Suryaa.co.in

Political News

ఇవేం నియామకాలు?

ఒక తిక్కలోడు బస్సు ఎక్కి రెండు టిక్కెట్లు తీసుకున్నాడు. కండక్టర్ అడిగాడు ఒక్కడికి రెండు టికెట్లు ఎందుకని?
నేను ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను… ఒక టికెట్ పోయినా… రెండో టికెట్ ఉంటుంది. అందుకే నేను రెండు తీసుకున్నాను, అని చెప్తాడు.
మరి రెండు టికెట్లు పోతే అప్పుడు ఏం చేస్తావ్? అని కండక్టర్ అడిగాడు.
అయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే, నాకు బస్సు పాస్ ఉంది…. అని చెప్పాడు.
ఇలాంటి వాళ్లు ముఖ్యమంత్రి అయితే…ఒక ఆర్థిక మంత్రిని,ఆర్థిక శాఖలో అనేక మంది ఐఏఎస్ అధికారులను, సాధారణ సలహాదారులకు అదనంగా ఆర్థిక వ్యవహారాల సలహాదారులను నియమించుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా, రాజకీయాలలో, ప్రభుత్వాలను నడపడంలో… నాయకులకు ఒకప్పుడు సిద్ధాంత పరిజ్ఞానం అవసరం ఉండేది.
ముఖ్యంగా మంత్రులను నియమించేటపుడు, సంబంధిత శాఖలో వారి అవగాహనకు, అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు.
స్వాతంత్రం వచ్చిన తరువాత, నెహ్రూ మొదటి మంత్రివర్గంలో కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకులైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని న్యాయశాఖ మంత్రిగా, భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ ని పరిశ్రమల మంత్రిగా.. తీసుకోవడం జరిగింది. వారు నెహ్రూ అంచనాలను మించి దేశం కోసం సేవలందించారు.
ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రులకు శాఖలు కేటాయించేటప్పుడు… వారి విద్యార్హతలను, వృత్తి నేపథ్యాన్ని పరిగణించి, సరైన వ్యక్తి కి- సరైన శాఖ కేటాయించేవారు.
కానీ ప్రస్తుతం సిద్ధాంతాలకు అతీతంగా… తమ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? అనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రులు. తమ దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? అని ప్రధాన మంత్రులు పని చేస్తున్నారు.
1991 ముందు దేశాధినేతలు ప్రపంచ దేశాల పర్యటనలు చేసి, పెట్టుబడుల సమీకరణకు కృషి చేసేవారు. 1991లో ఆర్థిక సరళీకరణ ప్రారంభమై, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరయ్యే అవకాశం రావడం వల్ల… ఎంతో మంది ముఖ్యమంత్రులు బహుళజాతి సంస్థలను తమ రాష్ట్రాలకు ఆహ్వానించి, పారిశ్రామిక అభివృద్ధికి, లక్షలాది ఉద్యోగావకాశాల కల్పనకు కృషి చేశారు.
దీనికి భిన్నంగా ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో ఆర్థికాభివృద్ధి స్పృహలేని, ఆర్థికాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక లేని, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాధాన్యత తెలియని, ప్రపంచ వ్యాప్తంగా అనేక బహుళజాతి సంస్థలలో కీలక పాత్ర పోషిస్తున్న కోహినూరు వజ్రల్లాంటి ఆంధ్ర ప్రదేశ్ మానవ వనరుల విలువ తెలియని, మొత్తం సమాజాన్ని ఒక కుటుంబం గా భావించి, ముఖ్యమంత్రి స్థాయిలో కుటుంబ పెద్దగా, అందరి అభివృద్ధికి అవసరమైన, విధానాల రూపకల్పన చేసే విశాల దృక్పధం లేని, అందుబాటులో ఉన్న వనరులతో, అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో, ముందుకు దూసుకుపోతున్న ఆంధ్ర జాతిని…… ఆపి….. వెనక్కి తిప్పి… బలవంతంగా ముందుకు తోస్తూ… ఇదే అభివృద్ధి అని బుకాయిస్తున్న…… ఏడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన….. ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం. ఏ రాష్ట్రానికి కూడా రాకూడని కష్టం.

డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు.
రాష్ట్ర అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి

LEAVE A RESPONSE