రైతుల పేరెత్తే అర్హత జగన్ రెడ్డికి లేదు

– రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారాయి
– ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు నెలల తరబడి ఆలస్యం
– గత ఏడాది ఖరీఫ్ లో 40.31 లక్షల టన్నుల ధాన్యం కోనుగోళ్లే తక్కువ
– ఈ ఏడాది ఖరీఫ్ లో 34 లక్షలకే పరిమితం చేయడం దుర్మార్గం
– టన్నుకు రూ.5వేల వరకు నష్టపోతున్న రైతులు
– తెలంగాణ గత ఏడాది 70 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయగా ఈ ఏడాది ఖరీఫ్ లో కోటి టన్నులు టార్గెట్
– తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైన బుద్ధితెచ్చుకోవాలి
– మంత్రుల కమిటీ ఏర్పాటయ్యాక ఆక్వా రైతులు మరింత నష్టపోయారు
– రాష్ట్రంలో ప్రతి మద్యం సీసాపై ప్రభుత్వ పెద్దలకు కమీషన్ వెళ్తున్నట్లే.. ఆక్వా మేత మీద కూడా  టన్నుకి రూ.5 వేలు కమీషన్
– ఏడాదికి రూ.5వేల కోట్ల లూటీకి కుట్ర

– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ధాన్యం సేకరణ ఈ ఏడాది ఖరీఫ్ లో 34 లక్షల టన్నులకే పరిమితం
రాష్ట్రంలో ధాన్యం, ఆక్వా సాగుచేసే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయరంగం పూర్తిగా కుదేలైంది. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో రాష్ట్రం ఉంది. వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ లో 30 శాతం మాత్రమే ఖర్చుపెడుతున్నారు. వ్యవసాయ సమీక్షలో మాత్రం జగన్ రెడ్డి ఊదరగొడతారు. కానీ చెప్పేదొకటి, చేసేదొకటి. ధాన్యానికి మద్దతు ధర లభించక రైతులు తెగనమ్ముకుంటున్నారు. ధాన్యం టన్నుకు రూ.20,400, క్వింటా రూ.2,040 మద్దతు ధర ఉంది.

టన్నుకు రూ.4 నుంచి రూ.5 వేల వరకు తక్కువకు రైతులు తమ ధాన్యం అమ్ముకునే పరిస్థితి. జగన్ రెడ్డి ధాన్యం సరిగా కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు 6 నెలల వరకు చెల్లించడం లేదు. చంద్రబాబు గారి హయాంలో ఏడు రోజుల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించడం జరిగింది. తెలంగాణలో మూడో రోజే డబ్బులు వేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ లో ధాన్యం సేకరణ 34 లక్షల మెట్రిక్ టన్నులే లక్ష్యంగా పెట్టారు. గతేడాది ఖరీఫ్ లో 40.31 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ కి 34 లక్షలకే పరిమితం చేశారు.

తెలంగాణ గతేడాది ఖరీఫ్ లో 70 లక్షల టన్నులు కొనుగోలు చేయగా.. ఈ ఏడాది ఖరీఫ్ లో కోటి టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.20 వేల కోట్లు రైతులకు చెల్లించడానికి సిద్ధం చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి అధికారికంగా చెప్పారు. జగన్ రెడ్డి గతేడాది ఖరీఫ్ లో 40 లక్షల టన్నులు కొంటే ఈ ఏడాది ఖరీఫ్ లో 60 లక్షల టన్నులకు పెంచాల్సింది పోయి 34 లక్షల టన్నులకు తగ్గించారు.

సమీక్షలో మాత్రం జగన్ రెడ్డి గరిష్ట ప్రయోజనాలు ఉండాలని ఊదరగొడుతున్నారు. రాష్ట్రంలో మిల్లింగ్ ఛార్జీలు, ట్రాన్స్ పోర్ట్ ఛార్జీల కింద ఒక్క నెల్లూరులోనే రూ.247 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో రూ. 900 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ జగన్ రెడ్డి హయాంలోనివే. రవాణ, గోనెసంచులు, హమాలీల ఖర్చులు మావే అంటూ పెద్దపెద్ద హోర్డింగ్ లు పెట్టే జగన్ రెడ్డి.. జరుగుతున్నదేమిటి? వరి పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

రేషన్ బియ్యం ఎగుమతిలో కుంభకోణం
మరోవైపు రేషన్ బియ్యం ఎగుమతిలో మాత్రం పెద్దఎత్తన అవినీతి కుంభకోణం జరుగుతోంది. రేషన్ బియ్యాన్ని కాకినాడ, కృష్ణపట్నం పోర్ట్ నుంచి పెద్దఎత్తున ఎగుమతి జరుగుతోంది. మరోవైపు రైతులకు మద్దతు ధర లభించడం లేదు. తెలంగాణలో మూడో రోజే డబ్బులేస్తూ 75 కేజీల బస్తాలో అరకేజీ కూడా ఎక్కువ తీసుకోవడం లేదు. ఇక్కడ మాత్రం నెల్లూరులోనే క్వింటాల్ కు 20 నుంచి 25 కేజీల వరకు మిల్లర్లు, వైసీపీ నేతలు ఎక్కువ తీసుకుంటున్నారు. ఇక్కడి రైతులను భారీ దోపిడీ చేస్తుండటం దురదృష్టకరం.

రొయ్యల మేతలో రూ.5వేల కోట్ల లూటీ
ఆక్వా రైతుల సమస్యలపై బొత్స, సజ్జల, సీదిరి అప్పల్రాజుతో కమిటీ వేశారు. రొయ్యలకు వంద కౌంట్ కు మార్కెట్ లో రూ.220 ఉంటే. రూ.240కి కొనాలని చెప్పారు. రేట్లు ఫిక్స్ చేశారు. ఇప్పుడు వంద కౌంట్ రూ.190కి పడిపోయింది. ఇవాళ సాక్షిలోనే వచ్చింది. అలాంటప్పుడు కమిటీ ఎందుకు వేశారు? చట్టం తీసుకువచ్చిన తర్వాత ఎందుకు ధరలు పడిపోయాయి? మీ బ్లాక్ మెయిల్ వల్లే ధరలు తగ్గాయి. మద్యం సీసాపై ప్రభుత్వ పెద్దలు రూ.5 రూపాయిలు వసూలు చేసినట్టే.. ఇవాళ ఆక్వా విషయంలో ఫీడ్ కంపెనీల నుంచి కేజీకి రూ.5 చొప్పున టన్నుకు రూ.5 వేలు అడుగుతున్నారు. ఫీడ్ ఫ్యాక్టరీస్ ఏపీలోనే ఎక్కువ ఉన్నాయి.

ఏడాదికి 10 లక్షల టన్నుల రొయ్యల మేత ఉత్పత్తి అవుతోంది. దీంతో రొయ్యల మేతపై ఏడాదికి రూ.5 వేల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీసా మద్యం తాగాలంటే రూ.5 వసూలు చేసినట్టే.. ఆక్వా మేత విషయంలోనూ వసూలు చేస్తున్నారు. మేం ఆక్వా రైతులకు రూ.2 కే కరెంట్ ఇవ్వగా.. ఇప్పుడు జోన్, నాన్ జోన్ అంటూ నాన్ జోన్ లో రూ.4.50 వసూలు చేస్తున్నారు. 60 హార్స్ పవర్ దాటితే.. ఏ జోన్ అయినా రూ.4.50 వసూలు చేస్తున్నారు. మేం ఏరియేటర్స్ రూ.36 వేలది రూ.12 వేలకే ఇవ్వగా.. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆపేశారు. మోటార్లు మేం సబ్సీడీపై ఇస్తే ఇప్పుడు ఆపేశారు. కమిటీ వేసి రేట్ ఫిక్స్ చేసిన తర్వాత రొయ్య ధర కేజీకి రూ.50తగ్గితే.. కమిటీ ఏం చేస్తోంది. రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదు? ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు ఏమయ్యాయి?

ప్రకటనల్లో పచ్చి మోసం
అక్టోబర్ 17న జగన్ రెడ్డి ఇచ్చిన యాడ్ లో 1.33 లక్షల కోట్లు వ్యవసాయ పథకాలకు ఖర్చు పెట్టామని చెప్పారు. ఇందులో ధాన్యం కొనుగోలుకు రూ.45,899 కోట్లు, ఇతర పంటల కొనుగోలుకు రూ.7,156 కోట్లు.. అంటే దాదాపు రూ.53 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇది రైతుల కోసం ఖర్చా? ఇదేమైనా దానమా? మీరు మిల్లింగ్ చేసుకోవడం లేదా, ఎఫ్ సీఐకి అమ్ముకోవడం లేదా, సివిల్ సప్లైయి కోసం వాడుకోవడం లేదా? ఈ విధనమైన ప్రకటనలు రైతులను అవమానించడం కాదా?

రైతుల పేరెత్తే అర్హత జగన్ రెడ్డికి లేదు
జగన్ రెడ్డి చేస్తున్నది పచ్చి మోసం. ఆక్వాపై కమిటీ వేసింది మోసం, ప్రతి గింజా కొంటామని చెప్పడం మోసం, ధరల స్థిరీకరణ నిధి మోసం. రైతుల పేరెత్తే అర్హత జగన్ రెడ్డికి లేదు. రైతులు సర్వనాశనం అయ్యారు. మైక్రో ఇరిగేషన్, యాంత్రీకరణ ఎందుకు అపేశారు? మేం 2017-18 ఒక్క ఏడాదే మైక్రో ఇరిగేషన్ కు రూ.1250 కోట్లు ఖర్చు చేస్తే.. ఎందుకు ఆపేశారు. యాంత్రీకరణ, రైతు రథం కలిపి 2017-18లో రూ.650 కోట్లు ఖర్చు పెడితే ఎందుకు ఆపేశారు? వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పామాయిల్ ధర పడిపోయింది. ఎందుకు ఆదుకోవడం లేదు?

రైతు భరోసా కేంద్రాలు కాదు.. రైతు భక్షక కేంద్రాలు
రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారాయి. మూడున్నరేళ్లలో రైతులను ఇంత నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాన్ని మేం ఇంతవరకు చూడలేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆపేసే హక్కు ఎవరిచ్చారు? సూక్ష్మపోషకాలు మేం ఉచితంగా ఇస్తే.. మీరు ఆపేశారు. రొయ్య రైతులకు ట్రాన్స్ ఫార్మార్ పెట్టాలంటే రూ.2లక్షలు కట్టాలి. మేం ఉచితంగా ఇచ్చాం. వీటన్నింటిపై ఎలాంటి చర్చకైనా మేం సిద్ధం.

డీఎస్పీ బదిలీల్లో ఒక సామాజిక వర్గానికే పెద్దపీట
డీఎస్పీ బదిలీల్లో 30శాతానికి పైగా రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. మీ ఆర్డర్ చూసి మేం చెబుతున్నాం. టీడీపీ హయాంలో పీకే సలహాల మేరకు పచ్చి అబద్ధాలు జగన్ రెడ్డి చెప్పారు. డీఎస్పీల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన 35 మందికి ప్రమోషన్లు అంటూ అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టింరా. పింక్ డైమండ్ మాదిరిగానే ఇది పచ్చిమోసం. ఇప్పుడు జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? సలహాదారులు, కార్పోరేషన్ ఛైర్మన్లలో ఏ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. దేనికైనా హద్దులుంటాయి. ఆ హద్దులు దాటి వెళ్తున్నారు.

Leave a Reply