమాల్లో విజయ్ ప్రతాప్ రెడ్డి పాల్గొంటారు? ఒక కమిషన్ చైర్మన్ గా ఉండి ఇలా చేయవచ్చా? ఇలాంటి వ్యక్తులు కమిషన్ చైర్మన్ గా ఉంటే పాలనలో పారదర్శకతం ఉంటుందా?

సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారిని కమిషన్ చైర్మన్ గా సభ్యులుగా నిమయమిస్తారు. కాని పోలీసులు కేసులు ఉన్న వ్యక్తులను ఫుడ్ కమిషన్ సభ్యులుగా ఎలా తీసుకున్నారు? జక్కంపూడి కృష్ణ కిరణ్ పై అమలాపురంలో కేసు నమోదైంది. కాంతారావుపై ఎన్ని కేసులు ఉన్నాయో లెక్కలేదు. రెండు సంవత్సరాలుగా చైర్మన్ గా ఫీల్డ్ విజిట్ చేసి ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేకపోయారు ?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి మనోహర్ నిర్వహించిన తనిఖీల్లో కొన్ని వేల టన్నుల అక్రమ బియ్యం నిల్వలు బయట పడ్డాయి. కాకినాడ పోర్టునుండి గత మూడేళ్లుగా రూ. 750 కోట్లు విలువ చేసే రేషన్ బియ్యం ఆఫ్రికాకు తరలిపోయిందని ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు.

గత రెండున్నర సంత్సరాలుగా వైసీపీ వేసిన రాష్ట్ర ఆహార కమిషన్ దృష్టికి ఈ అక్రమ రవాణా ఎందుకు రాలేదు? ఇంత అక్రమ రవాణా జరుగుతున్నా ఆహారా కమిషన్ ఏం చేస్తోంది…? పనిచేస్తోందా లేదా? ఇంత అక్రమం జరుగుతుంటే ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదు? వైసీపీ ప్రభుత్వం ఉండగా బియ్యం అక్రమ నిల్వలు ఎందుకు బయట పడలేదు?

బియ్యం దారిమళ్లింపు, బియ్యం ఇవ్వడంలేదన్న ఫిర్యాదులు, బియ్యం రీ సైక్లింగ్, బియ్యం అక్రమ నిల్వలపై విజిలెన్స్ దాడుల్లో ఒక్కటి కూడా ఆహార కమిషన్ దృష్టికి రాలేదా? మీరు ఆడంబరంగా వీడియోల్లో చేసిన తనిఖీలు అన్నీ డమ్మీనేనా? ఒక్క కేసు కూడా పెట్టకుండా ఆహార కమిషన్ ఏం చేసింది?

ఆహార కమిషన్ అసలు వీడియోలు తీయవచ్చా? అలా చేయకూడదు కదా? చైర్మన్ సభ్యుల కమిటీ ఒక కోర్టు లాంటిది. ఎవరిపైన అయినా కేసు పెట్టవచ్చు. కేసు పెట్టాక సభ్యులను ఎంక్వైరికోసం పంపాలి. ముద్దాలు అనుకున్నవారికి సమన్లు జారీ చేసి విచారణకు పిలవాలి. క్రిమినల్ కేసులు అయితే దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్ కోర్టుకు పంపాలి. అలా ఒక్కటి కూడా చేయలేదు.

కొత్త గవర్నమెంట్ వచ్చాక కూడా ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు నెలకు ఒక్కసారి వచ్చి లక్షల రూపాయాలు దండుకుంటున్నారు. గతంలో టీడీపీ హయాంలో అనేక మందిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం మారగానే ఆ కేసులను వైసీపీ పట్టించుకోలేదు. ఏపీలో ఫుడ్ కమిషన్ చైర్మన్ కు వచ్చే జీతం రాష్ట్రంలో నలుగురు ఐదురుగు తప్పా ఎవరికి రావడం లేదు.

అంత జీతం తీసుకుని పార్టీ కోసం పనిచేస్తున్నారా?. ఆహార కమిషన్ ప్రజలకోసం పెట్టబడిన కమిషన్.. ఆఫీసుకు రాకుండా ఆహార కమిషన్ ను నిర్వీర్యం చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇలాంటి కమిషన్ లను ప్రక్షాళన చేయాలి.

LEAVE A RESPONSE