Suryaa.co.in

Andhra Pradesh

వివేకానంద‌రెడ్డి చనిపోయిన రోజు ఏం జరిగిందంటే..

ఎంపీ అవినాష్‌రెడ్డి సెల్పీ వీడియో..!

వివేకానంద‌రెడ్డి చనిపోయిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని కడప ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆరోజు ఎం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. ఆ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలను అవినాష్ రెడ్డి చెప్పారు. సెల్ఫీ వీడియోలో అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. “శివప్రకాష్‌ రెడ్డి (వివేకా బామ్మర్ది ) నాకు ఉదయం 6:30కి ఫోన్ చేశారు. నేను అప్పటికే జమ్మలమడుగుకు వెళ్తున్నా. జీకే కొండారెడ్డి పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి వెళ్తున్నా. సరిగ్గా పులివెందుల రింగ్‌రోడ్డులో ఉన్నప్పుడు నాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. వివేకా నో మోర్ అని నాకు ఫోన్‌లో చెప్పారు. దీంతో వెంటనే నేను వివేకా ఇంటికి వెళ్లాను. వివేకా రాసిన లెటర్‌, ఫోన్‌ గురించి పీఏ కృష్ణారెడ్డి వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి చెప్పారు. అయితే ఆ లెటర్‌, ఫోన్‌ను దాచమని రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని లేఖలో వివేకా రాశారు. ఈ మొత్తం మర్డర్‌ కేసులో ఆ లెటరే చాలా కీలకం. ప్రసాద్‌ను ఏమైనా అంటారేమో అని లేఖ దాచామని సునీత చెప్పారు. మీ నాన్నను కాకుండా డ్రైవర్‌ ప్రసాద్‌నే నమ్ముతారా? లెటర్‌ విషయాన్ని నాకు , పోలీసులకు చెప్పలేదు. ఆ లెటర్‌ విషయంపై సీబీఐ ఎందుకు ఫోకస్ చేయడం లేదు? ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? మర్డర్‌ అని తెలిసిన తర్వాత కూడా లెటర్ ఎందుకు దాచారు? మీ వైపు తప్పు ఉంది కాబట్టే ఆ లెటర్‌ను దాచారు. ఇదే విషయం నేను సీబీఐకి చెప్పాను.

ఆ లెటర్‌లో వివేకానందరెడ్డి.. ‘నా డ్రైవర్ నేను డ్యూటీకి త్వరగా రమ్మన్నందుకు చచ్చేలా కొట్టాడు. ఈ లెటర్ రాసేందుకు నేను చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దు’ అని పేర్కొన్నారు. ఇది వివేకానందరెడ్డి రాసిన చివరి మాటలు, వివేకానందరెడ్డిది హత్య అని చెప్పడానికి లెటర్ అనేది చాలా కీలక ఆధారం. ఈ లెటర్‌ను ఎందుకు దాచిపెట్టమన్నారని అడిగితే.. “ప్రసాద్ చాలా మంచోడు అని, ఆయనను ఎవరైనా ఎమైనా అంటారని దాచిపెట్టమన్నట్టుగా రాజశేఖర్ రెడ్డి, సునీత చెబుతారు. సునీతా వాళ్ల నాన్నను నమ్మదా?. వాళ్ల నాన్న చివరి సారిగా రాసిన లేఖ, మాటలను నమ్మరా?. ప్రసాద్‌నే ఎక్కువ నమ్ముతారా?. ఇది వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. సీబీఐ స్టేట్‌మెంట్‌లో సునీతా ఒక్కో స్టేట్‌మెంట్‌ ఒక్కో మాదిరిగా చెబుతుంది. ఒక్క స్టేట్‌మెంట్ చాలా వివరంగా చెబుతుంది. తర్వాత స్టేట్‌మెంట్‌లో తప్పులను కవర్ చేస్తుంది. తాను అలా అనలేదని, మర్చిపోయానని చెబుతుంది.

సీబీఐ వాళ్లకు చాలా స్వేచ్చ ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి, సునీత చేసిన మిస్టేక్స్‌‌ను కవర్ చేసుకునే స్వేచ్చ ఇస్తుంది. ఈ విధంగా లెటర్ ఉందని సమయానికి పోలీసులకు గానీ, తనకు గానీ చెప్పకపోవడం.. ఈ కేసులో అతిపెద్ద తప్పు. అటువంటి ఆధారాన్ని దాచిపెడితే సీబీఐ విచారణలో రామ్ సింగ్ అనే దానిని డౌన్ ప్లే చేశారు. ఈ అంశం నన్ను తీవ్రంగా ఆశ్చర్యపరిచింది. సీబీఐ మొత్తాన్ని నేను బ్లేమ్ చేయడం లేదు. రామ్ సింగ్ వైఖరి మాత్రం తేడాగా ఉంది. లెటర్‌ను డౌన్ ప్లే చేయడం ఎవరిని కాపాడేందుకు?. శివప్రకాశ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సునీతను కాపాడేందుకు రామ్ సింగ్ ఇదంతా చేశారు. వాళ్లు చేసేది తప్పు. లెటర్ గురించి సరైన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం అతిపెద్ద తప్పు. సీబీఐ విచారణ తీరు ప్రజలకు తెలియాలి. వివేకా హత్య కేసు చుట్టూ ఎన్నో రాజకీయాలు నడుస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడవద్దనే.. ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగా ఉన్నామని వైయ‌స్ అవినాష్‌రెడ్డి సెల్పీ వీడియోలో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE