Suryaa.co.in

Devotional

రథసప్తమి రోజున ఏమి చేయాలి ?

మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. ఆరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం వల్ల మహాఫలం లభిస్తుంది. ఆ నెల అంతా నియమం ప్రకారంగా అందరూ స్నానం చేయాలి.ఈ మాసంలో ఈ శ్లోకాన్ని చదువుతూ సంకల్పం చేయాలి.

దుఃఖదారిద్ర్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయచ
ప్రతఃస్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం
దుఃఖాన్ని , దారిద్యాన్ని పోగొట్టేది , విష్ణు ప్రీతికొరకు , పాపాన్ని పోగొట్టుకోవడం కోసం మాఘమాసంలో స్నానం చేస్తున్నాము.

స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చదవాలి
మకరస్థే రవౌ మఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేన అనేన మేదేవ యథోక్త ఫలదో భవ
ఓగోవింద , అచ్యుత , మాధవ ,

మకరరాశిలో సూర్యుడుండగా ఈ స్నానానికి తగిన ఫలం ఇప్పించు అనే ప్రార్థన ఉంటుంది. స్నానం చేసిన తర్వాత దోసిలినిండా నీళ్ళు తీసుకొని ఈ శ్లోకం చెబుతూ సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి.

సవితే ప్రసవిత్రే చ ప్రంధామ జలేమమ
త్వత్తేజపా పరిభష్టం పాపంయాతు సహస్రధా
ఓ సూర్యభగవాన్ ! నీ తేజస్సుచేత నాపాపం వేయి విధాలుగా చీలిపోవుగాక.

రథ సప్తమి నాడు:
యద్యత్ జన్మకృతం పాపం మయా సప్తమ జన్మసు
తన్మేరోగం చ సోకం మాకరీ హంతు సప్తమీ
ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనోవాక్కయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతంచ యత్పువ:
ఇతి స్ప్తవిధం పాపం స్నానాన్మే స్ప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి

ఓ మకరరాశిలో ఉన్న సప్తమి ! ఈ జన్మలో ఏడు జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టు రోగాన్ని శోకాని లేకుండా చేయి. తెలిసి తెలీయక చేసిన పాపాన్ని మనస్సు వాక్కు శరీరం ద్వారా చేస్తున్న పాపాలను పోగొట్టును.
ఆనాడు జిల్లేడు ఆకులు , రేగు ఆకులు , పండ్లు , నెత్తిమీద పెట్తుకొని స్నానం చేయడం ఆచారం. ఆపైన సూర్యునికి ఆర్ఘ్యం (దోసిలితో నీళ్ళు వదలుట) ఇవ్వాలి.

సప్త సప్తి మహాప్రీతి సప్తలోకప్రదీవన
సప్తమీ సహితోదేవ , గృహాణార్ఘ్యం దివాకర

ఏడులోకాలకు కాంతినిచ్చే సూర్యదేవ సప్తమి తిథితో కూడుకున్నవాడా ఈ ఆర్ఘ్యాన్ని తీసుకో.
ఆపైన సూర్యునికి ఈ శ్లోకాన్ని చెబుతూ నమస్కరించాలి.

జననీ సర్వలోకానాం సప్తమీ సప్త సప్తికే
సప్తవ్యాహృతికే దేవి , నమస్తే సూర్యమండల

సూర్యమండలంలో ఉండే ఓ సవితృదేవత ! అన్ని లోకాలకు తల్లివి నీవు. భూః భువః సువః మొదలగు వ్యాహృతులతో కూడి యున్నదానవు,నీకు నమస్కారము.🌞🙏

బ్రాహ్మణ చైతన్య వేదిక

LEAVE A RESPONSE