కోదండ రామ్ కు ఉన్న అర్హత ఏమిటీ ..నాకు లేనిదేమిటి ?

-నేను గవర్నర్ భాదితుణ్ణి
-గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారు
-పార్టీ అధ్యక్షుడు అయిన కోదండ రాంకు ఎలా ఓకే చేస్తారు?
-కాంగ్రెస్ కు ఎరుకల కులానికి ఎమ్మెల్సీ ఇచ్చే దైర్యం ఉందా ?
-మాజీ ఎమ్మెల్యే కె .సత్యనారాయణ

నేను గవర్నర్ భాదితుణ్ణి. దాదాపు 40 యేళ్లుగా ప్రజా జీవితం లో ఉన్నా. నాది తెరచిన పుస్తకం లాంటి జీవితం. ఎలాంటి మచ్చ లేదునా కులం ఎరుకల అయినప్పటికీ జనరల్ సీటు లో ఎమ్మెల్యే గా గెలిచిన చరిత్ర.

ఎరుకల కోసం కేసీఆర్ మంచి స్కీం లు తెచ్చారు. అంతకుముందు ఎరుకల గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. నా సేవలను గుర్తించి కేసీఆర్ గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీ గా నామినేట్ చేశారు. ఎరుకల జాతి నుంచి కనీసం ఎంపీటీసీ కూడా లేని పరిస్థితుల్లో ఎమ్మెల్సీ గా నామినేట్ చేశారు. రాజ్యాంగ పరిరక్షరాలిగా ఉండాల్సిన గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. నా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించిన తీరు భాధ కలిగించింది.

కోదండ రామ్ కు ఉన్న అర్హత ఏమిటీ ..నాకు లేనిదేమిటి ? సీఎం రేవంత్ దొడ్లలో చెప్పులు మోసే వారికి కేసీఆర్ ఎమ్మెల్సీ లుగా నామినేట్ చేశారనడం బాధాకరం. నా జాతిని రేవంత్ అవమాన పరిచారు. సమాజం లో మా లాంటి గరీబోళ్ల కు స్థానం లేదా? రేవంత్ అహంకారం తగ్గించుకోవాలి. సీఎం పద్దతిగా మాట్లాడటం నేర్చుకోవాలి. రేవంత్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. నేను ఎవ్వరి చెప్పులు మోయ లేదు. రాజకీయ నాయకుడినని నా పేరు ను తిరస్కరించిన గవర్నర్, ఓ పార్టీ అధ్యక్షుడు అయిన కోదండ రాం కు ఎలా ఓకే చేస్తారు?

మేము గవర్నర్ నిర్ణయం మీద కేసు వేసినపుడు కోదండ రాం పేరు ఎమ్మెల్సీ కి పంపలేదు. తెలంగాణ జన సమితి కేసీఆర్ ను ఎందుకు తప్పు బడుతోంది ? కేసీఆర్ దిష్టి బొమ్మల దహనానికి ఎందుకు పిలుపు నిచ్చారు ? మేము సీఎం దిష్టి బొమ్మలు కాల్చలేమా ? కాంగ్రెస్ కు ఎరుకల కులానికి ఎమ్మెల్సీ ఇచ్చే దైర్యం ఉందా ? నా పేరు గవర్నర్ తిరస్కరించినపుడు ఇంకో ఎరుకల కులస్థుడిని రేవంత్ ఎమ్మెల్సీ కి నామినేట్ ఎందుకు చేయలేదు? రేవంత్ మాట్లాడేటపుడు తాను సీఎం ననే విషయం మరచిపోవద్దు. చిన్న కులాల నేతలను విమర్శించేపుడు సీఎం సంయమనం పాటించాలి.

రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షుడు కుతాడి రాములు ….
చెప్పులు మోసే వారికి కేసీఆర్ గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీకి నామినేటెడ్ చేశారనడం అభ్యంతరకరం. ఎరుకల జాతిని సీఎం రేవంత్ అవమానించారు. సమాజానికి ఎరుకల కులం చేస్తున్న సేవలను రేవంత్ విస్మరించారు. మాకు ఎమ్మెల్సీ గా లేక లేక అవకాశం వస్తుందనుకుంటే గవర్నర్ దాన్ని కాకుండా చేశారు. గవర్నర్ చేసిన తప్పునే సీఎం రేవంత్ తన వ్యాఖ్యల ద్వారా చేశారు. ఎరుకలను కించపరచడం చాలా తప్పు.మేము సీఎం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.

Leave a Reply