Suryaa.co.in

Andhra Pradesh

అమరావతిలో జరుగుతున్నది పేదలు-పెత్తందార్ల మధ్య పోరాటం

– పేదల వైపు జగన్‌ …పెత్తందార్ల వైపు చంద్రబాబు
– ఈ కేసు వల్ల ఎవరు ఏ పక్షాన ఉన్నారో సుస్పష్టం
– అమరావతిలో భోపాల్‌ గ్యాస్‌ లాంటి ఫ్యాక్టరీలు పెట్టడం లేదు.. పేదలకు ఇళ్ళు ఇస్తున్నాం..?
– పేదలకు ఇళ్లు ఇస్తుంటే తప్పు పడితే ఎలా..?
– అక్కడ పట్టాలిచ్చింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలకే.
– అసలు వీళ్లని కాదని ఒక రాజకీయ పార్టీ మనగలుగుతుందా..?
– చంద్రబాబు ఆ వర్గాల వారికి దూరంగా వెళ్లిపోయినట్లున్నాడు..
– అందుకే పేదలపైనే బాబు పోరాటం చేస్తున్నాడు
– ఈ కేసు నిలబడదు…ఖచ్చితంగా సుప్రీం కోర్టుకు వెళ్తాం
– ఈ తీర్పుకే విర్రవీగితే… అది వారి భ్రమ
– వైనాట్‌ పులివెందుల అనుకోవడమే మాకూ కావాలి
– ఇంకా వారు భ్రమల్లో ఉండాలి అన్నదే మా కోరిక.
– పులివెందుల సభతో సునీతమ్మ వెనక ఎవరున్నారో స్పష్టమైంది.
– పులివెందులకు ఎవరు వెళ్లినా మోస్ట్‌ వెల్కమ్‌
– అడ్డుకుని, పసుపు నీళ్లతో కడిగే బుద్ధి టీడీపీ వారిదే
– దూరదృష్టితో విజనరీగా పనిచేస్తున్నది వైఎస్‌ జగనే
– వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

పేదల వైపు జగన్‌…పెత్తందార్ల వైపు చంద్రబాబు
సాంకేతిక విషయాలు పక్కన పెడితే అమరావతిలో రెండు వర్గాల మధ్య, రెండు శక్తుల మధ్య పోరాటం జరుగుతుంది. జగన్‌ పేదల పక్షాన నిలబడ్డారు..చంద్రబాబు, టీడీపీ పెత్తందార్లవైపు నిలబడ్డారు. అమరావతి అనేది 30వేల మంది ఇచ్చిన భూములు..దానిలో చాలా వరకూ చేతులు మారాక వాళ్ల ఇష్టాల ప్రకారం నడవడానికి ఇదేమన్నా రియల్‌ ఎస్టేట్‌ వెంచరా..?

ఇక్కడ మౌలిక వసతుల కల్పన, సిటీ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏదన్నా చేస్తే ప్రశ్నించవచ్చు. మేం భోపాల్‌ గ్యాస్‌ లాంటి కెమికల్‌ ఫ్యాక్టరీలు ఏదీ తీసుకొచ్చి పెట్టలేదు కదా.. ఇక్కడ బయట వారిని తీసుకొచ్చి ఎలా పెడతారు అని వారు ప్రశ్నిస్తున్నారు.

నువ్వు ల్యాండ్‌ ఇచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు..?అందులోనే నివాసానికి మాత్రమే ప్లాట్లు ఇచ్చాం.అమరావతిలో పలు ఇనిస్టిట్యూషన్స్‌ ఉన్నాయి..వాటిలో రైతులుంటారా..?కాలేజీలు వచ్చాయి..స్టూడెంట్స్‌..ఇతర బయట వారే కదా ఉండేది.నీ ఆస్థి నువ్వు వాలంటరీగా ఇచ్చావు..దానికి బదులుగా నీకు ప్లాట్లు వచ్చాయి.

సిటీ అభివృద్ధి గతంలో కంటే బెటర్‌గా చేస్తున్నాం.గతంలో కరకట్టకు సరిగ్గా రోడ్డే లేదు. దాన్ని కూడా మేం వేస్తున్నాం.ఖాజా వరకూ కృష్ణా నది గుండా బైపాస్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో పూర్తి కానున్నాయి.అమరావతి ప్రాంత అభివృద్ధికి అత్యవసర లింకేజీ…కనెక్టివిటీ రోడ్లను ఇస్తున్నది జగన్‌ .ఇక్కడ పట్టాలు ఇచ్చిన వారిలో చాలా మంది అమరావతి ప్రాంతం వారే ఉన్నారు. విజయవాడ వారికి కొండపల్లి వద్ద ఇచ్చారు.సాంకేతికంగా చూసినా అమరావతిలో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు చట్టంలో అవకాశం ఉంది.

మాది పంతం కాదు..కక్ష తీర్చుకోవడం అంతకన్నా కాదు మేం పంతానికి చేయలేదు. వాళ్లనుకుంటున్నట్లు కక్ష తీర్చుకోడానికి చేయలేదు.ఏదైతే రంగుల కలను చూపించి అభివృద్ధి మోడల్‌ ఇలా ఉండాలని చంద్రబాబు అనుకున్నాడో అది కాదు అభివృద్ధి అని చెప్తున్నాం. సింగపూర్‌ కంపెనీకి అప్పనంగా 3వేల ఎకరాలు అప్పజెప్పి, వారికి అన్నీ నేనే ఇస్తాను ముప్పై ఏళ్లవరకూ ఏమైనా చేసుకోవచ్చని చెప్పాడు.నిజమైన రైతుల భూములకు రేట్లు పలకకుండా చేసిన పరిస్థితికి భిన్నంగా జగన్‌ సజీవమైన నగరం అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

రోడ్‌ కనెక్టివిటీ, కొత్తగా 50 వేల కుటుంబాలు వస్తున్నాయి.ఇచ్చింది ఎవరికీ దోచిపెట్టలేదు. పేదలు లేనిది సమాజమే లేదు. ఇచ్చింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే.అసలు వీళ్లని కాదనుకుని ఒక రాజకీయ పార్టీ మనగలుగుతుందా..? చంద్రబాబు, ఆయన పార్టీ వారికి దూరంగా వెళ్లిపోయారా అనేది అర్ధం కావడం లేదు.వారికి అవసరమైన ఏర్పాటును జరగకూడదని ఆయన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు జగన్‌ క్లారిటీతోనే మొదలుపెట్టారు..పంతం కోసం కాదు.

30 వేల ఎకరాలు ఏం చేసుకుంటారు..? పేదలకు పనికి రాదా..?:

-అక్కడి అభివృద్ధిలో ఉన్న వివిధ వర్గాలను భాగస్వామ్యం చేస్తున్నారు.అంత ల్యాండ్‌ ఏం చేసుకుంటాడు 30వేల ఎకరాలు..? రాత్రికి రాత్రి ఏం వస్తాయి..? పేదలకు ఇళ్లు ఇవ్వడానికి పనికి రాదా..?అడ్డం కొట్టాలనే శక్తులు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి రొమ్ము విరుచుకుని మా సక్సెస్‌ అనుకుంటే అంతకంటే ఫూలిష్‌నెస్‌ ఉండదు.కనీసం ప్రజలకు ఎవరు ఏ పక్షాన ఉన్నారో తెలుస్తుంది. ఇప్పుడు అది తెలియడానికి ఈ కేసు ఉపయోగపడుతుంది.

నడిపేదంతా వాళ్లే…సొసైటీ అని పేరు చెప్పి దమ్మాలపాటి శ్రీథర్‌ లాంటి లాయర్లతో నడుపుతున్నారు. ఆ లాయర్లనంతా ఎంగేజ్‌ చేసేది చంద్రబాబు నాయుడు.వాళ్ల వాదనలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది.ల్యాండ్‌ అంతా తీసుకుని రూ.340 కోట్లు ఇవ్వాలి..దానిలో 50 శాతం కూడా ఇవ్వలేదంటారు. అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. దానికి సంబంధించి మీరు ప్రశ్నించడానికి స్థానిక అర్హత ఏంటి..? చంద్రబాబు ఊరకనే తీసుకున్నాడా..?

చంద్రబాబు తాను అమరావతి కడతాను అన్నాడని తర్వాత వచ్చే గవర్నమెంట్‌ కూడా ఆయన ఏది చెబితే అదే చేయాలా..? ఇది నిలబడదు…ఖచ్చితంగా ప్రభుత్వం విజయం సాధిస్తుంది. ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలు న్యాయ వ్యవస్థకు కూడా తెలుసు.అందులోనే ఎక్కడా పక్కదారి పట్టలేదు. ప్రభుత్వానికి చేయాల్సిన బాధ్యత చేస్తోంది.

ఆ 30వేల మంది రైతుల్లో చాలా మంది వెళ్లిపోయారు. ఇప్పుడున్న 500 మంది రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు సంఘంగా ఏర్పడ్డ వారు ప్రభుత్వం ఎలా ఉండాలో వారు డిసైడ్‌ చేస్తారా..?తప్పనసరిగా దీన్ని చాలెంజ్‌ చేస్తారు..కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.సుప్రీంకోర్టుకు వెళ్లక తప్పదు..పేదలకు ఉపయోగపడేది అంశం..ప్రభుత్వానికి హక్కున్న అంశం కాబట్టి తప్పనిసరిగా వెళ్తాం.

చంద్రబాబు వైనాట్‌ పులివెందుల అనే భ్రమల్లోనే ఉండాలి:

చంద్రబాబు వైనాట్‌ పులివెందుల అనే అనుకోవాలి అనేది మాకోరిక.ఇంకా భ్రమల్లో ఉండాలి అనేది మా కోరిక.పులివెందుల పులి సునీతమ్మ అనడం ద్వారానే ఎవరి ద్వారా ఆమె ఇన్నాళ్లు చేస్తున్నది తేటతెల్లమైంది.ఎవరెవరు జట్టు కట్టి ఎలా చేస్తున్నారు అనే దానికి ఆయన మాటలే సాక్ష్యం. కుటుంబంలో చీలిక రావాలని, దాన్ని వాడుకోవాలని ఆయన చూస్తున్నాడు.

అలా అనడం కూడా మంచిదే..ఆ ముసుగులు తొలుగుతాయి. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. పులివెందుల సభ సక్సెస్‌ అనుకుంటే, ఆయన కొదమసింహంలా లేస్తే మంచిదే.

ప్రత్యర్ధి ఎప్పుడూ బలంగా ఉన్నప్పుడే గట్టి పోటీ ఉంటుంది. ఇప్పుడుండేది అబద్దపు ప్రచారాలతో ఫేక్‌ పిక్చర్‌..లేనిది ఉన్నట్లు చూపిస్తున్నాడు.

నాలుగేళ్లలో ఏం చేశామో మేం చెప్తాం..మీ 5 ఏళ్లలో ఏం చేశారో మీరు చెప్పండి అని జగన్‌ గారు చెప్తున్నారు. నేను మీ సేవకుడిగా సంతృప్తికరంగా పనిచేశాను అనుకుంటేనే ఆశీర్వదించండి అని జగన్‌ అంటున్నారు. 2014–19 మధ్య తాను ఇది చేశాను అని చెప్పుకోలేక ఆయన సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు.

పులివెందుల ఎవరు వెళ్లినా మోస్ట్‌ వెల్కమ్‌:

ఎన్టీఆర్‌ వెళ్లినా నాడు వైఎస్సార్‌ మోస్ట్‌ వెల్కమ్‌ అన్నాడు. రేణుకా చౌదరి వెళ్లి తొడగొట్టినా…ఆడపడుచు వచ్చింది చీర పెట్టి పంపండి అన్నారు.పులివెందుల అనేది అందరికీ ఓపెన్‌…అభిమానంతో మమ్మల్ని ఆదరిస్తున్నారనే చెపున్నాం.పులివెందులలో ఎవరికీ ఊపిరాడనివ్వరు అని వీరు చెప్తున్నవన్నీ బాబు సభతో అబద్దమైనట్లే కదా..?ఆ అభిమానాన్ని నువ్వు కుప్పంలో ఎందుకు సంపాదించలేకపోయావ్‌..?

నువ్వు కుప్పాన్ని ఎప్పుడో వదిలేశావు..కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు కాబట్టే వాళ్లు కూడా నిన్ను ఆదరించడం లేదు.జగన్‌ కుప్పం పైన కూడా అభిమానం చూపాడు కాబట్టి అంత బాగా ఆయన్ను ఆదరిస్తున్నారు.అందుకే స్థానిక సంస్థల్లో స్వీప్‌ చేశాం..రానున్న ఎన్నికల్లోనూ కాన్ఫిడెంట్‌ గానే ఉన్నాం. 2019లో ఇతని లాంటి వ్యక్తి రాజకీయాలు మాకు అవసరం లేదని ప్రజలు తీర్పునిచ్చారు.జగన్‌ లాంటి వారిని ఆచరణలో చూశారు కాబట్టి మళ్లీ జగన్‌ గారి అక్కున చేర్చుకుంటారని మా నమ్మకం.

పసుపు నీళ్లతో కడిగే బుద్ధి టీడీపీ వారిదే:

ఇతర పార్టీల వారిని రాకూడదు అని అడ్డుకునే బుద్ధి టీడీపీ వారికే ఉన్నాయి.మొన్న సంతనూతలపాడులోనూ దళితుడైన ఎమ్మెల్యే సుధాకర్‌ బాబును కూడా అడ్డుకున్నారు.గతంలోనూ ఇలానే పసుపు నీళ్లతో కడగటం వంటివి చేసే వాళ్లున్నారు.మా దగ్గర అలాంటివి జరిగే అవకాశమే ఉండదు…మా నాయకుడు దాన్ని ప్రోత్సహించడు.సంతనూతలపాడులో పసుపు నీళ్లతో కడిగింది అహంకారంతో జరిగిందే.

మేము అనుకుంటే లోకేశ్‌ అంత ఫ్రీగా తిరుగుతాడా..? పులివెందులలో గొడవలు క్రియేట్‌ చేయాలనుకుంటే పెద్ద విషయమా..?ఏనాడూ మేం అలాంటి సంస్కృతిని విశ్వసించలేదు. మేం ఫ్యాక్షన్‌ చేయడం లేదు. కానీ ఆ బుద్ధి టీడీపీలో ఉంది. ఆ అహంకారం కూడా ఇంకా ఉంది. అన్నీ మేం డిసైడ్‌ చేస్తాం అనేది కూడా కనిపిస్తోంది.

ఎక్కడో చోట రెచ్చగొట్టి గొడవ పెట్టి దాన్ని చూపించి సానుభూతి పొందాలని కూడా చూస్తున్నారు దానికి మేం ఛాన్స్‌ ఇవ్వం…మా వాళ్లకు కూడా అలాంటి వాటికి పోవద్దని చెప్తున్నాం.సాగునీటి ప్రాజెక్టులు చంద్రబాబుకు నేడు గుర్తుకు వచ్చాయా..? జగనన్న సురక్ష లాంటి విషయాలు ప్రజల్లోకి వెళ్లకూడదని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ వారు ప్రభుత్వం, వ్యవస్థలపై విశ్వాసం పోయేలా బిహేవ్‌ చేస్తున్నారు. కారణం వీళ్లు అధికారంలో లేరు కాబట్టి…అడ్డగోలు ప్రశ్నలు వేస్తూ వితండవాదాలతో సాంకేతికంగా లిటిగెంటులా ప్రవర్తిస్తున్నారు.

కాకిలెక్కలు కాదు…ఎంత ఆయకట్టు సృష్టించావ్‌ బాబూ..?:

చంద్రబాబు రూ.68 వేల కోట్లు పెట్టాడా లేదా అనేది పక్కన పెడితే లక్షల కోట్లు ఆనాడు మింగేశాడు.నీ రూ.68 వేల కోట్లతో నువ్వు ఏం సాధించావ్‌..? ఎంత కొత్త ఆయకట్టు తీసుకొచ్చావ్‌…? ప్రాజెక్టుపై మట్టిపని మొత్తం చేశాను అంటే ఎలా..?జగన్‌ వచ్చాక విమర్శలకు సంబంధం లేకుండా ప్రాజెక్టులపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. శ్రీశైలంలో వరద రోజులు తగ్గుతున్నాయి కాబట్టి ఆనాడు రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు వెడల్పును 11వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు మార్చారు.

జగన్‌ దాన్ని 80 వేల క్యూసెక్కులకు మారుస్తున్నారు…పని నడుస్తోంది.అటువంటి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై పనులు జరగకుండా చంద్రబాబు మనుషులే ఎన్జీటీకి వెళ్లారు. తన హయాంలో తెలంగాణా 800 అడుగుల్లో లిఫ్టు పెడుతుంటే ఆపే ప్రయత్నం చేయలేదు.ఇప్పుడు మన రాష్ట్రంలో చేస్తుంటే మాత్రం అడ్డుకుంటున్నాడు.ఒక పాలసీ మేకర్‌గా ఊరక డబ్బు తీసుకెళ్లి పెట్టాను అంటే ఫలితం ఏంటో చూపించాలి కదా..?

జగన్‌ చేస్తున్న దానివల్ల రానున్న నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యి సాగునీరు అందేలా ఉంటుంది. చంద్రబాబు బ్రమల్లో పెట్టి ఓట్లు దండుకునే కార్యక్రమం. దీర్ఘదృష్టితో ఒక విజనరీ చేసే పని జగన్‌ చేస్తున్నారు.

బాబు అప్పులు జేబుల్లోకి…మా అప్పులు ప్రజల ఖాతాల్లోకి:

పురందేశ్వరి అనే మాటలకు ఆధారాలు, చర్చ అంటే కుదరదు.ముందు నిర్మలా సీతారామన్‌తో చెప్పిస్తే ఒక వ్యాల్యూ ఉంటుంది.బీజేపీ ఒక రాజకీయ పార్టీ కాబట్టి వారి ఉనికి కోసం ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఆర్‌బీఐ, సీఏజీ వంటి సంస్థలు ఏదైనా అంటే వివరణ ఇవ్వాలి.ఒక్కో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఒక్కో రకంగా ఉంటాయి.

చంద్రబాబు రూ.90 వేల కోట్లను రూ.2.64 లక్షల కోట్లకు పెంచి వెళ్లాడు.మా డీబీటీనే రూ.2.30 లక్షల కోట్లు పంపిణీ చేశాం. నీ హయాంలో రూ.2.64 లక్షల కోట్లు అప్పు..కార్పొరేషన్ల అప్పులు కలుపుకుంటే సుమారు రూ.4 లక్షల కోట్లు అప్పుచేశాడు.అసలు కాంట్రాక్టర్లకు 2లక్షల కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉండటానికి అవకాశం ఉందా..? అసలు అది సాధ్యమా..?

ఏపీ ప్రభుత్వంగా మా ప్రయారిటీలు మాకుంటాయి…ఆ ప్రయారిటీలకు కాకుండా వేరే ఖర్చు చేస్తే మాట్లాడాలి. కోవిడ్‌ పరిస్థితుల్లోనూ మేం పెద్దగా అప్పు చేయలేదు. అవసరాన్ని బట్టి కావాల్సిన వరకే అప్పులు తెచ్చాం.

కడుపుమంటతో వాలంటీర్‌ వ్యవస్థపై విషపు రాతలు:

వాలంటీర్లు ఎవరో ఈ మధ్య ఒక హత్య చేశాడని వార్తలు వచ్చాయి. ఒక వ్యక్తి ఒకలా బిహేవ్‌ చేయడానికి మీ పత్రికల్లో పనిచేసే విలేకరుల్లోనూ అలాంటి వారు ఉండొచ్చు. దొంగలు, మోసకారులు అన్ని రకాల రంగాల్లో ఉన్నారు.అంతమాత్రాన ఆ వర్గాన్ని మొత్తాన్ని తప్పుపట్టి గంజాయి అమ్మేవారు, హంతకులు అనే ముద్ర వేయడం ఘోరం.

మొత్తం వ్యవస్థమీదనే ప్రజలకు నమ్మకం లేకుండా చేసే ప్రయత్నం దారుణం. అధికారంలో లేమనే కడుపుమంటతో వచ్చిన ఆరాటంతో ఇలాంటివి చేస్తున్నారేమో అనిపిస్తోంది. వారికి అర్జంటుగా చంద్రబాబును సీట్లో కూర్చోబెట్టాలి అనేదే వారి తాపత్రయం.దానికోసం జగన్‌ కి మద్దతు పలుకుతున్న వ్యక్తులు, వ్యవస్థలను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. మళ్లీ వాళ్ల వద్దకే వెళ్లి ఓట్లు అడగాలి అనే స్పృహ కూడా లేని విధంగా వారికి పిచ్చిపట్టింది.

నవ శకానికి నాంది..జగనన్న సురక్ష:

గతంలో చంద్రబాబు ప్రజల వద్దకు పాలనని, జన్మభూమి కమిటీలంటూ ప్రచారం చేసుకోడానికే ప్రయత్నం చేశాడు.అప్పట్లో ఎన్నో దరఖాస్తులు పెండింగులో ఉండేవి. కట్టల కట్టల అప్లికేషన్లు చెత్తకుప్పల్లో దొరికేవి. గ్రామ సభలు పెడితే గొడవలు జరిగేవి.ఒకరు చనిపోతే తప్ప మరొకరి పింఛన్‌ రాని పరిస్థితులను చూశాం.

గతంలో ఒక పీడకలలా ఉన్న ఈ వ్యవస్థను సంపూర్ణంగా మార్చి జగన్‌ ఒక కొత్త శకానికి నాంది పలికారు.ఆనాడు రాజశేఖరరెడ్డి శాచురేషన్‌ స్థాయిలో పరిపాలనను తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు.సంతృప్త స్థాయిలో అర్హత ఉంటే పథకం రావాలనే దిశగా ప్రయత్నం చేశాం.అలా చేయాలంటే కావాల్సిన యంత్రాంగం ఉండాలి…వ్యవస్థ కావాలి.

వెంటనే లబ్ధిదారులకు కావాల్సింది అందేలా, ఎక్కడా ఎలాంటి ఆరోపణలు లేకుండా ఒక యంగ్‌ బ్లడ్‌ను వ్యవస్థలో నింపారు.దాని ఫలితమే ఒకటో తేదీన 80 శాతం పింఛన్లు అవ్వా తాతల చేతుల్లో పడుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడం, ఇన్‌పుట్‌ సబ్సిడీ అదే సీజన్లోనే అందించడం వంటివి సాధ్యమవుతున్నాయి. స్పందన కార్యక్రమం గతంలోనూ ఉండేవి కానీ..దానిని మరింత బెటర్‌గా తీర్చిదిద్దాం.

దీనికోసం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం.సర్టిఫికెట్లతో పాటు ఇంకా సమస్యలేమైనా ఉంటే మనమే ప్రజలవద్దకు వెళదామని జగనన్న సురక్ష కార్యక్రమం కూడా చేపట్టారు. ఇంకా మిగిలిన లబ్ధిదారులను సైతం గుర్తించి సీనియర్‌ అధికారులను కూడా కింది స్థాయికి పంపించి మరీ సేవలందిస్తున్నారు.

జగన్‌ తన పాదయాత్రలో గడప గడపనూ టచ్‌ చేశారు..ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తాను ఒక వ్యవస్థనే గడప గడపకూ తీసుకెళ్లాడు. ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా ప్రజల గడప వద్దకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు వేసి ముందుకెళ్లారు.అందుకే జగనన్న సురక్ష సక్సెస్‌ఫుల్‌ అయింది.జూన్‌23న ఈ కార్యక్రమాన్ని లాంచ్‌ చేస్తే..జులై 1వ తేదీ నుంచి మొన్నటి వరకు 15004 క్యాంపులు జరిగాయి.

మొత్తం కోటి 46 లక్షల కుటుంబాలను వాలంటీర్లు టచ్‌ చేశారు. వెళ్లి మీకేం సమస్యలున్నాయని అడిగారు..ఇంకా ఏం కావాలని అడిగారు. సర్వీసులకు సంబంధించి 94.5లక్షల దరఖాస్తులు వస్తే 93.57 లక్షల సర్వీసులను పరిష్కరించారు. 97 శాతం పరిష్కారమయ్యాయి. ఒక్క రోజులోనే 7.54 లక్షల వినతులను రికార్డు స్థాయిలో పరిష్కరించారు.

ఇందులో క్యాస్ట్‌ సర్టిఫికెట్లు 47.33 లక్షలు, ఇన్‌కం సర్టిఫికెట్లు 41.50 లక్షలు, ఆధార్‌ అప్డేట్‌ కోసం 2.72 లక్షలు, ల్యాండ్‌ టైటిల్‌ రికార్డ్‌అప్డేట్‌ వంటివి అనేక సేవలు ఈ కార్యక్రమంలో అందించారు. ఈ సమస్యలన్నీ ఒక నెలరోజుల్లోనే పరిష్కరించారు. వ్యవస్థే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించడం దేశంలోనే తొలిసారి.

ఇదే కార్యక్రమం ఏటా రెండు సార్లు చేస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో ప్రజలతో నేరుగా ప్రత్యక్షంగా ప్రభుత్వం సంబంధాలు కలిగి ఉంటుంది. కీలకమైన సేవలను కష్టపడకుండా ఇంటివద్దకే డెలివరీ చేసే విధంగా వ్యవస్థ క్రియాశీలకంగా పనిచేస్తోంది.లక్షల మంది వాలంటీర్లు, సెక్రటేరియట్‌ సిబ్బంది, ఉన్నతాధికారులు ఈ విజయంలో భాగస్వామ్యులయ్యారు.మరింత ఉన్నతంగా సేవలు అందించేందుకు సలహాలు సూచనలు ఉంటే ఆహ్వానిస్తున్నాం.

విపత్తులో వీవీఐపీలు ఎందుకు..?:

ఈ మధ్య వరదలు, వర్షాలు వచ్చాయి..ప్రతి సారీ చంద్రబాబు, ఆయన తోకపార్టీలు సీఎం ఎక్కడా అని అడుగుతున్నారు. వాళ్లకు ఈ వ్యవస్థ సరైన సమాధానం చెప్పింది.విపత్తు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం అసలు వీవీఐపీల మూమెంటే ఉండకపోతేనే బాగుంటుందని ఉంది.సీఎం అక్కడకు వెళితే…ఆయన వెంట కలెక్టర్‌తో సహా అంతా ఆ వీవీఐపీ వెంటే ఉంటే రిలీఫ్‌ మెజర్స్‌ ఎవరు చూస్తారు..?

ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా వ్యవస్థకు అడ్డం పోకూడదు. వరదలు తగ్గాక, సహాయ చర్యలు ఎంత ఎఫెక్టివ్‌గా జరిగాయో చూడాలి. ముఖ్యమంత్రి నాలుగైదు జిల్లాల్లో వరద వచ్చిన చోట్ల ముందుగా వారి చేతిలో డబ్బు పెట్టారు. క్షేత్ర స్థాయిలో వాలంటీర్‌ వ్యవస్థ రియల్‌ టైమ్‌లో సహాయక చర్యలతో పాటు నష్టం ఎంతనేది అంచనా వేశారు.

క్యాంపులకు తరలించాల్సిన వారిని తరలించారు. సరుకులు కూడా డెలివరీ చేశారు. అంతా అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తారు. కానీ చంద్రబాబు మాత్రం స్క్రీన్‌ అంతా తానే కనిపిస్తూ అధికారులను తన చుట్టూ కూర్చోబెట్టుకోవాలా..?

అధికారలంతా వీవీఐపీ వద్ద ఉంటే చేయాల్సిన సహాయక చర్యలు ముందుకు సాగేదెలా..?వ్యక్తి తనను తాను ప్రచారం చేసుకోడానికి ఓ కేజీ టమాటోలో ఇంకేదో మోసుకెళ్లి ప్రచారం చేసుకోవాలా..?ఆపన్నులకు అందుబాటులో ఉండి సర్వీసు చేసేలా వ్యవస్థను ఉంచాలా..?
చంద్రబాబు మాత్రం తన విధానమే మేలు అంటున్నాడు. అందుకే ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లలేదు అని ప్రశ్నిస్తున్నాడు. ముఖ్యమంత్రి వెళ్లి అక్కడి వారి కాళ్లకు ఎందుకు అడ్డం పడలేదని చంద్రబాబు అడగడం విడ్డూరంగా ఉంది. ఈ వ్యవస్థ వల్ల పారదర్శకత, అవినీతికి చెక్‌ పెట్టగలిగాం. గతంలో విత్తనం కావాలంటే రైతులు క్యూలో చెప్పులు పెట్టి వచ్చేవారు.

ఎరువులు, విత్తనాల కోసం లాఠీ ఛార్జీలు కూడా జరిగేవి.అలా జరగపోతే నన్ను ఎవరు గుర్తిస్తారు అని చంద్రబాబు అనుకుంటున్నాడు.అదే గవర్నెన్స్‌ అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేం.ప్రజలకు ఈ వ్యవస్థ బాగుందని, కొనసాగాలని కోరుకుంటున్నారు.కానీ చంద్రబాబు హయాంలో పీడకలలా ఉన్న ఆ ఐదేళ్లు గుర్తు తెచ్చుకోడానికి కూడా వెనుకాడుతున్నారు.

 

LEAVE A RESPONSE