జగన్ రెడ్డి చెప్పిన ధరల స్థిరీకరణ నిధి ఏమయ్యింది?

– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి’ అన్నట్లు ఉంది రాష్ట్రంలో టమోటా పంట పరిస్థితి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.3కి పడిపోయి రైతు కంట కన్నీరు తెప్పిస్తుంది. వినియోగదారులు మాత్రం కిలో రూ.30కి పైనే పెట్టి కొనాల్సి వస్తుంది. రైతులను ఆదుకునేందుకు జగన్ రెడ్డి చెప్పిన ధరల స్థిరీకరణ నిధి ఏమయ్యింది? దీనికి కేటాయిస్తాను అన్న రూ. 3 వేల కోట్లు ఎటుపోయాయి? కనీస ధర లేక నష్టపోతున్న టమోటా రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.